పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట సెప్టెం. 15
“భూవ్యాప్తంగా ఉన్న ప్రజలు యేసుక్రీస్తు గురించి వినేవుంటారు. కొంతమంది ఆయన ఒక అసాధారణ వ్యక్తి మాత్రమే అంటారు. మరికొంతమంది ఆయనను సర్వశక్తిగల దేవుడని ఆరాధిస్తారు. ఇంతకూ యేసుక్రీస్తు ఎవరని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఆయనెవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఆయనిప్పుడు ఎక్కడున్నాడు అనే విషయాలను ఈ పత్రిక స్పష్టంగా వివరిస్తోంది.” యోహాను 17:3 చదవండి.
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ప్రసిద్ధి కావాలనే బలమైన కోరిక ఉండడం తప్పని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] చాలామంది అనుకునేదానికి భిన్నంగా బైబిలు ప్రసిద్ధి కావాలనే కోరిక కలిగివుండడాన్ని ప్రోత్సహించడం లేదు. బదులుగా అది వినయంగా ఉండడాన్ని ప్రోత్సహిస్తోంది. [యాకోబు 4:6 చదివిన తర్వాత 16వ పేజీలోని ఆర్టికల్‌వైపుకు అవధానం మళ్ళించండి.] ప్రసిద్ధి కావాలనే కోరికపై బైబిలు దృక్పథాన్ని, దాన్ని మనం ఎలా దృష్టించాలి అనే విషయాలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.”
కావలికోట అక్టో. 1
కవరు మీదున్న ప్రశ్నను చదివి ఇలా అడగండి: “ఇది ఏ సూచన గురించి మాట్లాడుతోందో మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి. మత్తయి 24:3 చదవండి.] ఈ కావలికోట సంచిక ఆ సూచనకు సంబంధించిన ఐదు ముఖ్యాంశాలను పరిశీలించి, ఆ సూచనను మనం ఎందుకు గుర్తించాలో వివరిస్తుంది.” 6వ పేజీలోని బాక్సును చూపించండి.
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామందికి జీవించడానికి మంచి స్థలం కొనుక్కొనే స్తోమత లేదు. ప్రతి ఒక్కరికీ సరిపోయేంత గృహవసతి ఉండే రోజు వస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] తేజరిల్లు! పత్రిక గృహవసతి సంక్షోభం గురించిన తాజా సమాచారాన్ని అందజేస్తుంది. దేవుడు చేసిన ఈ వాగ్దానం నెరవేరుతుందని మనమెందుకు నమ్మకం కలిగివుండవచ్చో కూడా ఇది తెలియజేస్తుంది.” యెషయా 65:21, 22 చదవండి.