కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/08 పేజీ 1
  • ప్రకటించడానికి సహనం అవసరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటించడానికి సహనం అవసరం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా సంస్థను అంటిపెట్టుకుని ఉండండి
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ‘సహనం తన పనిని పూర్తి చేయనివ్వండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • సహనము—క్రైస్తవులకు ఆవశ్యకము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 12/08 పేజీ 1

ప్రకటించడానికి సహనం అవసరం

1 అపొస్తలుడైన పౌలు 30 సంవత్సరాలకు పైగా సువార్త ప్రకటించడానికి ప్రాముఖ్యతనిచ్చి ఎంతో సంతృప్తిని పొందాడు. ఏదైనా ప్రాముఖ్యమైన పనికి ఎదురైనట్లే ఆయన ప్రకటనా పనికి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. (2 కొరిం. 11:23-29) అయినప్పటికీ పౌలు అధైర్యపడి, ప్రకటించడం మానలేదు. (2 కొరిం. 4:1) పరిచర్యను కొనసాగించడంలో ఎదురవుతున్న సమస్యలను సహించడానికి అవసరమైన శక్తిని యెహోవాయే ఇస్తాడని ఆయన గ్రహించాడు. (ఫిలి. 4:13) నమ్మకంగా సహించడంలో తాను ఉంచిన మాదిరి మూలంగా పౌలు ఇలా చెప్పగలిగాడు, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.”—1 కొరిం. 11:1.

2 నేడు శ్రమలను సహించడం: ప్రతీరోజూ మన సహోదర సహోదరీల్లో చాలామంది కుటుంబ సభ్యుల నుండి, తోటి పనివాళ్ళ నుండి, తోటి విద్యార్థుల నుండి అపహాస్యాన్ని, వ్యతిరేకతను, ఉదాసీనతను ఎదుర్కొంటున్నారు. (మత్త. 10:35; యోహా. 15:20) బహుశా మీరుకూడా అలాగే ఎదుర్కొంటుండవచ్చు. అంతేగాక, మీరు ఏదోక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుండవచ్చు లేదా మీ విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షించే ప్రలోభాలకు, శోధనలకు లొంగిపోకుండా ఉండేందుకు మీరు ప్రతీరోజూ పోరాడుతుండవచ్చు. గతంలోని విశ్వసనీయులైన సేవకుల మాదిరులను, ఈ కాలంలో సమస్యలను ఎదుర్కొని, సవాళ్ళను అధిగమించిన మన తోటి క్రైస్తవుల మాదిరులను పరిశీలించడం ద్వారా మనం బలాన్ని పొందవచ్చు.—1 పేతు. 5:9.

3 మనం ‘దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకున్నప్పుడు’ మన పరిచర్యలో స్థిరంగా కొనసాగడానికి అవసరమైన శక్తిని పొందుతాము. (ఎఫె. 6:10-13, 15) సహనం కోసం ప్రార్థించడం కూడా చాలా అవసరం. మనం శ్రమలను సహించగలిగేలా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకనుగ్రహిస్తాడు. (2 కొరిం. 6:4-7) మనం ఆధ్యాత్మిక పోరాటంలో విజయం సాధించాలంటే దేవుడిచ్చే జ్ఞాపికలను లక్ష్యపెట్టాలి. (కీర్త. 119:24, 85-88) ఒక కుమారుడు, ప్రేమగల తన తండ్రి రాసిన ఉత్తరాన్ని పదేపదే ఎలా చదువుకుంటాడో అలాగే మనం ప్రతీరోజూ బైబిలు చదివితే యెహోవాతో మనకున్న బంధం పటిష్టమవుతుంది. క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా మనం పరీక్షలను ఎదుర్కొనేందుకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాము, అప్పుడు దేవుని ఆలోచనా విధానం మనం తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది, మన యథార్థత బలపడుతుంది.—సామె. 2:10, 11.

4 సహించడం వల్ల ఆశీర్వాదాలు లభిస్తాయి: పౌలు విషయంలో జరిగినట్లుగానే, మనం నమ్మకంగా సహిస్తూ పరిచర్య చేయడంలో కొనసాగితే యెహోవా సంతోషిస్తాడు, మనకూ ఇతరులకూ ఆశీర్వాదాలు లభిస్తాయి. (సామె. 27:11) పరిచర్యలో కొనసాగాలని నిశ్చయించుకుందాం, తద్వారా మన విశ్వాసం పరీక్షకు నిలిచేదనీ, ‘అగ్ని పరీక్షవలన శుద్ధిచేయబడినా నశించిపోయే సువర్ణము కంటే అమూల్యమైనదనీ’ నిరూపిస్తాం.—1 పేతు. 1:6, 7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి