కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/08 పేజీలు 2-3
  • సేవా కూటాల కార్యక్రమం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల కార్యక్రమం
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఉపశీర్షికలు
  • డిసెంబరు 8తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 15తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 22తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 29తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2008
km 12/08 పేజీలు 2-3

సేవా కూటాల కార్యక్రమం

డిసెంబరు 8తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 4వ పేజీలో ఉన్న అక్టోబరు-డిసెంబరు కావలికోట అందింపును క్లుప్తంగా సమీక్షించండి. ఈ పత్రికను ఇప్పటికే అందించినవారిని, దానినెలా అందించారో చెప్పమనండి. వారు ఏ ఆర్టికల్‌ను, ప్రశ్నను, లేఖనాన్ని ఉపయోగించారు?

15 నిమి: 2009 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. స్థానికంగా నొక్కిచెప్పవలసిన అంశాలను మన రాజ్య పరిచర్య అక్టోబరు 2008 మధ్యపేజీల్లోనుండి చర్చించండి. సహాయ సలహాదారుని పాత్రను సమీక్షించండి. తమతమ నియామకాలను నిర్వహించడానికి, బైబిలు ముఖ్యాంశాల భాగంలో వ్యాఖ్యానించడానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకం నుండి ప్రతీవారం ఇవ్వబడే సలహాలను పాటించడానికి కృషిచేయమని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: “బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను, చర్చనీయ బైబిలు అంశాలు అనే చిన్న పుస్తకాలను మీరు ఉపయోగిస్తున్నారా?”a 4వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, ఇంటింటి పరిచర్యలో ‘యెహోవాసాక్షులు క్రిస్మస్‌ ఎందుకు ఆచరించరు?’ అనే ప్రశ్నకు జవాబివ్వడానికి, బైబిలు అంశాలు అనే చిన్న పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలో ఒక పయినీరు గానీ, అర్హుడైన ప్రచారకుడు గానీ క్లుప్తంగా ప్రదర్శించాలి.

పాట 16 (143)

డిసెంబరు 15తో ప్రారంభమయ్యే వారం

పాట 20 (93)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు.

10 నిమి: పరిచర్యలో ‘మళ్ళీ చెప్పడం’. పరిచర్య పాఠశాల పుస్తకం, 207వ పేజీ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. అందులోని ఒకటి, రెండు సలహాలను క్లుప్తంగా ప్రదర్శించండి.

25 నిమి: యౌవనులారా, దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయండి. కావలికోట మే 1, 2007 సంచికలోని, 26-28 పేజీల్లోవున్న, 9-19 పేరాల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. చిన్నవయసునుండే పూర్తికాల సేవ ప్రారంభించిన ఒకరిద్దరిని ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు పూర్తికాల సేవను ఎందుకు ఎంచుకున్నారు? వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?

పాట 27 (221)

డిసెంబరు 22తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘ ఖర్చుల వివరాలను, సంఘం పంపించిన విరాళాలు అందినట్లు తెలియజేస్తూ సంస్థ పంపిన ఉత్తరాన్ని చదవండి. జనవరి నెలలో అందించే సాహిత్యాలను ప్రస్తావించి, వాటిని ఎలా అందించాలో ఒక పెద్ద ప్రదర్శించాలి.

15 నిమి: జనవరి-మార్చి కావలికోట అందించడానికి సిద్ధపడండి. ప్రేక్షకులతో చర్చ. పత్రికలోని ఆర్టికల్స్‌ గురించి క్లుప్తంగా చెప్పిన తర్వాత ఏ ఆర్టికల్‌లు స్థానిక క్షేత్రానికి ఆకర్షణీయంగా ఉండవచ్చో చెప్పమని ప్రేక్షకులను అడగండి. ఆ ఆర్టికల్‌లలో కొన్నింటిని ఉపయోగిస్తూ చర్చను ప్రారంభించడానికి వాళ్ళు ఏ ప్రశ్నను ఉపయోగిస్తారో, పత్రికను ఇవ్వడానికి ముందు ఆ ఆర్టికల్‌లోనుండి వాళ్ళు ఏ లేఖనాన్ని చదువుతారో ప్రేక్షకులను చెప్పమనండి. చివర్లో, 4వ పేజీలోని నమూనాను లేదా స్థానిక క్షేత్రానికి తగినవిధంగా ఉండే ఇతర అందింపులను ఉపయోగిస్తూ పత్రికను ఎలా అందించవచ్చో ప్రదర్శింపజేయండి.

20 నిమి: “బైబిలు అధ్యయనాలు ప్రతిపాదించడానికి ప్రత్యేకంగా ఒక రోజు.”b జనవరిలో ఏ వారాంతంలో సంఘం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తుందో తెలియజేయండి. 3వ పేరాలోవున్న సలహాలను సమీక్షించి, ఒకటి రెండు అందింపులను ప్రదర్శింపజేయండి. వివేచనను ఉపయోగించి, అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కిచెప్పండి.

పాట 3 (32)

డిసెంబరు 29తో ప్రారంభమయ్యే వారం

పాట 17 (187)

❑ సంఘ బైబిలు అధ్యయనం

my-TU 47వ కథ

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: ప్రకటన 15-22

దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష

❑ సేవా కూటం:

పాట 1 (13)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

10 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: రక్తాన్ని విసర్జించమని దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడడం. పెద్ద ఇచ్చే ప్రసంగం. DPA కార్డుకు బదులుగా ఇప్పుడు మనం అడ్వాన్స్‌ హెల్త్‌ కేర్‌ డైరెక్టివ్‌ ఎందుకు వాడుతున్నామో ప్రారంభంలో తెలియజేయండి. ఈ క్రొత్త డైరెక్టివ్‌ను ఈ రోజే నింపకూడదు. ఆ భాగం జరుగుతున్నప్పుడు చూసుకోవడానికి వీలుగా, బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులందరికీ అడ్వాన్స్‌ హెల్త్‌ కేర్‌ డైరెక్టివ్‌ను ఇవ్వండి. నవంబరు 2006 మన రాజ్య పరిచర్యలోని మధ్య పేజీలను చర్చించండి. రోమీయులు 14:12, గలతీయులు 6:5 చదవండి. బైబిలు శిక్షిత మనస్సాక్షి నిర్దేశిస్తున్న దానికి అనుగుణంగా తాను తీసుకునే చర్యలకు ప్రతీ వ్యక్తి యెహోవాకు లెక్క అప్పచెప్పాలని నొక్కిచెప్పండి. ఆ డైరెక్టివ్‌ను ఇంటి దగ్గర ప్రార్థనాపూర్వకంగా, జాగ్రత్తగా నింపాలి. దానిపై సరైన విధంగా సంతకాలు చేసి, తేదీ వేయడం ప్రాముఖ్యమని చెప్పండి. దాన్ని ప్రతీ సంవత్సరం తిరిగి నింపుకోవాలి. క్షేత్రసేవా గ్రూపు పైవిచారణకర్తలు, కొత్త కార్డులు ఇంకా నింపుకోనివాళ్ళకు సహాయం ఏమైనా అవసరముందేమో అప్పుడప్పుడూ తెలుసుకోవచ్చు. సాక్షులైన తల్లిదండ్రుల బాప్తిస్మం తీసుకోని పిల్లలకోసం సరిపోయేన్ని ఐడెంటిటీ కార్డులు ఉండేలా కార్యదర్శి నిశ్చయపర్చుకోవాలి. ఆంగ్లం చదవలేని, అర్థం చేసుకోలేని వాళ్ళు అడాప్టడ్‌ (అలాంటి వాళ్ళ కోసం తయారుచేయబడిన) డైరెక్టివ్‌ నింపేలా చూడండి. (dpa-E In 11/04-1)

పాట 23 (200)

జనవరి 5తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

❑ సంఘ బైబిలు అధ్యయనం

my-TU 48వ కథ

❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:

బైబిలు పఠనం: ఆదికాండము 1-5

నం. 1: ఆదికాండము 3:1-15

నం. 2: కుటుంబం ఒత్తిడిని ఎదుర్కుంటోంది (fy-TU 5-9 పేజీలు, 1-14 పేరాలు)

నం. 3: ఏది వ్యర్థమైనది కాదు? (1 కొరిం. 15:58)

❑ సేవా కూటం:

పాట 8 (53)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

10 నిమి: పరిచర్యపట్ల యేసుకున్న దృక్పథాన్ని అనుసరించండి. ఫిబ్రవరి 15, 2008 సంచిక 15వ పేజీ, 17-20 పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

20 నిమి: “ప్రకటించడానికి సహనం అవసరం.”c సమయముంటే ఉదాహరించిన లేఖనాలపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులను కోరండి.

పాట 27 (221)

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికి మించకుండా ఇచ్చి ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి