మన క్రైస్తవ జీవితం
యోనా పుస్తకం నేర్పే పాఠాలు
మనకు విలువైన పాఠాలు నేర్పించడానికి నమ్మకమైన స్త్రీ, పురుషుల జీవిత కథలను యెహోవా తన వాక్యమైన బైబిలులో రాయించాడు. (రోమా 15:4) యోనా పుస్తకం నుండి మీరేమి నేర్చుకున్నారు? కుటుంబ ఆరాధన: యోనా—యెహోవా దయ నుండి నేర్చుకుందాం అనే వీడియోను చూసి, కిందున్న ప్రశ్నలకు జవాబులు రాయండి:
ఈ వీడియోలో చూసిన ముగ్గురు ప్రచారకులకు ఏ సమస్యలు ఎదురయ్యాయి?
మనకు క్రమశిక్షణ ఇచ్చినా లేదా మనం సేవావకాశాలు కోల్పోయినా, యోనా పుస్తకం మనల్ని ఎలా ప్రోత్సహించగలదు? (1 సమూ 16:7; యోనా 3:1, 2)
మన క్షేత్రం గురించి మంచిగా ఆలోచించడానికి యోనా ఉదాహరణ మనకెలా సహాయం చేస్తుంది? (యోనా 4:11; మత్త 5:7)
మనం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, యోనా ఉదాహరణ మనకెలా ఓదార్పునిస్తుంది? (యోనా 2:1, 2, 7, 9)
బైబిలు చదవడం, ధ్యానించడం గురించి ఈ వీడియో ద్వారా మీరేమి నేర్చుకున్నారు?