పత్రిక గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జూలై - సెప్టెంబరు
“వర్ధిల్లడానికి ప్రతీ ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. మనం చేసే ప్రతీ ప్రయత్నంలో వర్ధిల్లాలంటే మనకేది సహాయం చేస్తుంది? [వాళ్లేమి చెప్తారో వినండి.] మనల్ని చేసిన సృష్టికర్త మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, అంతేకాదు, మనం ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నాడో కూడా చెప్పాడు, వీటి గురించి తెలియజేసే ఒక లేఖనాన్ని చూపించమంటారా? [వాళ్లు ఒప్పుకుంటే, యెహోషువ 1:6-9 చదవండి.] ఈ లేఖనం అర్థమేమిటో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.” 20వ పేజీలోవున్న ఆర్టికల్‌ను చూపించండి.