దేవుని వాక్యంలో ఉన్న సంపద | విలాపవాక్యములు 1-5
ఓపికగా ఎదురుచూసే స్వభావం సహించడానికి సహాయం చేస్తుంది
చాలా బాధలో ఉన్నా మంచి వైఖరితో సహించడానికి యిర్మీయాకు ఏది సహాయం చేసింది?
తన ప్రజల్లో పశ్చాత్తాపం చూపించే వాళ్లను యెహోవా కిందికి వంగి వాళ్ల దీన పరిస్థితి నుండి పైకి ఎత్తుతాడు అని యిర్మీయాకు పూర్తి నమ్మకం ఉంది
ఆయన “యౌవనకాలమున కాడి మోయుట” నేర్చుకున్నాడు. చిన్న వయసులో విశ్వాస పరీక్షలు సహించడం వల్ల తర్వాత జీవితంలో వచ్చే కష్టాలు విజయవంతంగా తట్టుకోవచ్చు