కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 3 పేజీ 15
  • మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను ప్రేమించడం, ఆయన మాట వినడం అంటే ఏంటి?
  • మీ భవిష్యత్తు, మీ నిర్ణయం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • మీరు దేవునికి దగ్గర కావచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2018
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 3 పేజీ 15
కాఫీ షాపులో ఒకతను తన స్నేహితునికి స్మార్ట్‌ఫోన్‌లో ఏదో చూపిస్తున్నాడు.

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

సుమారు 3,500 సంవత్సరాల క్రితం, యెహోవా దేవుడు తన ఆరాధకులకు మంచి భవిష్యత్తు పొందాలంటే ఏం చేయాలో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేడు నేను జీవాన్ని-మరణాన్ని, దీవెనను-శాపాన్ని మీ ముందు పెట్టి, భూమ్యాకాశాల్ని సాక్షులుగా ఉంచుతున్నాను. నువ్వు, నీ వంశస్థులు ప్రాణాలతో ఉండేలా జీవాన్ని కోరుకోవాలి.”—ద్వితీయోపదేశకాండం 30:19.

వాళ్లు సరైనదాన్ని ఎంచుకుంటే, మంచి భవిష్యత్తు పొందుతారు. మన భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా సరైనదాన్ని ఎంచుకోవాలి. అంటే ఏం చేయాలి? బైబిలు ఇలా చెప్తుంది: ‘నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయన మాట వినాలి.’—ద్వితీయోపదేశకాండం 30:20.

యెహోవాను ప్రేమించడం, ఆయన మాట వినడం అంటే ఏంటి?

బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి: యెహోవాను ప్రేమించాలంటే ఆయన ఎలాంటివాడో బైబిలు చదివి ముందు తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ మంచి కోరుకుంటున్నాడని అర్థం చేసుకుంటారు. మీరు తనకు ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు. “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది” కాబట్టి మీ మనసులోని ఆందోళనలన్నీ ప్రార్థనలో తనకు చెప్పమని అడుగుతున్నాడు. (1 పేతురు 5:7) మీరు తనకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే ‘తాను కూడా మీకు దగ్గరౌతానని’ యెహోవా మాటిస్తున్నాడు.—యాకోబు 4:8.

తెలుసుకున్న వాటిని పాటించండి: దేవుని మాట వినడం అంటే, బైబిల్లో ఆయనిచ్చిన తెలివైన సలహాల్ని పాటించడం. అలా పాటించినప్పుడు ‘మీరు విజయం సాధిస్తారు, తెలివిగా నడుచుకుంటారు.’—యెహోషువ 1:8.

ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, మా jw.org వెబ్‌సైట్‌ చూడండి. అక్కడ మీరు ఆన్‌లైన్‌లో బైబిలు చదవవచ్చు, బైబిలు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు, ఒకవేళ యెహోవాసాక్షులతో కలిసి బైబిలు గురించి నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఆన్‌లైన్‌ రిక్వెస్ట్‌ పంపవచ్చు.

మంచి భవిష్యత్తు సొంతం చేసుకునే మార్గాన్ని బైబిలు చూపిస్తుంది. దాన్ని మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాం!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి