మన క్రైస్తవ జీవితం
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే విద్యార్థిగా అవ్వాలంటే ఏమి చేయాలి?
మీరు దానియేలులా పరీక్షల్లో కూడా నమ్మకంగా ఉండాలని అనుకుంటున్నారా? దానియేలు లోతైన ప్రవచనాలతో సహా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం లేదా స్టడీ చేశాడు. (దాని 9:2) శ్రద్ధగా బైబిలు చదివితే మీరు నమ్మకంగా ఉండగలుగుతారు. ఎలా? యెహోవా వాగ్దానాలు నిజమౌతాయనే మీ నమ్మకం పెరుగుతుంది. (యెహో 23:14) దేవుని మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు సరైనది చేయడానికి ప్రేరణను పొందుతారు. (కీర్త 97:10) కానీ మీరు ఎక్కడ, ఎలా మొదలుపెట్టాలి? ఈ సలహాలు గమనించండి.
నేను ఏమి చదవాలి? మంచి అధ్యయన పట్టికలో మీటింగ్స్కు సిద్ధపడడం ఒక అంశం. ప్రతివారం చదవాల్సిన బైబిలు భాగంలో మీకు అర్థం కాని విషయాలను పరిశోధన చేయడానికి సమయం తీసుకున్నట్లైతే ఆ అధ్యయనం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. కొంతమంది బైబిల్లో ఉన్న ప్రవచనాల గురించి, దేవుని పవిత్రశక్తి పుట్టించే వేర్వేరు లక్షణాల గురించి, పౌలు చేసిన మిషనరీ యాత్రల గురించి, లేదా యెహోవా చేసిన సృష్టి గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనుకున్నారు. రోజులో ఎప్పుడైనా బైబిలుకు సంబంధించిన ఏదైన ప్రశ్న మీకు వస్తే, దాన్ని రాసి పెట్టుకోండి. దాన్ని మీ తర్వాత స్టడీ ప్రాజెక్టుగా చేసుకోండి.
నాకు కావాల్సిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది? అందుకు ఏమి చేయవచ్చో కొంత సమాచారం తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక సంపదను వెదకడానికి ఉపయోగపడే పరిశోధన ఉపకరణాలు అనే వీడియో చూడండి. మీరు సమాచారాన్ని ఎంత బాగా వెదకగలరో తెలుసుకోవడానికి, దానియేలు 7వ అధ్యాయంలో ఉన్న క్రూర మృగాలు ఏ ప్రపంచ ఆధిపత్యాలకు గుర్తుగా ఉన్నాయో పరిశోధించి చూడండి.
నేను ఎంతసేపు చదవాలి? క్రమంగా చదువుతూ ఉండడం మంచి ఆధ్యాత్మికతకు రహస్యం. అవసరమైతే మీరు కొద్ది కొద్దిసేపు చదువుతూ మొదలుపెట్టవచ్చు, తర్వాత మెల్లగా ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. దేవుని వాక్యాన్ని చదవడం అంటే గుప్త నిధుల కోసం తవ్వడం లాంటిది. మీకు ఆ సంపద దొరికే కొద్దీ మీకు ఇంకా ఇంకా తవ్వాలని అనిపిస్తుంది. (సామె 2:3-6) దేవుని వాక్యం మీద మీకున్న ఇష్టం పెరుగుతుంది, క్రమంగా బైబిలు చదవడం మీకు అలవాటుగా అయిపోతుంది.—1 పేతు 2:2.
దానియేలు 7వ అధ్యాయంలో క్రూర మృగాలు వేటికి గుర్తుగా ఉన్నాయి?
మరో ప్రశ్న:
దానియేలు 7:8, 24 ఎలా నెరవేరింది?
తర్వాత ప్రాజెక్ట్:
ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్న మృగాలు వేటికి గుర్తుగా ఉన్నాయి?