కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb22 సెప్టెంబరు పేజీ 13
  • ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం గురించి . . .

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం గురించి . . .
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ బైబిలు విద్యార్థులకు బోధించడానికి వీడియోలు ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • కావలికోట కొత్త అధ్యయన ప్రతి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరు ఫోన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా?
    తేజరిల్లు!—2015
  • సరికొత్త హంగులతో అధ్యయన ప్రతి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
mwb22 సెప్టెంబరు పేజీ 13

మన క్రైస్తవ జీవితం

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం గురించి . . .

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని వీడియోలు, ప్రశ్నలు బాగా ఉపయోగపడుతున్నాయా? “కొంతమంది ఇలా అంటారు,” “ఇలా చేసి చూడండి,” “ఇవికూడా చూడండి” భాగాలు ఎలా అనిపిస్తున్నాయి? శిష్యుల్ని చేయడానికి మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, మీకు ఉపయోగపడే ఇంకొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.—మత్త. 28:19, 20.

JW లైబ్రరీ యాప్‌లో ఉన్న “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకం. సర్కిల్లో కనిపిస్తున్నది “1వ సెక్షన్‌ రెఫరెన్సులు” బటన్‌.

మీడియా: మీరు ముద్రిత కాపీ నుండి స్టడీ చేయాలనుకుంటే వీడియోలన్నీ అలాగే ఇతర రెఫరెన్సులన్నీ ఒకేచోట కనిపించాలంటే ఏం చేయాలి? మీ ఫోన్‌లో గానీ, ట్యాబ్‌లో గానీ ఈ పుస్తకం తెరిచి ఏదోక సెక్షన్‌​ను సెలక్ట్‌​ చేయండి. పాఠాల లిస్టు చివర్లో ఆ సెక్షన్‌కు సంబంధించిన రెఫరెన్సులు అన్నీ ఉంటాయి. (1వ చిత్రం చూడండి.)

“ముద్రిత ప్రతి” సెట్టింగ్‌​: మీరు ఎలక్ట్రానిక్‌ కాపీ నుండి స్టడీ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో “ముద్రిత ప్రతి” సెట్టింగ్‌​ ఉపయోగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆ సెట్టింగ్‌​ కావాలంటే ఏం చేయాలి? మీరు స్టడీ చేస్తున్న పాఠం తెరిచాక, స్క్రీన్‌ కుడివైపున పైభాగంలో ఉన్న మూడు చుక్కల్ని క్లిక్‌ చేయండి. అందులో “ముద్రిత ప్రతి” సెట్టింగ్‌​​​ సెలక్ట్‌​ చేయండి. మీరు స్టడీ చేస్తున్న సమాచారం ఆ పాఠం అంశంతో ఎలా ముడిపడివుందో అర్థంచేసుకోవడానికి ఈ సెట్టింగ్‌​ బాగా ఉపయోగపడుతుంది. ఈ సెట్టింగ్‌​ నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? మళ్లీ పైనున్న మూడు చుక్కల్ని క్లిక్‌ చేసి “డిజిటల్‌ ప్రతి” సెలక్ట్‌​​ చేయండి.

 JW లైబ్రరీ యాప్‌లో ఉన్న “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకం. సర్కిల్స్‌లో కనిపిస్తున్నవి “నేను సిద్ధంగా ఉన్నానా?,” “అదనపు సమాచారం” బటన్లు.

“నేను సిద్ధంగా ఉన్నానా?”: పుస్తకం చివర్లో ఉన్న ఈ బాక్సు, సంఘంతో కలిసి ప్రకటన పని చేయడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి మీరు చేయాల్సిన పనుల్ని తెలియజేస్తుంది. (2వ చిత్రం చూడండి.)

అదనపు సమాచారం: కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన ఎక్కువ విషయాలు ఈ భాగంలో ఉంటాయి. అదనపు సమాచారం కిందవున్న లింక్‌ మీద క్లిక్‌ చేస్తే మీరు స్టడీ చేస్తున్న పాఠానికి తిరిగివెళ్లవచ్చు. (2వ చిత్రం చూడండి.)

ఈ పుస్తకం పూర్తవకముందే మీరు స్టడీ చేస్తున్న వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటే స్టడీ అక్కడితో ఆపేయాలా? లేదు. వాళ్లు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ ఈ పుస్తకం పూర్తయ్యేదాకా వాళ్లతో స్టడీ చేయండి. ఆ స్టడీని, రిటన్‌ విజిట్లను, గంటల్ని మీరు రిపోర్టు చేయవచ్చు. మీతో పాటు ఆ స్టడీకి వచ్చిన ప్రచారకుడు లేదా ప్రచారకురాలు కూడా ఆ టైమ్‌ను రిపోర్టు చేసుకోవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి