కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp23 No. 1 పేజీలు 10-11
  • 3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంటే . . .
  • దానివల్ల ఉపయోగం
  • 2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • 4 | బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)
    యువత అడిగే ప్రశ్నలు
  • నా భావోద్వేగాల్ని ఎలా అదుపు చేసుకోవాలి?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
wp23 No. 1 పేజీలు 10-11
మోషే ప్రవక్త బాధలో ఉన్నాడు; ఆకాశం వైపు చూస్తూ దేవునికి ప్రార్థిస్తున్నాడు.

3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు

బైబిల్లో . . . “మనలాంటి భావాలు” ఉన్న నమ్మకమైన స్త్రీపురుషుల అనుభవాలు ఉన్నాయి.​—యాకోబు 5:17.

అంటే . . .

ఒకప్పుడు ఇదే భూమ్మీద జీవించిన, మనలాగే రకరకాల ఫీలింగ్స్‌ ఉన్న ఎంతోమంది స్త్రీపురుషుల గురించి బైబిల్లో ఉంది. వాళ్ల గురించి చదువుతున్నప్పుడు, వాళ్లలో ఎవరో ఒకరు అచ్చం మన లాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని అనిపించవచ్చు.

దానివల్ల ఉపయోగం

మన పరిస్థితిని వేరేవాళ్లు అర్థం చేసుకుంటారనే నమ్మకం మనకు ఉండాలి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు ఇలాంటి నమ్మకం ఉండడం చాలా అవసరం. కొంతమంది గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు వాళ్లకూ మనలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని; వాళ్ల ఆలోచనలు, ఫీలింగ్స్‌ మనలాగే ఉండేవని తెలుసుకుంటాం. మనలాంటి పరిస్థితి వేరేవాళ్లు కూడా అనుభవించారని తెలుసుకున్నప్పుడు ఆందోళనను, డిప్రెషన్‌ను తట్టుకోవడం తేలికౌతుంది.

  • ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో, నిరాశలో ఉన్న కొంతమంది గురించి బైబిల్లో ఉంది. ఇక బ్రతకడం నావల్ల కాదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకప్పుడు జీవించిన మోషేకు, ఏలీయాకు, దావీదుకు అలా అనిపించింది.​—సంఖ్యాకాండం 11:14; 1 రాజులు 19:4; కీర్తన 55:4.

  • బైబిల్లో హన్నా అనే ఒక ఆమె గురించి ఉంది. అసలే పిల్లలు లేరని బాధపడుతుంటే, ఇంకోవైపు అవకాశం చిక్కినప్పుడల్లా ఆమె సవతి దెప్పి పొడుస్తూ ఉండేది. దాంతో హన్నా తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది.​—1 సమూయేలు 1:6, 10.

  • బైబిల్లో యోబు అనే ఆయన గురించి కూడా ఉంది. యోబుకు యెహోవా మీద చాలా విశ్వాసం ఉండేది. కానీ ఒక పెద్ద కష్టం వచ్చి పడినప్పుడు ఆయనకు భరించలేనంత బాధగా అనిపించింది. అప్పుడాయన, “నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది; ఇక బ్రతకాలని లేదు” అన్నాడు.​—యోబు 7:16.

వీళ్లందరూ నెగెటివ్‌ ఆలోచనల నుండి ఎలా బయటపడ్డారో తెలుసుకుంటే, మనం కూడా మన సమస్యల్ని తట్టుకోవడానికి కావల్సిన బలాన్ని పొందుతాం.

బైబిలు నాకు ఎలా సహాయం చేసిందంటే . . . కెవిన్‌

నాకు బైపోలార్‌ డిజార్డర్‌ ఉంది

కెవిన్‌ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాఫీ తాగుతున్నాడు.

“సుమారు 50 ఏళ్లు ఉన్నప్పుడు నాకు బైపోలార్‌ డిజార్డర్‌ ఉందని తెలిసింది. కొన్నిసార్లు జీవితంలో దేన్నైనా తట్టుకోగలను అనిపిస్తుంది; ఇంకొన్నిసార్లు బ్రతకడం అనవసరం అనిపిస్తుంది.”

బైబిలు సహాయం చేసింది

“బైబిల్లో పేతురు గురించి చదివినప్పుడు, ఆయన నాలాంటి వాడే అనిపిస్తుంది. ఆయన చేసిన పొరపాట్ల వల్ల తాను ఎందుకూ పనికిరానని అనుకున్నాడు. కానీ ఆయన ఆ ఆలోచనతో అక్కడే ఆగిపోకుండా, ఆయన్ని పట్టించుకునే స్నేహితులతో టైం గడిపాడు. నాకు బైపోలార్‌ డిజార్డర్‌ ఉండడం వల్ల కొన్నిసార్లు నా పొరపాట్లు, లోపాలు గుర్తొచ్చి నేనెందుకూ పనికిరాను అనిపిస్తుంది. అలాంటప్పుడు పేతురులాగే నేను కూడా నా స్నేహితులతో ఎక్కువ టైం గడపాలని తెలుసుకున్నాను. ఎందుకంటే జీవితంలో ముందుకెళ్లడానికి వాళ్లు నాకు సహాయం చేస్తారు.

“బైబిల్లో దావీదు రాజు గురించి చదివినప్పుడు కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. ఆయన చాలా సందర్భాల్లో తన పరి​స్థితిని తలచుకొని కృంగిపోయాడు, గతంలో చేసిన పొరపాట్ల గురించి కుమిలిపోయాడు. నాది కూడా ఆయనలాంటి పరిస్థితే. కొన్నిసార్లు నా పనుల్ని, మాటల్ని తలచుకొని చాలా బాధపడుతుంటాను. అయితే, దావీదు రాసిన 51వ కీర్తన చదివినప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తుంది. అందులో 3వ వచనంలో దావీదు ఇలా రాశాడు: ‘నా అపరాధాలు నాకు బాగా తెలుసు, నా పాపం ఎప్పుడూ నా ఎదుటే ఉంది.’ బాగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నాకు అచ్చం ఇలానే అనిపిస్తుంది. నా గురించి నేను పాజిటివ్‌గా ఆలోచిద్దామని ఎంత ప్రయత్నించినా నావల్ల కాదు. ఆయన 10వ వచనంలో రాసిన మాటలు కూడా నా పరిస్థితికి సరిపోతాయి. ‘దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించు, స్థిరంగా ఉండే కొత్త మనోవైఖరిని నాకు ఇవ్వు’ అని అక్కడ ఆయన రాశాడు. నేను కూడా ఇలాగే పాజిటివ్‌గా ఆలోచించడానికి సహాయం చేయమని దేవున్ని అడుగుతూ ఉంటాను. చివరిగా 17వ వచనంలో ఉన్న మాటలు నాకు మనశ్శాంతిని ఇస్తాయి. ‘దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు’ అని అక్కడ ఉంది. ఈ మాటలు చదివినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మకం కలుగుతుంది.

“బైబిల్లో ఉన్నవాళ్ల గురించి, దేవుడు ఇప్పుడు నాకిచ్చిన వాటి గురించి ఆలోచించడం వల్ల నాకు భవిష్యత్తు మీద ఆశ పెరిగింది. బైబిల్లో దేవుడు ఇచ్చిన మాట నిజమౌతుందనే నమ్మకం ఉండడంవల్ల, అన్నిటినీ తట్టుకుని జీవితంలో ముందుకు వెళ్తున్నాను.”

మరింత ఓదార్పు కోసం:

2019 నం. 2, కావలికోట పత్రికలో “బ్రతకడం ఇక నావల్ల కాదని అనిపించినప్పుడు” అనే ఆర్టికల్‌ చదవండి. ఇది jw.org వెబ్‌సైట్‌లో ఉంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి