కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp23 No. 1 పేజీలు 8-9
  • 2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంటే . . .
  • దానివల్ల ఉపయోగం
  • ప్రతికూల భావాలను మనమెలా అధిగమించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • 3 | బైబిల్లో ఉన్న మనలాంటి వాళ్లు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
  • బాధగా అనిపించినప్పుడు యెహోవా మీకు సహాయం చేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • యెహోవా బలాన్ని బట్టి ఓదార్పును పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2023
wp23 No. 1 పేజీలు 8-9
ఒక వృద్ధుడు బైబిల్లో చదివిన విషయాల్ని ధ్యానిస్తున్నాడు.

2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”

బైబిల్లో ఇలా ఉంది: “మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.”​—రోమీయులు 15:4.

అంటే . . .

నెగిటివ్‌ ఆలోచనల్ని తట్టుకోవాలంటే చాలా శక్తి కావాలి. బైబిల్లో ఉన్న ఊరటనిచ్చే మాటలు మనకు ఆ శక్తినిస్తాయి. భవిష్యత్తులో ఒక కాలం వస్తుందని, అప్పుడు మానసిక వేదన పడాల్సిన పరిస్థితే ఉండదని కూడా బైబిలు చెప్తుంది.

దానివల్ల ఉపయోగం

అప్పుడప్పుడు అందరికీ బాధగా అనిపిస్తుంది; కానీ డిప్రెషన్‌, ఆందోళన ఉన్నవాళ్ల పరిస్థితి వేరు. బాధ, వేదన, ఒంటరితనం, వెలితి లాంటివి వాళ్లను ప్రతీ నిమిషం వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వాళ్లకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

  • నెగెటివ్‌ ఆలోచనల్ని దూరం చేసే ఎన్నో పాజిటివ్‌ విషయాలు బైబిల్లో ఉన్నాయి. (ఫిలిప్పీయులు 4:8) అవి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి సహాయం చేస్తాయి.​—కీర్తన 94:18, 19.

  • మనం ఎందుకూ పనికిరామనే ఆలోచనను తీసేసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.​—లూకా 12:6, 7.

  • మనం ఒంటరి వాళ్లం కాదని, మనల్ని పుట్టించిన దేవుడు మన ఫీలింగ్స్‌ని పూర్తిగా అర్థం చేసుకుంటాడని బైబిలు చెప్తుంది. ఇలా మనలో ధైర్యాన్ని నింపే విషయాలు బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి.​—కీర్తన 34:18; 1 యోహాను 3:19, 20.

  • మన మనసుకు తగిలిన గాయాలు ఎప్పటికీ గుర్తుకు రాకుండా చేస్తానని దేవుడు బైబిల్లో మాటిస్తున్నాడు. (యెషయా 65:17; ప్రకటన 21:4) గతం తాలూకా చేదు జ్ఞాపకాలు తేనెటీగల్లా మనమీద దాడి చేసినప్పుడు, ధైర్యం తెచ్చుకుని జీవితంలో ముందుకెళ్లడానికి ఈ మాట సహాయం చేస్తుంది.

బైబిలు నాకు ఎలా సహాయం చేసిందంటే . . . జెస్సిక

నాకు డిప్రెషన్‌ ఉంది

జెస్సిక నిద్రపోతోంది, ఆమె ఒళ్లో బైబిలు తెరిచి ఉంది.

“నాకప్పుడు 25 ఏళ్లు, ఒక రోజు ఉన్నట్టుండి గతంలో నన్ను బాధపెట్టిన విషయాలన్నీ గుర్తొచ్చి కుప్పకూలిపోయాను. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే నేను తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పాడు. ఒకప్పటి చేదు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉండడంవల్ల, నెగిటివ్‌ ఆలోచనలు పెరిగి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని డాక్టర్లు తేల్చారు. నా ఆలోచనల్ని సరిచేసుకుని, వాటిని అదుపులో ఉంచుకోవడం కోసం మందులతో పాటు, థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది.”

బైబిలు సహాయం చేసింది

“డిప్రెషన్‌ తీవ్రంగా ఉన్న రోజుల్లో ఉన్నట్టుండి చాలా భయంగా, గాబరాగా అనిపించేది; చెమటలు పట్టేసి గుండె వేగంగా కొట్టుకునేది, నిద్ర పట్టేది కాదు; రాత్రిపూట ఏవేవో గుర్తుకొచ్చి కంగారుగా అనిపించేది. కీర్తన 94:19 చెప్తున్నట్లు, ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు మనల్ని ఓదార్చే శక్తి దేవునికి ఉంది. నాకు ఓదార్పుకరంగా అనిపించిన లేఖనాల్ని ఒక పుస్తకంలో రాసిపెట్టుకున్నాను. దాన్ని, నా బైబిల్ని బెడ్‌ పక్కన ఉంచుకున్నాను. నిద్ర పట్టనప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని లేఖనాల్ని చదివేదాన్ని, దేవుని మాటలు చదివాక ప్రశాంతంగా అనిపించేది.

“నేను పనికిరానిదాన్నని, ఎవ్వరూ నన్ను ప్రేమించరని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ నేను అనుకుంటుంది తప్పని బైబిలు ద్వారా నేర్చుకున్నాను; దేవుడు ఒక నాన్నలా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనలో ప్రతీ ఒక్కరి బాగోగులను పట్టించుకుంటున్నాడని తెలుసుకున్నాను. నా ఆలోచనలు నన్ను కంట్రోల్‌ చేయడం కాదు, నేనే వాటిని కంట్రోల్‌ చేసుకోవడం మొదలుపెట్టాను. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో, నన్ను నేను అలా చూసుకోవడం నేర్చుకున్నాను. నా గురించి నేను తక్కువగా ఆలోచించడం మానేయడానికి ఇది చాలా ఉపయోగపడింది.

“చేదు జ్ఞాపకాలు, నెగిటివ్‌ ఆలోచనలు మనసులోకి రాని కాలం కోసం నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. త్వరలో మానసిక సమస్యలు లేని రోజు వస్తుందని తెలుసుకోవడం వల్ల ఇప్పుడు నాకున్న సమస్యల్ని తట్టుకోగలుగుతున్నాను. నా డిప్రెషన్‌ పూర్తిగా పోయే రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను.”

మరింత ఓదార్పు కోసం:

“డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?”ఆర్టికల్‌ చదవండి. ఇది jw.org వెబ్‌సైట్‌లో ఉంది.

jw.orgలో ఉన్న కీర్తనలు పుస్తకం ఆడియో రికార్డింగ్‌ వినండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి