మన క్రైస్తవ జీవితం
మీరు సిద్ధంగా ఉన్నారా?
మీ ప్రాంతంలో ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే, దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? భూకంపాలు, తుఫానులు, సునామీలు, వరదలు హఠాత్తుగా రావచ్చు, చాలా నష్టం కలిగించవచ్చు. వాటికితోడు ఉగ్రవాద దాడులు, అలజడి, అంటువ్యాధుల వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా ముప్పు వాటిల్లవచ్చు. (ప్రస 9:11) మన ప్రాంతంలో అలాంటివి ఎప్పుడూ జరగవని అనుకోకూడదు.
మనలో ప్రతీ ఒక్కరం విపత్తు సమయంలో సిద్ధంగా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలి. (సామె 22:3) విపత్తు సమయాల్లో యెహోవా సంస్థ కొంత సహాయం చేసినప్పటికీ, వాటికి సిద్ధంగా ఉండాల్సిన బాధ్యత మనలో ప్రతీ ఒక్కరికి ఉంది.—గల 6:5, అధస్సూచి.
ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
యెహోవాతో దగ్గరి సంబంధం కలిగి ఉండడం విపత్తు సమయంలో మనకెలా సహాయం చేస్తుంది?
ఇవి ఎందుకు ప్రాముఖ్యం?
• విపత్తుకు ముందు, తర్వాత, విపత్తు సమయంలో పెద్దలకు మన సమాచారం అందిస్తూ ఉండడం.
• అత్యవసర వస్తువులున్న బ్యాగు సిద్ధం చేసి పెట్టుకోవడం.—g17.5-E 6; w12 4⁄1 6
• ఎలాంటి విపత్తులు వచ్చే అవకాశం ఉందో, అవి వచ్చినప్పుడు ఏం చేయాలో మాట్లాడుకోవడం.
విపత్తును ఎదుర్కొంటున్న వాళ్లకు మనం ఏ మూడు విధాలుగా సహాయం చేయవచ్చు?