గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి పుస్తక ప్రతిపాదన
◼ “ఈ సామెత ప్రకారం ప్రజలు జీవిస్తే ఈ లోకం శ్రేష్ఠమైన స్థలంగా మారుతుందని మీరు భావిస్తున్నారా? [మత్తయి 7:12 ఎ చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] జీవించిన వారిలోకెల్లా గొప్ప బోధకుడు చెప్పిన అనేక పాఠాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.” 17వ అధ్యాయంలోని చిత్రాలను చూపించి, ఆ చిత్రాల గురించి వ్రాసిన మాటలను నొక్కిచెప్పండి.
◼ “అనేకమంది తల్లిదండ్రులు నేడు తమ పిల్లలకు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విలువలను నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా నేర్పించడం ప్రాముఖ్యమని మీరు భావిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి ఆ తర్వాత సామెతలు 22:6 చదవండి.] పిల్లలకు వారి తొలి దశలోనే శిక్షణ ప్రారంభించాలని తల్లిదండ్రులు ప్రోత్సహించబడడాన్ని గమనించండి. అలా శిక్షణ ఇవ్వడంలో వారికి సహాయం చేయడానికి ఈ పుస్తకం రూపొందించబడింది.” 15, 18 లేదా 32వ అధ్యాయంలోని చిత్రాలను చూపించి, ఆ చిత్రాల గురించి వ్రాసిన మాటలను నొక్కిచెప్పండి.
◼ “తమ పిల్లలు వేసే ప్రశ్నలకు తల్లిదండ్రులు తరచూ ఆశ్చర్యపోతుంటారు. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడం కష్టంగా ఉంటుంది, కదండీ? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత 2 తిమోతి 3:14, 15 చదవండి.] తిమోతి తల్లి, అవ్వ లేఖనాలు ఏమి చెబుతున్నాయో బాల్యం నుండే ఆయనకు నేర్పించారు. నేడు కూడా అలాగే తమ పిల్లలకు నేర్పించడానికి తల్లిదండ్రులకు ఈ పుస్తకం సహాయకరంగా ఉంటుంది.” 11, 12 లేదా 34 నుండి 36 అధ్యాయాల్లోని కొన్ని చిత్రాలను చూపించి, ఆ చిత్రాల గురించి వ్రాసిన మాటలను నొక్కిచెప్పండి.