దేవుని వాక్యంలో ఉన్న సంపద
రెండు స్తంభాలు మనకు ఏ విషయాన్ని నేర్పిస్తున్నాయి?
ఆలయ వసారాకు ఎదురుగా రెండు స్తంభాలు ఉండేవి (1రా 7:15, 16; w13-E 12⁄1 13వ పేజీ, 3వ పేరా)
ఆ స్తంభాలకు అర్థవంతమైన పేర్లు కూడా ఉన్నాయి (1రా 7:21; it-1-E 348)
ప్రజలు యెహోవా మీద ఆధారపడినంత కాలం, ఆయన ఆలయాన్ని ‘గట్టిగా స్థిరపరుస్తూ’ వచ్చాడు (1రా 7:21, అధస్సూచి; కీర్త 127:1)
ఎన్ని సమస్యలున్నా, వాటిని తట్టుకుని సత్యం నేర్చుకునేలా యెహోవా మనకు సహాయం చేసుండవచ్చు. కానీ ‘విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే’ మనం ఆయన మీద ఆధారపడుతూనే ఉండాలి.—1కొ 16:13.
ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవా మీద ఆధారపడుతున్నానని ఎలా చూపిస్తున్నాను?’