కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/99 పేజీ 7
  • మీరు వెళ్ళిపోతున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు వెళ్ళిపోతున్నారా?
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొత్త సంఘానికి ఎలా అలవాటుపడొచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1991
  • సంఘం క్షేమాభివృద్ధి పొందనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • సంఘం యెహోవాను స్తుతించును గాక
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 10/99 పేజీ 7

మీరు వెళ్ళిపోతున్నారా?

అవును అన్నదే ఈ ప్రశ్నకు జవాబు అయితే, మీరూ, ఇతరులూ చొరవ తీసుకుని చేయవలసిన అనేక కార్యాలున్నాయి. క్రింద తెలియజేయబడుతున్న ప్రాథమిక చర్యలను తీసుకోవడం ద్వారా, మీరు మీ క్రొత్త సంఘంలో త్వరగా సెటిల్‌ అవుతారు.

(1) మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలిశాక, ప్రస్తుతం మీరున్న సంఘ కార్యదర్శి, మీరు క్రొత్తగా వెళ్ళబోయే రాజ్యమందిర చిరునామాను సంపాదించగలరు. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, రాజ్య మందిరం ఎక్కడుందో వెంటనే కనుక్కోండి, కూటాల సమయాలేవో రూఢిపర్చుకోండి. రాజ్య మందిరాన్ని ఒకటి కన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నట్లైతే, మీరు నివసిస్తున్న ప్రాంతం ఏ సంఘపు టెరిటరీ క్రిందకు వస్తుందో అక్కడి పెద్దలను అడిగి కనుక్కోండి. మీరు కూటాలకు హాజరు కావడానికి, స్థానిక పెద్దలతో పరిచయం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి.

(2) కాంగ్రిగేషన్‌ పబ్లిషర్‌ రికార్డ్‌ కార్డులను—మీదీ, మీ కుటుంబ సభ్యులందరిదీ—క్రొత్త సంఘంలోనికి మార్చడంలో ప్రస్తుత సంఘ కార్యదర్శీ, క్రొత్త సంఘ కార్యదర్శీ సహకరిస్తారు. మీ క్రొత్త సంఘ పెద్దలకు మిమ్మల్ని పరిచయం చేస్తూ ఒక లేఖ పంపించబడుతుంది. (మార్చి 1991 మన రాజ్య పరిచర్యలోని (ఆంగ్లం) ప్రశ్నా భాగం చూడండి.) మీరు అక్కడికి వెళ్తున్నారన్న విషయాన్ని అక్కడి సంఘ సేవా కమిటి సరైన పుస్తక పఠన నిర్వాహకుడికి తెలియజేయాలి. అలా ఆ పుస్తక పఠన నిర్వాహకుడు మిమ్మల్ని సంప్రదించి, మీ క్రొత్త పుస్తక పఠన గుంపు ఎక్కడ సమకూడుతుందో తెలుసుకోవడానికి సహాయపడతాడు.—రోమా. 15:7.

(3) మీతో పరిచయం చేసుకుని, మీరు ఆహ్వానించబడ్డారన్న అనుభూతి మీకు కలిగించే ఆనందకరమైన పాత్ర మీ క్రొత్త సంఘంలోని ప్రచారకులందరికీ ఉంది. (పోల్చండి 3 యోహాను 8.) నిజమే, దానర్థం, మీరు కూటాల్లో తప్పక హాజరై ఉండాలనే. అలా పరస్పరం ప్రోత్సాహకరంగాను, నిర్మాణాత్మకంగాను ఉండే సహోదర సహవాసంలో ఆనందించగలరు.

(4) మీరు మీ క్రొత్త సంఘంలో ప్రాంతీయ సేవలో పాల్గొనడానికి, బదిలీ అవ్వడం వలన వచ్చిన పనులను చక్కబెట్టుకునే వరకూ వేచివుండకండి. మీరు రాజ్యాసక్తులను ముందుంచుతుండగా, ఇతర కార్యాలు కూడా జరుగుతాయి, మీ క్రొత్త పరిసరాలు ఎంతో సుఖప్రదంగా ఉన్నాయన్న అనుభూతి మీకు కలుగుతుంది. (మత్త. 6:33) మీరు మీ క్రొత్త ఇంట్లో సెటిల్‌ అయ్యాక, సంఘంలోని కొందరిని మీ ఇంటికి ఆహ్వానించి వాళ్ళతో మంచి పరిచయాలను ఏర్పరచుకోవాలని కూడా మీరు కోరుకోవచ్చు.—రోమా. 12:13.

ఒక చోట నుండి మరో చోటకు వెళ్ళడం పెద్ద ప్రాజెక్ట్‌. అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ తనకు అప్పజెప్పబడినది చేసినప్పుడు, ఆధ్యాత్మికంగా వెనుకబడడం జరగదు. మన ప్రేమ పూర్వక క్రైస్తవత్వాన్ని బట్టి అందరూ ప్రభావితులౌతారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి