దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 58-62
“యెహోవా హితవత్సరమును” ప్రకటించుము
‘యెహోవా హితవత్సరం’ ఒక నిజమైన సంవత్సరం కాదు
అది ఒక కాలం. ఆ కాలంలో యెహోవా దీనులైన వారికి తను ప్రకటించే స్వేచ్ఛకు ప్రతిస్పందించే అవకాశాన్ని ఇస్తాడు
ఈ హితవత్సరం మొదటి శతాబ్దంలో యేసు పరిచర్యను మొదలుపెట్టిన క్రీ.శ. 29వ సంవత్సరంతో మొదలైంది. క్రీ.శ. 70లో యెహోవా “ప్రతిదండన దినము” వచ్చి యెరూషలేము నాశనం అయినప్పుడు ఆ కాలం ముగిసింది
ఆ హితవత్సరం మన రోజుల్లో, 1914లో యేసు పరలోకంలో రాజైనప్పుడు మొదలైంది, మహాశ్రమలతో ముగుస్తుంది
యెహోవా ‘నీతి అను మస్తకివృక్షములతో’ ఆయన ప్రజలను ఆశీర్వదిస్తాడు
ప్రపంచంలో పెద్దపెద్ద చెట్లు అడవుల్లో కలిసి పెరుగుతాయి, అవన్నీ ఒకదానికి ఒకటి సహాయంగా ఉంటాయి
పెద్దపెద్ద వేర్లు ఒకదానికొకటి పెనవేసుకున్నప్పుడు, చెట్లు బలంగా పాతుకుపోయి తుఫానులను తట్టుకుంటాయి
పొడవైన చెట్లు చిన్నచిన్న చెట్లకు, పిలకలకు కావాల్సిన నీడను ఇస్తూ కాపాడతాయి. చెట్ల నుండి రాలిన ఆకులు మట్టిలో సారాన్ని పెంచుతాయి
‘నీతి అను మస్తకివృక్షములుగా’ ఉన్న అభిషిక్త శేషం ఇచ్చే మద్దతు, రక్షణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో సభ్యులు ప్రయోజనం పొందుతారు