దేవుని వాక్యంలో ఉన్న సంపద | సామెతలు 22-26
“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము”
సామెతల పుస్తకంలో తల్లిదండ్రులకు మంచి సలహాలు ఉన్నాయి. కొమ్మలు చిన్నగా ఉన్నప్పుడే మనకు కావాల్సినట్లుగా వంచుకోవాలి. తర్వాత వాటిని వంచలేము. అలానే, పిల్లలకు శిక్షణ ఇస్తే, పెద్దయ్యాక యెహోవా సేవ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
పిల్లల్ని సరిగ్గా పెంచడానికి చాలా సమయం, శ్రమ తీసుకోవాలి
తల్లిదండ్రులు మంచి ఉదాహరణగా ఉండాలి, వాళ్లు జాగ్రత్తగా నేర్పిస్తూ, సరిచేస్తూ, ప్రోత్సహిస్తూ పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వాలి
మనసుని, హృదయాన్ని ప్రేమగా సరి చేయడమే క్రమశిక్షణ
పిల్లలకు రకరకాలుగా క్రమశిక్షణ ఇవ్వాలి