ద బైబిల్—ఏక్యురేట్ హిస్టరీ, రిలయబుల్ ప్రోఫసీ అనే వీడియో నుండి నేర్చుకోవడం
ఈ వీడియోను చూసిన తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు మీరు సమాధానమివ్వగలరా? (1) బైబిలులోని నమ్మదగిన సమాచారానికి మూలమెవరు? (దాని. 2:28) (2) ప్రాచీన కాల ఐగుప్తును గూర్చిన ఖచ్చితమైన వివరణను బైబిలు ఎలా వర్ణించింది, యెషయా 19:3, 4లో నమోదు చేయబడిన ప్రవచనం ఎలా నెరవేరింది? (3) అష్షూరీయులను గురించిన, వారి రాజులను గురించిన, అష్షూరు అంతాన్ని గురించిన బైబిలు వర్ణనను పురావస్తు శాస్త్రం ఎలా ధ్రువీకరించింది? (నహూ. 3:1, 7, 13) (4) బబులోనును గూర్చి చెప్తున్న ఏ ప్రవచనాలు నమ్మదగినవిగా నిరూపించుకున్నాయి? (5) మాదీయ-పారసీక సామ్రాజ్యం దేవుని ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? (6) దానియేలు 8:5, 8 వచనాలు ఎలా నెరవేరాయి, ఇది ఎంతకాలం ముందుగా ప్రవచించబడింది? (7) యేసు తానే నిజమైన మెస్సీయానని ఎలా నిరూపించుకున్నాడు? (8) ప్రకటన 13:11 అలాగే 17:11 లలో ఉన్న ప్రవచనాలను ఏ ఆధునిక రాజకీయ శక్తులు నెరవేర్చాయి? (9) ప్రసంగి 8:9 లోని సత్యత్వాన్ని వీడియోలోని ఏ దృశ్యాలు నిరూపించాయి? (10) ఈ వీడియో ప్రదర్శన, భవిష్యత్తు కోసమైన బైబిలు వాగ్దానాలయందలి మీ నమ్మకాలను ఎలా బలపరిచింది? (11) బైబిలు దైవిక మూలం నుంచి వచ్చిందని ఇతరులను ఒప్పించడానికి ఈ ఉపకరణాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు?