చక్కగా సువార్త ప్రకటిద్దాం
మీరు స్వచ్ఛారాధనను ఎందుకు విలువైనదిగా చూస్తారు?
చెరలో ఉన్న యూదులు యెహెజ్కేలు దర్శనం ద్వారా ధైర్యాన్ని పొందారు. ఎందుకంటే ఆ దర్శనం స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడుతుందనే నిరీక్షణను ఇచ్చింది. ఈ చివరి రోజుల్లో సత్యారాధన ‘పర్వత శిఖరమున స్థిరపర్చబడింది,’ అందులోకి ప్రవాహంలా వచ్చిన సమస్త అన్యజనులలో మనం కూడా ఉన్నాము. (యెష 2:2) యెహోవా గురించి నేర్చుకుని, ఆయనకు సేవచేయడానికి మీకున్న గొప్ప అవకాశాన్ని మీరు ఎప్పుడూ విలువైనదిగా చూస్తున్నారా?
స్వచ్ఛారాధన వల్ల వచ్చే ఆశీర్వాదాలు:
జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు, జీవితానికి ఉపయోగపడే మంచి సలహాలు, ఖచ్చితమైన నిరీక్షణ ఇచ్చే సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఆహారం.—యెష 48:17, 18; 65:13; రోమా 15:4
ప్రేమగా ఉండే ప్రపంచవ్యాప్త సహోదరత్వం.—కీర్త 133:1; యోహా 13:35
ఎంతో సంతృప్తిని ఇచ్చే పనిలో యెహోవాకు తోటి పనివాళ్లుగా సేవచేసే గొప్ప అవకాశం.—అపొ 20:35; 1 కొరిం 3:9
కష్టాల్లో మనకు బలాన్ని ఇచ్చే “దేవుని శాంతి.”—ఫిలి 4:6, 7
మంచి మనస్సాక్షి.—2 తిమో 1:3
యెహోవాతో దగ్గరి స్నేహం.—కీర్త 25:14
నేను స్వచ్ఛారాధనకు విలువ ఇస్తున్నానని ఏయే విధాలుగా చూపించవచ్చు?