కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb23 సెప్టెంబరు పేజీ 13
  • దేవున్ని నమ్మనివాళ్లకు వాళ్ల సృష్టికర్తను పరిచయం చేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవున్ని నమ్మనివాళ్లకు వాళ్ల సృష్టికర్తను పరిచయం చేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుణ్ణి నమ్మనివాళ్లకు ఎలా ప్రకటించవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • మనం బోధించడానికి ఉపయోగించే పనిముట్లను నైపుణ్యంగా ఎలా ఉపయోగించాలి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • సత్యాన్ని బోధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • రుజువుల్ని స్వయంగా పరిశీలించండి
    తేజరిల్లు!—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
mwb23 సెప్టెంబరు పేజీ 13
ఆసియా ఖండానికి చెందిన ఒక ఆమెకు సాక్ష్యం ఇస్తున్న మన సహోదరి.

మన క్రైస్తవ జీవితం

దేవున్ని నమ్మనివాళ్లకు వాళ్ల సృష్టికర్తను పరిచయం చేయండి

దేవున్ని నమ్మనివాళ్లు మనం చెప్పేది వినరులే అని, వాళ్లకు ప్రీచింగ్‌ చేయడానికి మీరు ఎప్పుడైనా వెనకాడారా? అలాగైతే, ఎంతోమంది నాస్తికులు కూడా యెహోవాసాక్షులు అయ్యారని గుర్తుంచుకోండి. చాలా సందర్భాల్లో, వాళ్లకు కావాల్సిందల్లా దేవుడు ఉన్నాడనే రుజువులు చూడడానికి కాస్త సహాయం.—రోమా 1:20; 10:14.

విశ్వాసం లేనివాళ్లు విశ్వాసాన్ని పెంపొందించుకోగలరని గుర్తుంచుకోండి!—దేవున్ని నమ్మనివాళ్లు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

దేవున్ని నమ్మనివాళ్లకు ప్రీచింగ్‌ చేస్తే వింటారనే ఆశను టోమజో అనుభవం మీకెలా కలిగిస్తుంది?

వాళ్లతో ఇలా మాట్లాడవచ్చు

నేను దేవున్ని నమ్మను అని ఎవరైనా అన్నప్పుడు దయగా, నేర్పుగా ఉండండి. వాళ్ల అభిప్రాయాన్ని, ఫీలింగ్స్‌ని మీరు నిజంగా పట్టించుకుంటున్నారని చూపించండి. (2తి 2:24) వాళ్లకు నచ్చే విషయాల గురించి మాట్లాడండి. సృష్టికర్త ఉన్నాడని చాలామంది నమ్మడానికి గల రుజువుల్ని చర్చించడానికి వాళ్లు ఇష్టపడుతున్నారా? అలాగైతే, వాళ్ల కోసమే తయారుచేసిన ప్రచురణల్ని, వీడియోల్ని ఉపయోగించండి.

దేవున్ని నమ్మనివాళ్లకు సత్యాన్ని చెప్పడం మొదట్లో మీకు కష్టంగా ఉండవచ్చు. అయితే, అనుభవంగల ప్రచారకుల సహాయం తీసుకోండి. అంతేకాదు, మొదట్లో దేవుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మనివాళ్లతో సహా, సరైన హృదయస్థితి గలవాళ్లను చేరుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని మర్చిపోకండి.—అపొ 13:48.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి