కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 డిసెంబరు పేజీ 5
  • వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో కొత్త అంశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో కొత్త అంశం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • మకమకలాడుతున్న వత్తిని మీరు ఆర్పుతారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెరూషలేము లోనికి క్రీస్తు విజయోత్సాహ ప్రవేశము
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • రాజు గాడిదపిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశించాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • A7-G యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యెరూషలేములో యేసు చివరి పరిచర్య (1వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 డిసెంబరు పేజీ 5
న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆన్‌లైన్‌ స్టడీ ఎడిషన్‌ బైబిల్‌లో మత్తయి సువార్త

మన క్రైస్తవ జీవితం

వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో కొత్త అంశం

జనవరి 2018 నుండి వారం మధ్య జరిగే మీటింగ్స్‌లో న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ ఆన్‌లైన్‌ స్టడీ ఎడిషన్‌ బైబిల్‌ (nwtsty) నుండి తీసుకున్న స్టడీ నోట్స్‌ను, మీడియాను ఉపయోగిస్తాము. మీ భాషలో స్టడీ ఎడిషన్‌ బైబిల్‌ లేకపోయినా ఆ సమాచారం మీటింగ్స్‌లో ఉంటుంది. మీటింగ్స్‌కి సిద్ధపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సమాచారం ప్రేమగల మీ పరలోక తండ్రికి మిమ్మల్ని ఇంతకుముందుకన్నా ఎక్కువగా దగ్గర చేస్తుంది.

స్టడీ నోట్స్‌

చాలా బైబిల్‌ వచనాలకు సంబంధించిన సాంస్కృతిక, భౌగోళిక, భాషాపరమైన విషయాలపై స్టడీ నోట్స్‌ మీకు అవగాహన కల్పిస్తుంది.

మత్తయి 12:20

మకమకలాడుచున్న జనుపనార వత్తి: మట్టి ప్రమిదెలో ఒలీవె నూనె పోసి ఇళ్లల్లో సాధారణంగా దీపంగా వాడేవాళ్లు. అవిసెనారతో చేసిన వత్తి నూనెను పీల్చుకుని మండుతూ ఉంటుంది. గ్రీకులో “మకమకలాడుచున్న జనుపనార వత్తి” అంటే చిన్న నిప్పు రవ్వ ఇంకా ఉండడం వల్ల మంట తగ్గిపోతూ లేదా ఆరిపోబోతూ పొగ వస్తున్న వత్తి అని అర్థం. యెషయా 42:3⁠లో యేసు దయ గురించిన ప్రవచనం ఉంది. దయనీయమైన అణచివేయబడిన ప్రజల్లో ఉన్న చిన్న నిప్పు రవ్వ లాంటి ఆశను ఆయన ఎప్పుడూ ఆపడు.

మత్తయి 26:13

నిజంగా: హీబ్రూ భాషలో ఉన్న ఆమేన్‌ అనే మాటకు ఆమీన్‌ గ్రీకు పదం. ఆ మాటకు “అలా జరగాలి” లేదా “నిజంగా” అని అర్థం. ఏదైనా ప్రకటనకు ముందు, ఒట్టుకు ముందు లేదా ప్రవచనానికి ముందు యేసు ఎక్కువగా ఈ మాటను వాడేవాడు. ఆ మాటల్లో నిజాన్ని, నమ్మకాన్ని చూపించడానికి అలా వాడేవాడు. యేసు “నిజంగా” లేదా ఆమేన్‌ను ఈ విధంగా ఉపయోగించడం సువార్తల్లో తప్ప బైబిల్లో వేరేచోట గానీ ఇతర పవిత్ర గ్రంథాల్లో గానీ కనపడదు. యోహాను సువార్త అంతటా ఉన్నట్లుగా యేసు ‘ఆమేన్‌ను’ రెండుసార్లు వరుసగా ఉపయోగించాడు. అలా ఆయన చెప్పిన మాటల్లో ఉన్న నిజాన్ని నమ్మకాన్ని స్పష్టం చేశాడు.—యోహా 1:51.

మీడియా

ఫొటోలు, చిత్రాలు, సౌండ్‌ లేకుండా ఉన్న వీడియోలు, యానిమేషన్‌లు బైబిల్లో ఉన్న ఎన్నో విషయాలకు సంబంధించి అనేక వివరాలను ఇస్తాయి.

బేత్పగే, ఒలీవల కొండ, యెరూషలేము

ఈ చిన్న వీడియో యెరూషలేముకు వెళ్ళడానికి తూర్పు నుండి ఉన్న దారిని చూపిస్తుంది. బైబిల్లో ఉన్న బేత్పగే నుండి అంటే ఇప్పుడున్న ఎట్‌–టూర్‌ అనే గ్రామం నుండి ఒలీవల కొండ ఎత్తైన స్థలాల వరకు ఉన్న మార్గం ఈ వీడియోలో ఉంది. ఒలీవల కొండ తూర్పువైపు ఉన్న బేత్పగేకు బేతనియ తూర్పున ఉంది. యెరూషలేములో ఉన్నప్పుడు యేసు, అతని శిష్యులు అలవాటుగా బేతనియలో రాత్రి విశ్రాంతి తీసుకునేవాళ్లు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని టౌన్‌ ఆఫ్‌ ఎల్‌ ఎజారియ (ఎల్‌ ఐజరియ) అని పిలుస్తారు. అంటే అరబ్బీలో “లాజరు ఊరు” అని అర్థం. యేసు ఖచ్చితంగా మార్త, మరియ, లాజరు ఇంట్లో ఉండి ఉంటాడు. (మత్త 21:17; మార్కు 11:11; లూకా 21:37; యోహా 11:1) వాళ్ల ఇంటి నుండి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు యేసు బహుశా ఈ వీడియోలో చూపించిన లాంటి దారిలోనే వెళ్లి ఉంటాడు. క్రీస్తు శకం 33వ సంవత్సరం నీసాను నెల 9న యేసు గాడిద పిల్ల ఎక్కి ఒలీవల కొండ నుండి యెరూషలేముకు వచ్చాడు. అప్పుడు ఆయన బహుశా బేత్పగే నుండి యెరూషలేముకు వెళ్లే దారిలోనే వచ్చి ఉంటాడు.

బేతనియ నుండి యెరూషలేముకు యేసు వెళ్లిన మార్గం కావచ్చు
  1. బేతనియ నుండి బేత్పగేకు దారి

  2. బేత్పగే

  3. ఒలీవల కొండ

  4. కిద్రోను లోయ

  5. ఆలయ శిఖరం

కాలి మడమ ఎముకలో మేకు

మేకు గుచ్చుకున్న కాలి మడమ ఎముక

ఈ ఫోటో మనిషి కాలి మడమ ఎముకలోకి 11.5 సెంటీమీటర్ల పొడవున్న ఇనుప మేకును గుచ్చినట్లు చూపించే బొమ్మ. అసలు బొమ్మ 1968⁠లో ఉత్తర యెరూషలేములో చేసిన త్రవ్వకాల్లో దొరికింది. ఇది రోమా కాలం నాటిది. మనుషుల్ని శిక్షిస్తున్నప్పుడు చెక్క కొయ్యకు కట్టడానికి ఇలాంటి మేకులనే వాడి ఉంటారని చెప్పే పురావస్తుశాస్త్ర రుజువులను ఇది చూపిస్తుంది. ఈ మేకు యేసుక్రీస్తును కొయ్యకు కట్టేయడానికి రోమా సైనికులు వాడిన మేకులు లాంటిదై ఉండవచ్చు. ఈ బొమ్మ ఒక రాయి బాక్సులో దొరికింది. ఆ బాక్సును ఆసూవరీ అని పిలుస్తారు. ఇందులో చనిపోయిన వ్యక్తి శరీరం పాడైపోయాక ఎండిపోయిన ఎముకలను పెడతారు. అంటే కొయ్య మీద శిక్షించి చంపేసిన వాళ్లను సమాధి చేసే అవకాశం ఉంది అని ఇది చూపిస్తుంది.—మత్త 27:35.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి