దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2000 జనవరి 3 నుంచి ఏప్రిల్ 17 మధ్య వారాల్లోని ప్రసంగాల సమాచారంపై పుస్తకాలు మూసి చేసే పునఃసమీక్ష. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాసేందుకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయంలో ఏ ప్రశ్నలకు సమాధానమివ్వడానికైనా కేవలం బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చు. వాటి ప్రక్కనున్న రెఫరెన్సులు మీ వ్యక్తిగత పరిశోధన కోసం ఇవ్వబడ్డాయి. కావలికోట రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ నెంబర్లు, పేరా నెంబర్లు ఉండకపోవచ్చు.]
ఈ క్రింది వాక్యాలు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. కొన్నిసార్లు యెహోవా ఆశీర్వాదాలు పొందేందుకు మనం వేచి ఉండాలి, ఎందుకంటే యెహోవాకు మన పరిస్థితి గురించి తెలుసు మరియు మనకు ఎంతో మేలు కలిగే సమయంలోనే ఆయన ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు. (కీర్త. 145:16; యాకో. 1:17) [w98 1/1 23వ పేజీ, 6వ పేరా]
2. లైంగిక విషయాల గురించి మన పిల్లలకు తగినంత మేరకు బోధించడం సరైన చర్యే కాదు, అది దయతో కూడిన చర్య కూడా. [w98 2/15 9వ పేజీ]
3. యెహోవా వాక్కులను కేవలం చదవడం ద్వారానే నేడు మనం ఆధ్యాత్మికంగా పోషించబడుతున్నాము. (ద్వితీ. 8:3) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E85 6/15 17వ పేజీ, 15, 17 పేరాలు.]
4. క్రైస్తవుడు అప్పిచ్చేటప్పుడు వడ్డీ తీసుకోవడం ప్రేమరహితమైనది అని ద్వితీయోపదేశకాండము 23:20 నందు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నతపర్చబడిన సూత్రం చూపిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి అంతర్దృష్టి-1 (ఆంగ్లం) 1212వ పేజీ, 5వ పేరా; అంతర్దృష్టి-2 (ఆంగ్లం) 259వ పేజీ, 11వ పేరా; w-E86 10/15 12వ పేజీ, 9పేరా.]
5. వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో తమకు ఎదురయ్యే ఏ అవాంతరాలనైనా అధిగమించేందుకు ఇశ్రాయేలీయులకున్న బలంలోనూ, నిశ్చయతలోనూ యెహోషువ కాలేబులకున్న దృఢమైన నమ్మకం ఆధారంగా వాళ్ళు ఆశావాద నివేదికనిచ్చారు. (సంఖ్యా. 13:30) [w98 2/1 5వ పేజీ, 4వ పేరా]
6. పౌలు 1 తిమోతిలో “వరము” అని చెప్తున్నప్పుడు, తిమోతి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన విషయాన్ని, ఆయన కోసం వేచివున్న పరలోక ప్రతిఫలాన్ని ఆయనకి గుర్తుచేస్తున్నాడు. (1 తిమో. 4:14) [w98 2/15 25వ పేజీ, 1వ పేరా]
7. జారత్వం క్షమించబడేదే అయినప్పటికీ, నిర్దోషియైన వివాహజత విడాకులు తీసుకొనేందుకు అదే సరియైన లేఖనాధారం. (మత్త. 5:32) [kl 13వ అధ్యాయం, 13వ పేరా]
8. యేసు సంఘంతో ఎల్లప్పుడూ వ్యవహరించినట్లుగానే భర్త తన భార్యతో అత్యంత దయ, ప్రేమ, సహేతుకతతో వ్యవహరించినప్పుడు అతడు తాను క్రీస్తుకు లోబడుతున్నట్లు చూపిస్తాడు. (1 యోహా. 2:6; మత్త. 20:25-28) [kl 14వ అధ్యాయం, 12వ పేరా]
9. న్యాయాధిపతులు 6:37-39లో వివరించబడినట్లుగా, గిద్యోను చేసిన విజ్ఞప్తి, ఆయన అతి జాగ్రత్తతోనూ, అనుమానంతోనూ ఉన్నట్లు చూపిస్తుంది. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E88 4/1 30వ పేజీ, 6వ పేరా.]
10. ‘త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్నలడుగవద్దు’ అని యేసు తన శిష్యులకు ఉపదేశించడం ద్వారా, ప్రకటనా పని చేయవలసిన అత్యవసర పరిస్థితినీ, అత్యంత ప్రాముఖ్యమైన ఈ నియామకానికి ఇవ్వవలసిన పూర్తి అవధానాన్నీ నొక్కి చెప్తున్నాడు. (లూకా 10:5) [w98 3/1 30వ పేజీ, 5వ పేరా]
క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వండి:
11. యెహోవా మాటలు తలిదండ్రుల హృదయాల్లో ఉండటం ఎందుకు ప్రాముఖ్యం? (ద్వితీ. 6:5,6) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w98 6/1 20వ పేజీ, 4వ పేరా.]
12. ద్వితీయోపదేశకాండము 11:18, 19లో వ్రాయబడిన సూత్రాన్ని ఒక కుటుంబ యజమాని ఎలా అన్వయించుకోగలడు? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి fy 71వ పేజీ, 14వ పేరా.]
13. పౌలు ఫిలేమోనుకు వ్రాయడానికి ముందు, పలాయితుడైన ఒనేసిము అపొస్తలుడైన పౌలు దగ్గర కొంతకాలంపాటు ఉన్నాడనడానికి ఏ లేఖనాధారం ఉంది? [w98 1/15 30వ పేజీ, 2వ పేరా]
14. మనం అన్యాయాన్ని చూసినప్పుడు, మనంతట మనం అనుభవించినప్పుడు, మనం నిస్పృహనూ లేక నిరాశావాద దృక్పథాన్నీ వృద్ధి చేసుకోకుండా ఉండేందుకు ఏమి చేయవచ్చు? [w98 2/1 6వ పేజీ, 2-3 పేరాలు]
15. ఈ విధానం ఎలా అంతమౌతుంది? [kl 11వ అధ్యా. 15వ పేరా]
16. యెహోషువ 10:10-14 నందు వర్ణించబడిన సంఘటనలు అర్మగిద్దోనులో జరుగబోయేదానికి ఎలా సారూప్యాన్ని కలిగివుంటాయి. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E86 12/15 23వ పేజీ, 12వ పేరా నుండి 24వ పేజీ, 14వ పేరా వరకు.]
17. యోగ్యమైన ప్రవర్తన విషయమై యథార్థమైన పొగడ్త వల్ల కలిగే మూడు ప్రయోజనాలను పేర్కొనండి. (సామెతలు 15:23 పోల్చండి.) [w98 2/1 31వ పేజీ, 5-6 పేరాలు]
18. యెహోషువ 20:4 అనుగుణంగా ఒకరు సూచనార్థక ఆశ్రయపురానికి ఎలా పరిగెత్తగలరు? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E86 12/15 24వ పేజీ, 16వ పేరా.]
19. కీషోను వాగు దగ్గర సీసెరా యొక్క శక్తివంతమైన సైన్యాలను న్యాయాధిపతియైన బారాకు జయించడం మన దినాల్లో ప్రత్యేకమైన భావాన్ని కలిగివుందని న్యాయాధిపతులు 5:31 ఎలా సూచిస్తుంది? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E86 2/15 21వ పేజీ, 4వ పేరా.]
20. న్యాయాధిపతులు 7:21 లో వ్రాయబడివున్నట్లుగా, ‘వారిలో ప్రతివాడును తన చోటున నిలిచియున్నాడు’ అనే మాటల వెనుకనున్న సూత్రానికి మనమెలా గౌరవాన్ని చూపించగలం? [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w-E82 6/1 25వ పేజీ, 17వ పేరా.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక పదబంధాలను చేర్చండి:
21. యెహోవా ఆశీర్వాదాలను మరింత ఎక్కువగా అనుభవించేందుకు, మనం __________ లో కొనసాగాలి, ఆయన ప్రేరేపిత వాక్యంలో ఉన్న బోధలను __________ కు సహాయం చేయమని యెహోవాను అర్థించాలి. (1 తిమో. 4:8, 9) [w98 1/1 24వ పేజీ, 6వ పేరా]
22. ముఖస్తుతి యెహోవాకు అప్రీతికరమైనది, ఎందుకంటే అది __________ చేత పురికొల్పబడినది, అది __________ గానీ __________ గానీ కాదు, అన్నిటికంటే మిన్నగా అది __________ [w98 2/1 30వ పేజీ 2-3 పేరాలు]
23. అభిచారమంటే సూటిగానైనా లేక __________ ద్వారానైనా __________ తో లేక __________ తో సంభాషించడం మరియు సహకరించడం. [kl 12వ అధ్యా. 6వ పేరా]
24. మత్తయి 7:24-27 లోని యేసు ఉపమానానికి అనుగుణంగా, వివేకవంతులైన తలిదండ్రులు తమ పిల్లలు __________ ఉండేందుకు వారికి సహాయపడే __________ ఇవ్వడం ద్వారా తుపాను వంటి ఒత్తిళ్లను ఎదుర్కొని నిలిచేందుకు వారికి సహాయపడవచ్చు. [w98 2/15 9వ పేజీ, 1వ పేరా]
25. బైబిలునందు యెహోవా __________ కంటే ఎక్కువసార్లు __________ అని పిలువబడ్డాడు. సర్వోన్నతుడంటే __________ గలవాడు అని భావం. [kl 14వ అధ్యా. 3వ పేరా]
క్రింది వాక్యాలలో నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. ఒకరు తాము చనిపోతే తమ ఆస్తిని ఏమి చేయాలనే విషయంలో చర్యలను తీసుకోవడమన్నది (సంఘవిషయం; వ్యక్తిగతమైన విషయం; నిజ క్రైస్తవుల ఆవశ్యకత). (గలతీ. 6:5) [w98 1/15 19వ పేజీ, 6వ పేరా.]
27. (ఓనాను; ఒనేసిఫోరు; ఒనేసిము)ను దయతో స్వీకరించమని పౌలు ఫిలేమోనును ప్రోత్సహించాడు, కానీ ఆయనను అలా చేయమనో లేక తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించమనో ఆయనకు ఆజ్ఞాపించడానికి పౌలు తన అపొస్తలత్వ అధికారాన్ని ఉపయోగించలేదు. (ఫిలే. 21) [w98 1/15 31వ పేజీ, 1వ పేరా]
28. యేసుచే స్వస్థపరచబడిన కుష్ఠురోగుల వృత్తాంతంలో సూచించబడిన ఒక గంభీరమైన లోపం (విశ్వాస లోపం; అవిధేయత; కృతఘ్నత). (లూకా 17:11-19) [w98 2/15 5వ పేజీ, 1వ పేరా]
29. దేవుడు రాహాబు తీసుకున్న చర్యను అంగీకరించాడు గనుక, ఇశ్రాయేలు వేగుల వారిని వెతుక్కుంటూ వచ్చిన యెరికో మనుష్యులతో ఆమె చెప్పిన మాటలు (అబద్ధం చెప్పడం వ్యక్తిగత విషయమని; సరైన సమాచారం తెలుసుకోనవసరం లేని వ్యక్తులకు దాన్ని గురించి చెప్పవలసిన అగత్యం ఒక వ్యక్తికి లేదని; ఆమె ఇంకా తన లోకసంబంధమైన మార్గాలను పూర్తిగా మార్చుకోలేదని) సూచిస్తున్నాయి. (యెహో. 2:3-5; పోల్చండి రోమీయులు 14:4.) [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w93 12/15 25వ పేజీ, 1వ పేరా.]
30. యోహాను 13:5లో నివేదించబడినట్లుగా, యేసు చెప్పిన వస్తు మూలక పాఠం (దయ; సానుభూతి; వినయం) అనే గుణాన్ని ఉన్నతపరుస్తుంది. అది ఇతరుల కోసం అల్పమైన పనులు కూడా చేసేలా ఒకరిని పురికొల్పుతుంది. (w98 3/15 7వ పేజీ, 6వ పేరా]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో ఈ క్రింది లేఖనాలను జత చేయండి:
ద్వితీ. 7:3, 4; 25:11, 12; 28:3; యిర్మీ. 15:20; ఎఫె. 1:22
31. యుక్తమైన కుటుంబ నియంత్రణ పద్ధతుల్ని పాటించేందుకు తీసుకొనే నిర్ణయంపై, సంతానోత్పత్తి సామర్థ్యాలను దేవుడు ఎంతో ఘనంగా ఎంచుతాడనేది ప్రభావం చూపాలి. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w99 6/15 28వ పేజీ, 1-4 పేరాలు.]
32. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడమనే మన నియామకాన్ని మనం నెరవేరుస్తుండగా మనకు యెహోవా ఇచ్చే మద్దతుపై మనం నమ్మకం కలిగి ఉండవచ్చు. [w98 3/1 28వ పేజీ, 1వ పేరా]
33. బైబిలు హెచ్చరికను లక్ష్యపెట్టడం ద్వారా మనం, ఒక క్రైస్తవుడు అవిశ్వాసిని చేసుకొన్న ఫలితంగా కలిగే బాధాకరమైన పరిణామాలనుండి తప్పించబడతాము. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w90 6/1 14వ పేజీ, 11వ పేరా.]
34. దేవుని ఆశీర్వాదాలను పొందడమన్నది, మనం ఎక్కడ జీవిస్తున్నాము, లేక ఎక్కడ సేవచేస్తున్నాము, దేవుని సేవలో ఏ నియామకాన్ని కలిగివున్నాము అనే దానిపై ఆధారపడివుండదు. [వారంలో చదవవలసిన బైబిలు భాగం; చూడండి w96 6/15 15వ పేజీ, 15వ పేరా.]
35. సంఘాలు యేసుక్రీస్తుకు చెందుతాయి, ఆయన తన తగిన సమయంలో, కొరింథులో చేసినట్లుగానే, వారి ఆధ్యాత్మిక సంక్షేమానికి, శాంతికి ముప్పు తీసుకువచ్చే సమస్యలను పరిష్కరించేందుకు చర్య తీసుకుంటాడు. [w96 6/15 30వ పేజీ]