కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 జూన్‌ పేజీ 2
  • యెహోవా వాగ్దానాల మీద మీ విశ్వాసం ఎంత బలంగా ఉంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా వాగ్దానాల మీద మీ విశ్వాసం ఎంత బలంగా ఉంది?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోషువ గుర్తుంచుకున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోషువ పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యెహోషువ 1:9—“ధైర్యంగా, నిబ్బరంగా ఉండు”
    బైబిలు వచనాల వివరణ
  • మనం వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 జూన్‌ పేజీ 2

మన క్రైస్తవ జీవితం

యెహోవా వాగ్దానాల మీద మీ విశ్వాసం ఎంత బలంగా ఉంది?

యెహోవా చేసిన వాగ్దానాల్లో ఒక్క మాట కూడా తప్పలేదని యెహోషువ, సొలొమోను ఇద్దరూ బలపర్చారు. (యెహో 23:14; 1 రాజు 8:56) ఈ ఇద్దరు నమ్మదగిన సాక్షులు ఇచ్చిన సాక్ష్యం మన విశ్వాసాన్ని కట్టడానికి అవసరమైన పునాదికి మరింత బలాన్ని ఇస్తుంది.—2 కొరిం 13:1; తీతు 1:2.

యెహోషువ కాలంలో యెహోవా తను చేసిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాడు? మీ కుటుంబంతో కలిసి ఒక్క మాట కూడా తప్పిపోలేదు వీడియో నాటకాన్ని చూడండి. తర్వాత ఈ ప్రశ్నలు పరిశీలించండి: (1) రాహాబు విశ్వాసంతో చేసిన పనులను మీరు ఎలా అనుకరించవచ్చు? (హెబ్రీ 11:31; యాకో 2:24-26) (2) కావాలని అవిధేయత చూపించడం నాశనానికి దారితీస్తుందని ఆకాను ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (3) గిబియోనీయులు యోధులు అయినా యెహోషువను మోసం చేసి ఇశ్రాయేలీయులతో ఎందుకు సంధి కుదుర్చుకున్నారు? (4) అమోరీయుల ఐదుగురు రాజులు ఇశ్రాయేలును బెదిరించినప్పుడు యెహోవా ఇచ్చిన మాట ఎలా నిజమైంది? (యెహో 10:5-14) (5) మీరు మీ జీవితంలో దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటి స్థానంలో పెట్టుకున్నందుకు యెహోవా మీ కోసం ఏం చేశాడు?—మత్త 6:33.

యెహోవా చేసినవాటన్నిటి గురించి, చేస్తున్నవాటన్నిటి గురించి, చేయబోయేవాటన్నిటి గురించి ఆలోచిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద మన విశ్వాసం పెరుగుతుంది.—రోమా 8:31, 32.

యెహోషువ

యెహోషువ లాంటి విశ్వాసం మీకుందా?

ఆలోచించుకోవడానికి ప్రశ్నలు:

  • మన కాలంలో ఏ బైబిలు ప్రవచనాలు నెరవేరడాన్ని మీరు చూస్తున్నారు?

  • భవిష్యత్తులో ఏ బైబిలు ప్రవచనాలు నెరవేరాలని మీరు ఎదురు చూస్తున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి