కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 మార్చి పేజీ 5
  • దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఎలా ఉపయోగించవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఎలా ఉపయోగించవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు చెప్పేది వినడానికి ప్రజలకు సహాయం చేయండి
    మన రాజ్య పరిచర్య—2012
  • దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2013
  • దేవుడు కోరేవాటి గురించి తెలుసుకోవడానికి ప్రజలకు సహాయం చేసేందుకు ఒక క్రొత్త ఉపకరణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” అనే కొత్త పనిముట్టును మీ పరిచర్యలో ఉపయోగించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 మార్చి పేజీ 5

మన క్రైస్తవ జీవితం

దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఎలా ఉపయోగించవచ్చు

దేవుడు చెప్పేది వినండి

చదివి నేర్చుకోవడం కష్టంగా ఉన్నవాళ్లకు బొమ్మల ద్వారా ప్రాథమిక బైబిలు సత్యాలను నేర్పించడానికి దేవుడు చెప్పేది వినండి బ్రోషురు తయారు చేశారు. ఒక్కో పాఠం 2 పేజీల్లో ఉంటుంది. బాగా ఆలోచించి తయారు చేసిన చిత్రాలు ఇందులో ఉంటాయి. ఒక చిత్రం తర్వాత ఏ చిత్రం చర్చించాలో తెలుసుకునేలా గుర్తులు ఉంటాయి.

దేవుడు చెప్పేది వినండి బ్రోషురులో ఉన్న బొమ్మలే దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషురులో కూడా ఉన్నాయి, కానీ ఇందులో ఎక్కువ సమాచారం ఉంటుంది. కాబట్టి కొంత చదవగలిగే వాళ్లకోసం ఈ బ్రోషురును ఉపయోగించవచ్చు. విద్యార్థి దేవుడు చెప్పేది వినండి బ్రోషురు ఉపయోగిస్తుంటే స్టడీ చేసేవాళ్లు దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషురు ఉపయోగించవచ్చు. చాలా పేజీల్లో అదనపు సమాచారం ఉన్న బాక్సు ఉంటుంది. దాన్ని విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి చర్చించవచ్చు.

దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషురు ఉపయోగించి సహోదరి స్టడీ చేస్తుంటే, బైబిలు విద్యార్థి దేవుడు చెప్పేది వినండి బ్రోషురు ఉపయోగిస్తుంది

నెలలో ఇవ్వాల్సిన ప్రచురణలలో లేకపోయినా దీన్ని ఎప్పుడైనా ఇవ్వవచ్చు. బైబిలు స్టడీ చేసేటప్పుడు, బైబిల్లో ఉన్న సంఘటనలను వివరించడానికి బొమ్మలను ఉపయోగించండి. విద్యార్థి స్టడీలో పాల్గొనేలా, చర్చిస్తున్న విషయం అర్థంచేసుకునేలా ప్రశ్నలు అడగండి. పేజీ చివర్లో ఉన్న వచనాలను చదివి, చర్చించండి. బ్రోషురు పూర్తి చేశాక, విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా ప్రగతి సాధించడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? లేదా బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? అనే పుస్తకాల నుండి స్టడీ చేయండి.

దేవుడు చెప్పేది వినండి బ్రోషురులోని ఏదెను తోటలో ఉన్న ఆదాము హవ్వల గురించిన పాఠం
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి