మీరు ఇంకా ఎక్కువ సేవ చేయగలరా?
1. క్షేత్రసేవలో ఎలాంటి అత్యవసరత ఉంది, ఎందుకు?
1 రాజ్య సువార్తకు ఎంతోమంది ఆసక్తిగా స్పందించడం చూసి యేసు తన శిష్యులతో, “కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి” అని చెప్పాడు. (మత్త. 9:37, 38) మనం కోతకాలం చివరి సమయంలో ఉన్నాం కాబట్టి, రాజ్య సువార్త ప్రకటించడం ముందెన్నటికన్నా నేడు ఎంతో అత్యవసరం. అందుకే, మనం క్షేత్రసేవలో ఇంకా ఎక్కువగా ఎలా పాల్గొనవచ్చనే దానిగురించి ప్రార్థనపూర్వకంగా ఆలోచించాలి.—యోహా. 14:13, 14.
2. క్షేత్రంలో ఎక్కువమంది పనివారు అవసరమని తెలుసుకొని కొంతమంది ఎలా స్పందించారు?
2 ఇంకా ఎక్కువ చేయగల మార్గాలు: యెహోవా నిర్దేశంతో, సహాయంతో చాలామంది పయినీరు సేవను ఆరంభించగలిగారు. (కీర్త. 26:2, 3; ఫిలి. 4:6) కొంతమంది, సంవత్సరంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేయడానికి ప్రత్యేకంగా కృషి చేశారు. అలా వాళ్లు తమ పరిచర్యను ఇంకా ఎక్కువ చేయగలిగారు. సహాయ పయినీరు సేవలో పొందిన ఆనందంవల్ల, వాళ్లలో చాలామంది క్రమ పయినీర్లు అయ్యారు.—అపొ. 20:35.
3. మీరు ఒకప్పుడు పయినీరు సేవ చేసివుంటే, ఇప్పుడు దేని గురించి ఆలోచించవచ్చు?
3 పయినీరు సేవను మళ్లీ మొదలుపెట్టగలరా? మీరు ఇంతకుముందు పయినీరు సేవ చేసివుంటే, అప్పటి జ్ఞాపకాలను మీరెంతో విలువైనవిగా ఎంచుతారనడంలో సందేహం లేదు. మీరు మళ్లీ పయినీరు సేవ చేసే సాధ్యత గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించారా? ఒకప్పుడు, మీరు పయినీరు సేవను ఆపేందుకు నడిపించిన పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు. మీరు మళ్లీ పయినీరు సేవచేసేందుకు మార్గం సుగమం అయ్యుంటుంది.—1 యోహా. 5:14, 15.
4. మనందరికీ ఎలాంటి విశిష్టమైన అవకాశం ఉంది?
4 కోతపని ఎప్పుడో మొదలైంది, త్వరలో ముగుస్తుంది. (యోహా. 4:35, 36) పరిచర్యలో మన వంతు మరింత పెంచుకోవడానికి మన రోజూవారి పనులను సర్దుబాటు చేసుకోవడం సాధ్యమౌతుందో లేదో నిర్ధారించుకోవడానికి మన ప్రస్తుత పరిస్థితి గురించి ఆలోచిద్దాం. ఒకవేళ పరిచర్యలో ఇంకా ఎక్కువ చేయడానికి వీలుకాకపోతే, చేస్తున్నదాన్నే మరింత చక్కగా చేసేందుకు కృషి చేయగలమా? (మార్కు 12:41-44) ఈ విశిష్టమైన పనిలో యెహోవా ఉపయోగించుకునేలా తమ పరిస్థితులు అనుమతించిన వాళ్లందరిముందు ఎంత గొప్ప ఆధిక్యత ఉంది!—కీర్త. 110:3.