కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/98 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—1998
మన రాజ్య పరిచర్య—1998
km 11/98 పేజీ 7

ప్రకటనలు

◼ నవంబరులో సాహిత్య ప్రతిపాదనలు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. డిసెంబరు: నిత్య జీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంతోపాటు ఇంగ్లీషులోని నూతన లోక అనువాదము. జనవరి: హాఫ్‌-రేట్‌, స్పెషల్‌రేట్‌ లిస్టులో ఉన్న 192పేజీల పాతపుస్తకాలు.

◼ ఇటీవలి కాలాల్లో విదేశాలకు ప్రయాణించే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. తత్ఫలితంగా, మన సహోదరులు చాలామంది ఇతర దేశాలను సందర్శించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారు తరచుగా వివరాలకోసం సొసైటీ బ్రాంచ్‌లను అడుగుతున్నారు. రాజ్యమందిరాల చిరునామాలను మరియు స్థానిక సంఘకూటాలకు హాజరయ్యేందుకు కూటాలసమయాలను తెలియచేసేందుకు బ్రాంచ్‌ ఆఫీసులు సంతోషిస్తాయి. అలాగే, బ్రాంచ్‌ ఆఫీసును సందర్శించేందుకు నిర్దేశాలను కూడా ఇస్తాయి. ఏమైనప్పటికీ, నివేదికలు తెల్పుతున్న ప్రకారం ప్రయాణ ఏర్పాట్లు, నివాస ఏర్పాట్లు, స్థానిక పర్యాటక స్థలాల వంటి వాటిని గూర్చిన ఇతర వివరాలను కూడా అడుగుతున్నారు. బ్రాంచ్‌ ఆఫీసుల దగ్గర ఇటువంటి వివరాలను గూర్చిన సమాచారం లేదు, సమయం కూడా లేదు. టూరిస్టుల కోసం సమాచారాన్ని అందించే టూరిస్టు బ్యూరోలను, లేక ట్రావెల్‌ ఏజెంట్లను సంప్రదించవల్సిందిగా సందర్శకులు ప్రోత్సహించబడుతున్నారు.

◼ 1998, సెప్టెంబరు 1 మొదలుకొని ఇండియాలో మూడు క్రొత్త సర్క్యూట్‌లు ఏర్పడ్డాయని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము; కేరళలో తొమ్మిదవ సర్క్యూట్‌; తమిళనాడులో ఆరవ సర్క్యూట్‌; ఆంధ్రప్రదేశ్‌లో మూడవ సర్క్యూట్‌. దీనితో ఇండియాలోని సర్క్యూట్‌ల సంఖ్య 27కు చేరుకుంది.

◼ బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల్లో జరుగుతున్న పని ఇప్పటివరకు ఇండియా బ్రాంచి పర్యవేక్షణలో ఉండగా, 1998, సెప్టెంబరు 1 మొదలుకొని ఆ దేశాల్లోని పని జపాన్‌ బ్రాంచి పర్యవేక్షిస్తుంది.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవా సాక్షులు ఏమి నమ్ముతారు (ట్రాక్ట్‌ నెం. 14)

శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (ట్రాక్ట్‌ నెం. 15)

మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (ట్రాక్ట్‌ నెం. 16)

[ఈ క్రొత్త ప్రచురణలు అస్సామీలోను, కొంకణీ (రోమన్‌ లిపి)లోను లభ్యమౌతున్నాయి]

◼ మరలా అందుబాటులోనున్న ప్రచురణలు:

కృంగిన వారికి ఓదార్పు (ట్రాక్ట్‌ నెం. 20)—ఉర్దూ

త్రిత్వమును మీరు నమ్మవలయునా?—తమిళం

◼ లభ్యమౌతున్న క్రొత్త వీడియో కేసెట్‌:

నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు—ఇంగ్లీషు

[ఈ 25 నిమిషాల వీడియో ప్రత్యేకంగా పిల్లల కోసం తయారు చేయబడింది. విశ్వాసియైన నోవహు అతని కుటుంబసభ్యుల పాత్రలను మన సహోదరులే ధరించారు. అలాగే, కొన్ని వర్ణ చిత్రాలు, స్పెషల్‌ ఎఫెక్ట్‌లు ఉపయోగించి రూపొందించిన వీడియో ఇది. ఆర్కెస్ట్రా సంగీతము, సౌండ్‌ ఎఫెక్ట్‌లు బైబిలు కథను అద్భుతమైన రీతిలో సమర్పించడానికి దోహదం చేశాయి. పిల్లలు సరియైన రీతిలో అర్థం చేసుకునేలా సహాయపడేందుకు, తల్లిదండ్రులకు బోధనా ప్రశ్నలు ఆ వీడియో కవర్‌పై ఉన్నాయి.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి