ఏప్రిల్—సత్క్రియలయందు ఆసక్తి కలిగి ఉండటానికి సమయం!
1 ప్రజలు నివసించే ప్రాంతాన్ని తుపాను సమీపిస్తుంటే, ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గురించిన హెచ్చరికలు చేయడం అప్పుడు మరింత అత్యావశ్యకం అవుతుంది. తుపాను సమీపిస్తున్న కొద్దీ హెచ్చరికలు తీవ్రతరం కావాలి. ఎందుకు? ఎందుకంటే ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి! కొందరు ముందు చేసిన హెచ్చరికల్ని వినుండకపోవచ్చు. మరితరులు విన్నా చర్య తీసుకోవడానికి నిర్లక్ష్యం చేసివుండవచ్చు. ఇదే పరిస్థితి, దేవుని నీతియుక్తమైన ఉగ్రతా “సుడిగాలి” ఈ దుష్ట లోకపు చిహ్నాలన్నింటినీ తుడిచిపెట్టేస్తుందన్న దైవిక హెచ్చరికకు కూడా వర్తిస్తుంది. ఆ హెచ్చరికను ప్రకటించే నియామకం మనకివ్వబడింది. (సామె. 10:25) కోట్లాదిమంది నిత్య జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి! హెచ్చరికను ప్రకటించాల్సిందే. అందుకు మనం “సత్క్రియలయందాసక్తి” గలవారముగా ఉండాలి.—తీతు 2:11-14.
2 దశాబ్దాలుగా, జ్ఞాపకార్థ కాలాన్ని పరిచర్యకు ప్రత్యేక ఆసక్తిగల సమయంగా చేసుకోవటానికి యెహోవా ప్రజలు పురికొల్పబడుతున్నారు. మన రాజ్య పరిచర్య ఇంతకుముందు ఇన్ఫార్మెంట్గా ఉన్నప్పుడు 1939 వసంత కాలంలో ఈ విధంగా ప్రోత్సాహాన్నిచ్చింది: “వసంత కాలం వస్తోంది గనుక మంచి వాతావరణం ఉంటుంది. అందుకని కంపెనీ [సంఘ] ప్రచారకులు పరిచర్యలో గడిపే గంటలు రెండింతలు కావాలి, పయినీర్ల గంటలు గణనీయంగా పెరగాలి. ఏప్రిల్‌లో ఐదు ఆదివారాలున్నాయి. ఐదు శనివారాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్‌లోని ప్రతి శనివారము ప్రతి ఆదివారము . . . ప్రత్యేక సాక్ష్యపు సమయంగా చేయండి.” అది 60 సంవత్సరాల క్రితం సహోదరుల ముందుంచిన సవాలుతో కూడిన లక్ష్యం. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో అప్పటిలాగానే ఐదు శని ఆదివారాలున్నాయి. ఈ నెలలో మీ పథకాలు ఏమిటి? మీ క్యాలెండరులో 2000 ఏప్రిల్ కోసం ఏమి వ్రాసుకున్నారు? యెహోవా ప్రజలు భూవ్యాప్తంగా ఈ ప్రత్యేక నెలలో తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఉద్ధృతం చేస్తారు గనుక మీరూ వారితో చేరి సత్క్రియలను చేయడానికి పథకాలు వేసుకోండి.
3 మనం సాధించాలనుకుంటున్నవి: ఈ నెలలోనే 2000వ సంవత్సరపు అతి ప్రాముఖ్యమైన రోజు వస్తుంది. అది ఏప్రిల్ 19, యేసు మరణ సాంవత్సరికం. మనం జ్ఞాపకార్థ దినానికి సాధ్యమైనంత మందిని ఆహ్వానించడానికి ప్రత్యేక ప్రయత్నం చేద్దాము. పోయిన నెలలో సూచించబడినట్లుగా, జ్ఞాపకార్థానికి హాజరయ్యే అవకాశం ఉన్న వారందరి పేర్లను లిస్టులో వ్రాసుకుని ఎవరూ మిస్సవ్వకుండా చూసుకోండి. ఆహ్వానితుల్లో నిష్క్రియులైన ప్రచారకుల్ని, బైబిలు విద్యార్థులందర్ని, పునర్దర్శనాల్లో కలుస్తున్నవారిని, మునుపు పఠనం చేసినవారిని, సహోద్యోగుల్ని, సహాధ్యాయులను, పొరుగువారిని, బంధువుల్ని, మరితర పరిచయస్థుల్ని చేర్చాలి. తమ స్వంత వాహనాలున్న వారు అవసరంలో ఉన్న వారికి ప్రేమతో సహాయం చేయవచ్చు. జ్ఞాపకార్థ రాత్రి హాజరయ్యేవారిని హృదయపూర్వకంగా ఆహ్వానించే ఆధిక్యత మనకందరికీ ఉంది. జ్ఞాపకార్థ దినం తర్వాత, ఆసక్తి చూపిన వారికి అదనంగా ఆధ్యాత్మిక సహాయం చేయడానికి మనం తిరిగి సందర్శించవచ్చు.
4 జ్ఞాపకార్థ దినానికి ముందూ అటు తర్వాతా “సత్క్రియలయందాసక్తి” గలవారంగా ఉండటం ద్వారా యెహోవా మనకు చేసిన దానంతటికీ మనం ఆయనకు మెప్పుదలను చూపించినవారమౌతాము. పగటి వెలుగు ఎక్కువ గంటలపాటు ఉంటుంది గనుక మనలో చాలామందికి సువార్త కార్యకలాపాలను ఉద్ధృతం చేసే అవకాశం ఉంటుంది. మీరు సహాయ పయినీరు సేవ చేస్తున్నట్లైతే పరిచర్యలో 50 లేక అంతకన్నా ఎక్కువ గంటలు వెచ్చించటానికి మీరు చేయగల్గినంతా చేస్తారు. (మత్త. 5:37) మీరు నెలారంభంలో వేసుకున్న కాలపట్టికను పూర్తిగా పాటించండి. (ప్రసం. 3:1; 1 కొరిం. 14:39) మిగతావారందరమూ పయినీర్లకు మద్దతునివ్వడానికి చేయగల్గినంతా చేద్దాము, వారికి ప్రోత్సాహాన్ని అందిద్దాము, క్షేత్ర సేవలో వారితో కలిసి పనిచేద్దాము. (పోల్చండి 2 రాజులు 10:15, 16.) మనం ఏప్రిల్‌లో అత్యాసక్తితో విత్తినప్పుడు మనకు యెహోవా నుండి గొప్ప హృదయానందమూ మెండైన ఆశీర్వాదాలూ లభిస్తాయని ఎదురుచూడవచ్చు. (మలా. 3:10) బహుశా ఇది, క్రమంగా సహాయ పయినీరు సేవ చేయడానికీ లేదా క్రమ పయినీరు సేవను చేపట్టడానికీ ఒక మార్గం కావచ్చు. మనం క్రమమైన ప్రచారకులముగా కొనసాగుతుండగా ఏప్రిల్ నెలలో మనకు లభించే ప్రేరణ తర్వాతి నెలల్లోకి కూడా కొనసాగాలని కోరుకుందాము.
5 ఈ నెలలో వేలాదిమంది యెహోవా ప్రజలు మరిన్ని గృహ బైబిలు పఠనాలు ప్రారంభిస్తారు అనడంలో సందేహం లేదు. మీరు కూడా ఒక పఠనం ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రత్యేకంగా ఒక పఠనం లభించాలని ప్రార్థించండి, ప్రార్థనలకు అనుగుణ్యంగా ఆచరణ కూడా ఉండాలి. ఒక యథార్థహృదయునికి బోధించాలన్న మీ అన్వేషణలో మీకు సహాయం చేయమని మీరు వినమ్రంగా ప్రార్థిస్తే యెహోవా సహాయం చేస్తాడని మీరు భరోసాను కలిగివుండవచ్చు.—1 యోహా. 3:22.
6 క్షేత్రసేవా పరీక్షల్లో నెగ్గిన పద్ధతి ఒకటి ఇక్కడుంది. సంభాషణలు ప్రారంభించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంది. మీరీ ప్రశ్నతో ప్రారంభించండి: “ఈ కాలాల్లో కొందరు యౌవనస్థులు చేసే హింసాత్మక పనులు సాతాను ప్రభావం ఫలితమా లేక తల్లిదండ్రులు సరైన క్రమశిక్షణనివ్వకపోవడం కారణమా, మీరేమనుకుంటారు?” ప్రతిస్పందించనివ్వండి. ఒకవేళ అవతలి వ్యక్తి “సాతాను ప్రభావమే” అని జవాబిస్తే మీరు ప్రకటన 12:9, 12 చదివి, ఈ లోకంలోని అల్లకల్లోలానికి సాతాను పాత్ర ఎంత అన్నది ఎత్తిచూపించండి. తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును 4వ పాఠానికి త్రిప్పి, అసలు ఈ సాతాను ఎక్కడి నుండి వచ్చాడో ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించండి. మొదటి రెండు పేరాలను చదివి వాటిని చర్చిస్తూ ముందుకు సాగండి. స్కూళ్ళల్లో హింసాత్మక సంఘటనలు జరగడానికి “తల్లిదండ్రులు సరైన క్రమశిక్షణనివ్వకపోవడమే కారణమని” అవతలి వ్యక్తి జవాబిస్తే, 2 తిమోతి 3:1-3 వచనాలు చదివి ఈ సమస్యకు కారణమౌతున్న లక్షణాలను ఎత్తిచూపించండి. తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును 8వ పాఠానికి త్రిప్పి 5వ పేరాను చదవండి, తర్వాత చర్చను కొనసాగించండి. తిరిగి సందర్శించేందుకు మీరు ఏర్పాటును చేసుకోగల్గితే మీరా వ్యక్తితో క్రమమైన బైబిలు పఠనాన్ని కొనసాగించే పథంలో ఉన్నట్లే. తర్వాత సందర్శనంలో తాను నేర్చుకుంటున్న విషయాల్లో ఆసక్తి చూపించేవారెవరైనా ఉన్నారేమో అడగండి.
7 ఏప్రిల్‌లో “సత్క్రియలయందాసక్తి” గలవారంగా ఉండటానికి మరో మార్గం ప్రకటనాపనిలోని వివిధ పద్ధతుల్లో పాల్గొనడమే. ఏదైనా పార్కులోనో లేదా వాహనాలు నిలిపే చోటనో సాక్ష్యం ఇవ్వడం గురించి ఆలోచించారా? బస్టాపుల్లోను లేదా రైల్వేస్టేషన్లలోనో? లేదా మీరు టెలిఫోను ద్వారా, వీధుల్లోను, లేక వ్యాపార ప్రాంతాల్లోను సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నారా? ఆ ఆలోచనల్ని ఈ నెలలో కార్యరూపంలో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు? అందుకు అవసరమైన ధైర్యాన్ని కూడగట్టుకునేందుకు యెహోవా మీకు తోడ్పడతాడు. (అపొ. 4:31; 1 థెస్స. 2:2బి) మీరు పరిచర్యలోని వివిధ అంశాల్లో అనుభవం సాధించిన ఒక పయినీరుతోనో లేదా ఒక ప్రచారకుని/రాలితోనో పని చేసేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు.
8 సాక్ష్యపు పనిలో తన భాగాన్ని ఎక్కువ చేసుకునేందుకు ఇష్టపడేవారెవరైనా అనియత సాక్ష్యంలో పాల్గొంటారు. అందుకు అవసరమైనదల్లా ఒక వ్యక్తిని స్నేహపూర్వకంగా సంభాషణలోనికి దించడమే. సాధారణంగా ప్రజలు ఆసక్తి చూపే ఏదైనా విషయాన్ని ఎత్తండి, బహుశ 6వ పేరాలోని సంభాషణను మీరు ఉపయోగించవచ్చు. వేరేవిధంగానైతే లభించివుండని చిన్న చిన్న మొత్తాల్లోని సమయాల్ని కూడా చక్కగా ఉపయోగించుకోండి. చివరికి ఐదు నిమిషాలు, పది నిమిషాలు, లేదా ఒక పావుగంట పాటు అనియతంగా ఎందుకు సాక్ష్యం ఇవ్వకూడదు?
9 సింహావలోకనం కోసం సమయం: “దేవుని ప్రవచన వాక్యము” అనే మన 1999-2000 జిల్లా సమావేశంలోని నాటకంలోని శక్తివంతమైన పాయింట్లను గురించి ఆలోచించండి. మన ఆధ్యాత్మిక వారసత్వంపట్ల మెప్పుదల అనే ఆ నాటకం, యాకోబు ఏశావుల మధ్యనున్న తారతమ్యాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించేలా చేసింది. ఏశావు చెప్పినదేమిటంటే, యాకోబులా తనకూ ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి ఉన్నదనే, కానీ ఆయన కార్యాలు దాన్ని చూపించలేదు. (ఆది. 25:29-34) మనకు ఎంత శక్తివంతమైన హెచ్చరిక ! మనం యాకోబులా, యెహోవా ఆశీస్సుల కోసం పోరాడటానికి, చివరికి పెనుగులాడటానికి కూడా సిద్ధంగా ఉందాము. (ఆది. 32:24-29) ఏప్రిల్‌లోనూ అటుతర్వాతి నెలల్లోనూ మనం అత్యాసక్తితో ముందుకు సాగుతూ మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఎన్నడూ అల్పంగా ఎంచకుండేందుకు నిశ్చయించుకుందాము.
10 “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతిశీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫ. 1:14) రాజ్య సువార్తను ప్రకటించాల్సిందేను. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి మరి! యెహోవా ప్రజలముగా మనం ఒక్కటిగా “సత్క్రియలయందాసక్తి” గలవారమని సంపూర్ణ ఐక్యతతో ప్రదర్శిస్తుండగా ఈ నెల మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది.
[4వ పేజీలోని బాక్సు]
జ్ఞాపకార్థదిన జ్ఞాపికలు
జ్ఞాపకార్థదిన ఆచరణ, ఈ సంవత్సరం ఏప్రిల్ 19, బుధవారం జరుగుతుంది. పెద్దలు ఈ క్రింది విషయాలపై శ్రద్ధను కనపర్చాలి:
◼ కూటాన్ని నిర్వహించే సమయాన్ని నిర్ణయించేటప్పుడు, చిహ్నాలు సూర్యాస్తమయానికి ముందుగా అందించకుండా ఉండేలా నిశ్చయపర్చుకోవాలి.
◼ ఈ ఆచరణ జరిగే కచ్చితమైన సమయాన్నీ, స్థలాన్నీ ప్రసంగీకునితోపాటు అందరికీ తెలియజేయాలి.
◼ జ్ఞాపకార్థదిన ఆచరణకు తగిన రొట్టెనూ, ద్రాక్షామద్యాన్నీ సంపాదించి, సిద్ధంగా ఉండేలా చూడాలి.—కావలికోట ఫిబ్రవరి 15, 1985 (ఆంగ్లం), 19వ పేజీ చూడండి.
◼ ప్లేట్లనూ, గ్లాసుల్నీ, తగిన టేబుల్నీ, టేబుల్క్లాత్నీ ఆచరణ జరిగే హాలుకు ముందుగానే తీసుకొచ్చి, వాటికి కేటాయించబడిన స్థలంలో ఉంచాలి.
◼ రాజ్యమందిరాన్ని గానీ లేక ఆ కూటం నిర్వహించబడే మరితర స్థలాన్నిగానీ ఎంతో ముందుగానే బాగా శుభ్రపర్చాలి.
◼ అటెండెంట్లనూ, చిహ్నాల్ని అందించే వారినీ ఎంపికచేసుకొని వారికి సరియైన పద్ధతిని గురించీ, వాళ్లు నిర్వహించాల్సిన పనుల్ని గురించీ ముందుగానే ఉపదేశించాలి.
◼ అనారోగ్యంతో ఉండి, హాజరుకాలేని స్థితిలోవున్న అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాల్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
◼ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకునేందుకు షెడ్యూలు వేయబడితే, వరండాలోనూ, ప్రవేశ మార్గాల్లోనూ, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసరమైన రద్దీలేకుండా జాగ్రత్తపడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.