కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 8
  • వ్యక్తిగత అధ్యయనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వ్యక్తిగత అధ్యయనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • అధ్యయనం ప్రతిఫలదాయకంగా ఉంటుంది
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • అధ్యయనం—ప్రతిఫలదాయకం, ఆనందదాయకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • రాజుల మాదిరిని అనుసరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవాతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 8

మన క్రైస్తవ జీవితం

వ్యక్తిగత అధ్యయనం నుండి ఎక్కువ ప్రయోజనం పొందండి

ఎందుకు ప్రాముఖ్యం? దేవుని వాక్యం ‘వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంత అనేది పూర్తిగా గ్రహించడానికి’ వ్యక్తిగత అధ్యయనం సహాయం చేస్తుంది. (ఎఫె 3:18) ఈ చెడ్డ తరం మధ్య ఎలాంటి నిందగానీ మచ్చగానీ లేకుండా ఉండడానికి, అలాగే “జీవ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని” ఉండడానికి కూడా అది సహాయం చేస్తుంది. (ఫిలి 2:15, 16) దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేసేటప్పుడు, ప్రత్యేకంగా మనకు అవసరమైన సమాచారాన్ని ఎంచుకునే వీలుంటుంది. బైబిలు చదవడం, అధ్యయనం చేయడం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనం ఎలా పొందవచ్చు?

ఎలా చేయాలి?

  • మీరు బైబిల్ని మామూలుగా చదివినా, ఫోన్‌లో లేదా ట్యాబ్‌లో చదివినా ముఖ్యమైన వచనాలు హైలైట్‌ చేసుకోండి, నోట్స్‌ రాసుకోండి

  • దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? ఎలా?’

  • వాస్తవాలు తెలుసుకోండి. అందుబాటులో ఉన్న పరిశోధనా పరికరాలు ఉపయోగించి అంశం ప్రకారం లేదా వచనం ప్రకారం పరిశోధన చేయండి

  • చదువుతున్న సమాచారాన్ని మీరెలా పాటించవచ్చో తెలుసుకోవడానికి ధ్యానించండి

  • మీరు నేర్చుకున్న వాటిని రోజువారీ జీవితంలో పాటించండి.—లూకా 6:47, 48

వ్యక్తిగత అధ్యయనం ద్వారా “జీవ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి” అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • వ్యక్తిగత అధ్యయనం గురించి కొందరు ఏమన్నారు?

  • వ్యక్తిగత అధ్యయనం చేసే ముందు ప్రతీసారి ఎందుకు ప్రార్థించాలి?

  • ఒక బైబిలు భాగాన్ని చక్కగా అర్థంచేసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

  • మనం అధ్యయనం చేస్తున్న బైబిల్లో ఎలాంటి గుర్తులు పెట్టుకోవచ్చు?

  • దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ధ్యానించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

  • నేర్చుకున్న విషయాల్ని ఎలా ఉపయోగించాలి?

ఒక సహోదరి బైబిల్ని లోతుగా అధ్యయనం చేస్తుంది; ఒక సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు; ఒక సహోదరుడు బైబిలు వచనాలకు రంగులు పూస్తున్నాడు; ఒక సహోదరి తన బైబిల్లో రాసుకున్న నోట్స్‌ను మరో ఇద్దరికి చూపిస్తుంది

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”—కీర్త 119:97

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి