దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 51-52
యెహోవా చెప్పిన వాటిలో ప్రతి చిన్న విషయం నెరవేరుతుంది
యెహోవా భవిష్యత్తు గురించి ఖచ్చితమైన వివరాలను ఇచ్చాడు
పారసీక రాజులకు కాపలా కాసే సైన్యంలో విలుకాడు
“బాణములు చికిలిచేయుడి”
మాదీయలు పారసీకులు విల్లును ఉపయోగించడంలో నేర్పరులు, వాళ్ల ముఖ్య ఆయుధం విల్లు. బాగా లోతుగా గుచ్చుకునేలా వాళ్లు బాణాలను నున్నగా చేసేవాళ్లు
“బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మానుదురు”
నబొనిడస్ వృత్తాంతం చెప్తున్నట్లుగా: “కోరెషు సైన్యం యుద్ధం లేకుండానే బబులోనులోనికి ప్రవేశించాయి.” అంటే పోరాడకుండానే ప్రవేశించి ఉంటారు. యిర్మీయా చెప్పింది చెప్పినట్లు జరిగింది
నబొనిడస్ వృత్తాంతం
‘బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నిత్యము పాడుగా నుండును’
క్రీ.పూ. 539 నుండి బబులోను వైభవం తగ్గిపోవడం మొదలైంది. అలెగ్జాండర్ చక్రవర్తి బబులోనును తన రాజధానిగా చేసుకోవాలని అనుకున్నాడు కానీ హఠాత్తుగా చనిపోయాడు. క్రీస్తు శకం మొదట్లో కొంతమంది యూదులు ఇంకా అక్కడే ఉన్నారు, అందుకే అపొస్తలుడైన పేతురు బబులోనుకు వెళ్లాడు. కానీ క్రీ.శ. నాల్గవ శతాబ్దంలో పట్టణం పాడుబడిపోయింది, చివరికి లేకుండా పోయింది