దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 20-21
యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు
అబ్రాహాము, శారా చూపించిన విశ్వాసానికి బహుమానంగా యెహోవా వాళ్లకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ తర్వాత, ఒక పరీక్ష ఎదురైనప్పుడు వాళ్లు విధేయత చూపించారు. అది, యెహోవా భవిష్యత్తులో చేస్తానని మాటిచ్చిన వాటిమీద వాళ్లకు బలమైన విశ్వాసం ఉందని నిరూపించింది.
నాకు పరీక్షలు వచ్చినప్పుడు యెహోవాకు లోబడడం ద్వారా, భవిష్యత్తులో ఆయన చేస్తానని మాటిచ్చిన వాటిమీద విశ్వాసం ఉందని ఎలా చూపిస్తాను? నా విశ్వాసాన్ని నేనెలా బలపర్చుకోవచ్చు?