మన క్రైస్తవ జీవితం
దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—వినయం
ఎందుకు ప్రాముఖ్యం:
వినయం వల్ల యెహోవాతో దగ్గరి సంబంధం ఉంటుంది.—కీర్త 138:6
వినయం వల్ల ఇతరులతో మంచి సంబంధం ఉంటుంది.—ఫిలి 2:3, 4
గర్వం నాశనానికి నడిపిస్తుంది.—సామె 16:18; యెహె 28:17
ఎలా చేయవచ్చు:
సలహాను అడిగి పాటించండి.—కీర్త 141:5; సామె 19:20
తక్కువగా చూసే పనులు కూడా ఇతరుల కోసం చేయడానికి సిద్ధంగా ఉండండి.—మత్త 20:25-27
మీకున్న సామర్థ్యాలు, అర్హతల వల్ల గర్వం పెంచుకోకండి.—రోమా 12:3
ఏయే విధాలుగా నేను వినయాన్ని ఎక్కువగా చూపించవచ్చు?
విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—గర్వం అనే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:
సలహా ఇచ్చినప్పుడు మనం స్పందించిన తీరునుబట్టి మన గురించి ఏమి తెలుస్తుంది?
వినయాన్ని పెంచుకోవడానికి ప్రార్థన మనకు ఎలా సహాయం చేస్తుంది?
మనం ఏ విధాలుగా వినయాన్ని చూపించవచ్చు?