కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 మే పేజీ 13
  • కుటుంబంలో ప్రేమ చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కుటుంబంలో ప్రేమ చూపించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుని ప్రీతిపర్చే కుటుంబ జీవితం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • నిరంతరం నిలిచే వివాహానికి రెండు కీలకాలు
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 మే పేజీ 13
మీటింగ్‌లో కుటుంబమంతా కలిసి పాడుతున్నారు.

మన క్రైస్తవ జీవితం

కుటుంబంలో ప్రేమ చూపించండి

కుటుంబంలో ఉన్న ప్రతీఒక్కరిని ప్రేమ దగ్గర చేస్తుంది. ప్రేమ లేకపోతే ఒకరినొకరు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. భర్త, భార్య, తల్లిదండ్రులు కుటుంబంలో ప్రేమను ఎలా చూపించవచ్చు?

ప్రేమగల భర్త తన భార్య అవసరాలను, భావాలను పట్టించుకుంటాడు; ఆమె అభిప్రాయాలను గౌరవిస్తాడు. (ఎఫె 5:28, 29) ఆయన తన కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తాడు. వాళ్లు యెహోవాకు దగ్గరవడానికి సహాయం చేస్తాడు, ప్రతీవారం కుటుంబ ఆరాధన చేస్తాడు. (1తి 5:8) ప్రేమగల భార్య తన భర్తకు లోబడి ఉంటుంది. ఆయనకు “ప్రగాఢ గౌరవం” చూపిస్తుంది. (ఎఫె 5:22, 33; 1పే 3:1-6) భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. (ఎఫె 4:32) ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తారు. యెహోవాను ప్రేమించడం వాళ్లకు నేర్పిస్తారు. (ద్వితీ 6:6, 7; ఎఫె 6:4) తమ పిల్లలు స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వాళ్లు తోటివాళ్ల ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నారో తెలుసుకుంటారు. కుటుంబంలో ప్రేమ ఉన్నప్పుడు తాము భద్రంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కుటుంబ సభ్యులందరిలో కలుగుతుంది.

కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి’ వీడియోలోని ఒక సన్నివేశం. మీటింగ్‌ నుండి ఇంటికొచ్చిన తర్వాత, భార్యాభర్తలు ఒక లేఖనం గురించి మాట్లాడుకుంటున్నారు.

    ప్రేమగల భర్త తన భార్య అవసరాలను తీర్చడానికి, ఆమెను సంతోషంగా ఉంచడానికి ఏం చేస్తాడు?

  • ‘కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి’ వీడియోలోని ఒక సన్నివేశం. మీటింగ్‌ నుండి ఇంటికొచ్చిన తర్వాత, ఒక సహోదరి యెహోవాసాక్షికాని తన భర్త చెప్పేది ఓపిగ్గా వింటూ ఆయనకు ధైర్యం చెప్తోంది.

    ప్రేమగల భార్య తన భర్త పట్ల ప్రగాఢ గౌరవం ఎలా చూపిస్తుంది?

  • ‘కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి’ వీడియోలోని ఒక సన్నివేశం. ఒక కుటుంబం స్నాక్స్‌ తింటూ మీటింగ్‌లో వాళ్లు విన్న విషయాలు చర్చించుకుంటున్నారు.

    ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లల హృదయాల్లో దేవుని వాక్యాన్ని ఎలా నాటుతారు?

ఫోన్లు, ట్యాబ్‌లు వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు

ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయమంతా ఫోన్లు, ట్యాబ్‌లు, టీవీల ముందే గడిచిపోతుంది. కాబట్టి, వాటిని ఎంతసేపు ఉపయోగించాలి అనే విషయంలో తల్లిదండ్రులు హద్దులు పెట్టాలి; వాటిని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పాటించాలి. అంతేకాదు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో మాట్లాడవచ్చా, మాట్లాడితే ఎవరితో మాట్లాడాలి అనేది కూడా తల్లిదండ్రులే నిర్ణయించాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి