కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మార్చి పేజీ 32
  • అద్దాన్ని సరిగ్గా వాడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అద్దాన్ని సరిగ్గా వాడండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వయంత్యాగ స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • అందంగా కనబడాలని నేనెందుకు వర్రీ అవుతున్నాను?
    యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • నేను ఇలాంటి వ్యక్తిగా ఉండాలి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ‘మొదట మీకున్న ప్రేమను’ కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మార్చి పేజీ 32

అధ్యయనం చేయడానికి ఐడియాలు

అద్దాన్ని సరిగ్గా వాడండి

బైబిల్ని, మనం లోపల ఎలా ఉన్నామో చూసుకునే అద్దంతో శిష్యుడైన యాకోబు పోల్చాడు. (యాకో. 1:22-25) అయితే, ఆ అద్దాన్ని ఎలా సరిగ్గా వాడవచ్చు?

జాగ్రత్తగా చదవండి. మనల్ని మనం అద్దంలో పైపైన చూసుకుంటే కొన్ని లోపాలు కనిపించకపోవచ్చు. అందుకే, మన లోపల ఉన్న లోపాల్ని సరిచేసుకోవాలంటే, దేవుని వాక్యంలోకి తీక్షణంగా చూడాలి, జాగ్రత్తగా చదవాలి.

వేరేవాళ్లను కాదు మిమ్మల్నే ఎక్కువ చూసుకోండి. అద్దాన్ని ఒక ఆంగిల్‌లో తిప్పితే వేరేవాళ్లు కనిపిస్తారు, వాళ్ల లోపాలు కనిపిస్తాయి. అదేవిధంగా, బైబిల్ని వేరేవాళ్ల తప్పులు గుర్తించడానికి మనం వాడే అవకాశం ఉంది. కానీ అలాచేస్తే, మన లోపాల్ని సరిచేసుకోలేం కదా.

మరీ ఎక్కువ ఆశించకండి. అద్దం చూపించే లోపాల మీదే మనం ఎక్కువ మనసుపెడితే, మనకు మనం నచ్చకపోవచ్చు. అలాగే బైబిల్ని చదువుతున్నప్పుడు కూడా యెహోవా మన నుండి ఆశించే దానికన్నా మన గురించి మనం ఎక్కువ ఆశించకూడదు.—యాకో. 3:17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి