ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్నవాళ్లను లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా, 1995కు ముందు ప్రచురించిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు. జూలై, ఆగస్టు: మీ సంఘంలో అందుబాటులోవున్న 32 పేజీల బ్రోషురు ఏదైనా ఇవ్వవచ్చు.
▪ జ్ఞాపకార్థ ఆచరణ రోజున పాడబోయే రెండు కొత్త పాటలను ముందే ప్రాక్టీసు చేసుకుంటే బావుంటుంది. అవి మన పాటల పుస్తకంలో 5, 8.
▪ చాలామందికి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సెలవులుంటాయి కాబట్టి, పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడానికి పథకం వేసుకోమని మేము సహోదరులను ప్రోత్సహిస్తున్నాం. తమ సంఘ క్షేత్రంలో లేదా దానికి దగ్గర్లో అరుదుగా ప్రకటనా పనిచేసే ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి గుంపులను ఏర్పాటు చేయగలరేమో సేవా కమిటీలు పరిశీలించాలి. గుంపులకు నాయకత్వం వహించడానికి బాధ్యతగల సహోదరులను ఏర్పాటు చేయాలి. మీరు చేయాలనుకుంటున్న వాటి గురించి మీ ప్రాంతీయ పర్యవేక్షకుడితో చర్చించండి.