వ్యాపార ప్రాంతాల్లో ధైర్యంగా సాక్ష్యమివ్వండి
1. వ్యాపార ప్రాంతాల్లో సాక్ష్యమివ్వడం మనకు భయమైతే ఎందుకు నిరాశపడకూడదు?
1 వ్యాపార ప్రాంతాల్లో సాక్ష్యమివ్వడమంటేనే మీకు భయమా? అలాగైతే నిరాశపడాల్సిన పనిలేదు. పౌలు ధైర్యవంతుడైన ప్రచారకుడే, అయినా ప్రకటించడానికి కొన్నిసార్లు ఆయన కూడా ‘ధైర్యం’ కూడగట్టుకోవాల్సి వచ్చింది. (1 థెస్స. 2:2) ఈ విషయంలో సాధారణంగా ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల గురించి, వాటిని అధిగమించడానికి సహాయం చేసే కొన్ని సలహాల గురించి ఇప్పుడు చూద్దాం.
2. షాపులో పని చేసేవాళ్లు చిరాకుపడతారేమో అని మనమెందుకు భయపడకూడదు?
2 పనికి అడ్డుపడితే చిరాకుపడతారేమో? తమ షాపుకు వచ్చే వాళ్లకు సేవలందించడమే అందులో పనిచేసే వాళ్ల బాధ్యత. తమ పనికి ఎవరో ఒకరు అడ్డుతగులుతారని వాళ్లకూ తెలుసు. కాబట్టి సాధారణంగా మీరు వాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు, ఏదో కొనుక్కోవడానికే వచ్చారనుకుని మీతో మర్యాదగా వ్యవహరిస్తారు. మీ బట్టలు చక్కగా ఉండి, మీ మాటలు స్నేహపూర్వకంగా ఉంటే వాళ్లు మీతో ఇంకా గౌరవపూర్వకంగా వ్యవహరిస్తారు.
3. షాపులో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్లకు చిరాకు కలిగించకుండా ఉండాలంటే మనమేమి చేయాలి?
3 కొనుక్కునే వాళ్లు ఎక్కువమంది ఉంటే? వీలైతే రద్దీ తక్కువగా ఉన్నప్పుడు ప్రకటించండి. ఉదాహరణకు, షాపులను తెరిచే సమయంలో ప్రకటించవచ్చు. షాపులో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్లకు చిరాకు కలిగించకుండా ఉండాలంటే, షాపు యజమానిగానీ గుమాస్తాగానీ వాళ్లతో బిజీగా లేని సమయంలో ప్రకటించండి. తక్కువసేపు మాట్లాడండి.
4. వ్యాపార స్థలాల్లో మనమేమి మాట్లాడవచ్చు?
4 నేనేమి చెప్పాలి? పనిచేసేవాళ్లు ఎక్కువమంది ఉంటే వాళ్ల యజమానితో మాట్లాడండి. మీరిలా అనవచ్చు: “మీలాంటి వ్యాపారస్థులను ఇంటిదగ్గర కలుసుకోవడం కష్టమౌతోంది, అందువల్ల మిమ్మల్ని పనిస్థలంలోనే కలవడానికి వచ్చాం. మీరు పనిలో ఉన్నారని నాకు తెలుసు, మీ సమయాన్ని ఎక్కువ తీసుకోను.” మనం పుస్తకాలు అమ్ముకోవడానికి వచ్చామని వాళ్లు అనుకునే అవకాశం ఉంది కాబట్టి, మన పనికి డబ్బు ఎక్కడినుండి వస్తుందని వాళ్లు అడిగే వరకు విరాళాల ఏర్పాటు గురించి చెప్పకపోవడమే మంచిది. అది ఎలాంటి వ్యాపారమో గమనించి, అక్కడ పనిచేసే వాళ్లతో కొద్దిసేపు మాట్లాడడానికి యజమాని అనుమతి కోరవచ్చు. వాళ్లతో కూడా పై విధంగానే మాట్లాడండి. ఎవరైనా బిజీగా ఉంటే, సంభాషణ త్వరగా ముగించి అతనికి ఓ కరపత్రం ఇవ్వండి. వాళ్లతో మాట్లాడడం వీలుకాకపోతే, విశ్రాంతి గదిలోగానీ పనివాళ్లకు అందుబాటులో ఉండే వేరే స్థలంలోగానీ కొన్ని పత్రికలను పెట్టవచ్చేమో యజమానిని అడగండి.
5. ధైర్యంగా వ్యాపార స్థలాల్లో ప్రకటించడానికి ఎలాంటి మంచి కారణాలున్నాయి?
5 యేసు, పౌలు వ్యాపార స్థలాల్లో ధైర్యంగా ప్రకటించారు, మీరూ అలాగే ప్రకటించవచ్చు. (మత్త. 4:18-21; 9:9; అపొ. 17:17) ప్రశాంతత, ధైర్యంగా ప్రకటించేందుకు సహాయం ఇవ్వమని యెహోవాను అడగండి. (అపొ. 4:29, 30) వ్యాపార స్థలాల్లో దాదాపు ప్రతి ఒక్కరినీ కలిసే వీలుంటుంది కాబట్టి ఈ ప్రకటనా పద్ధతిని కూడా ప్రయత్నించి చూడండి.