దేవుని వాక్యంలో ఉన్న సంపద | అపొస్తలుల కార్యాలు 27-28
పౌలు రోముకు ప్రయాణించాడు
పౌలు బందీగా ఉన్నా తన విశ్వాసం గురించి ఇతరులతో మాట్లాడడాన్ని ఎప్పుడూ ఆపలేదు. ఓడలో ఉన్నప్పుడు అతను ఓడ సిబ్బందికి, తోటి ప్రయాణికులకు సాక్ష్యం ఇచ్చాడు. మెలితే దగ్గర ఓడ బద్దలైన తర్వాత, అతను తాను బాగుచేసిన వాళ్లకు కూడా తప్పకుండా మంచివార్త ప్రకటించే ఉంటాడు. రోముకు చేరుకున్న మూడు రోజుల తర్వాత, యూదుల్లో ప్రముఖుల్ని పిలిపించి వాళ్లకు సాక్ష్యం ఇచ్చాడు. తన ఇంట్లో బందీగా ఉన్న రెండు సంవత్సరాలు, పౌలు తనను కలవడానికి వచ్చిన వాళ్లందరికీ ప్రకటించాడు.
మీకు పరిమితులు ఉన్నప్పటికీ, మంచివార్త ప్రకటించడానికి మీరేమి చేయవచ్చు?