దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 10-11
సాటిమనిషిగా సాయపడిన సమరయుని కథ
“ఇంతకీ నా సాటిమనిషి ఎవరు?” అనే ప్రశ్నకు జవాబుగా యేసు ఈ కథని చెప్పాడు. (లూకా 10:25-29) క్రైస్తవ సంఘంలోకి సమరయులు, అన్యులతో పాటు “అన్ని రకాల” ప్రజలు వస్తారని యేసుకు తెలుసు. (యోహా 12:32) ఇతరులకు ప్రేమ చూపించడానికి, ముఖ్యంగా వాళ్లలా కాకుండా చాలా వేరుగా ఉండేవాళ్లకు కూడా ప్రేమ చూపించడానికి, యేసు అనుచరులు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని ఈ కథ నేర్పిస్తుంది.
ఇలా ఆలోచించండి:
‘వేర్వేరు సంస్కృతుల నుండి వచ్చిన సహోదరసహోదరీల గురించి నేను ఏమి అనుకుంటాను?’
‘నాలాంటివాళ్లతోనే నేను ఎక్కువ కలిసి ఉంటున్నానా?’
‘వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన తోటి క్రైస్తవులతో ఎక్కువ పరిచయం పెంచుకోవడానికి నా మనసును సిద్ధంగా ఉంచుకుంటున్నానా?’ (2 కొరిం 6:13)
నేను ఇక్కడికి ఎవర్ని ఆహ్వానించవచ్చు . . .
నాతో పాటు పరిచర్య చేయడానికి
మా ఇంటికి భోజనానికి
తర్వాత వారంలో జరిగే కుటుంబ ఆరాధనను మాతోపాటు చేసుకోవడానికి