సెప్టెంబరులోని సేవా కూటాలు
సెప్టెంబరు 7తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (9)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. “ఒక సలహా” అన్న బాక్సును పునఃసమీక్షించండి.
15 నిమి: “మనం మరి గొప్ప క్రియలు చేయగలము.” ప్రశ్నాజవాబులు. క్రొత్త సేవాసంవత్సరం కోసం సహేతుకమైన లక్ష్యాలను పెట్టుకొని, వాటిని చేరుకునేందుకు గట్టిగా కృషిచేయమని అందరినీ ప్రోత్సహించండి.—మన పరిచర్య 116-18 పేజీలను చూడండి.
20 నిమి: “పయినీర్లు ఇతరులకు సహాయపడతారు.” దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఇవ్వబడుతున్న తర్ఫీదుతోపాటుగా, పయినీర్లు పరిచర్యలో ఇతరులకు వ్యక్తిగతంగా సహాయపడేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయని ఒక పెద్ద వివరిస్తాడు. ఆ శీర్షికపై ఆధారపడిన ప్రశ్నలను అడిగి, వాటిపై వ్యాఖ్యానించమని ప్రేక్షకులనూ, మరి విశేషంగా ఆ కార్యక్రమంలో చేరివున్న పయినీర్లనూ, ప్రచారకులనూ ఆహ్వానిస్తాడు. దాన్నుండి సత్ఫలితాలను ఎలా పొందాలో పరిశీలించండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల తామెలా ఆనందించి, ప్రయోజనాన్ని పొందారో పయినీర్లు తెలియజేయవచ్చు. సహాయం పొందిన ప్రచారకులు, ఈ ప్రేమపూర్వకమైన ఏర్పాటును తామెలా ప్రశంసిస్తున్నారో తెలియజేయవచ్చు. పరిచర్యలో మరింత సాఫల్యాన్ని సాధించి ఆనందించేందుకు వారికి సహాయపడిన అంశాల్ని ప్రస్తావించవచ్చు.
పాట 172 (21), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 14తో ప్రారంభమయ్యే వారం
పాట 160 (15)
5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
10 నిమి: దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? ప్రసంగం. వచ్చే వారం నుండి పుస్తక పఠనంలో మనమీ బ్రోషూరును పఠనం చేయడం ప్రారంభిస్తాం. ముందుగా సిద్ధపడమనీ, ఆ బ్రోషూరుతో బాగా పరిచయాన్ని కల్గివుండి, ఇతరులతో ఎలా పఠనంచేయాలో నేర్చుకునేందుకు ప్రతీ వారం తప్పిపోకుండా హాజరవ్వమనీ అందర్నీ ప్రోత్సహించండి. “ఈ బ్రోషూరును ఉపయోగించే విధానం” అనే దానిక్రింద ఉన్న పేరాను చదవండి. బ్రోషూరులో ఉన్న ప్రశ్నలతోనూ, లేఖనాలతోనూ, చిత్రాలతోనూ బోధించే ప్రాముఖ్యతను నొక్కిచెప్పేందుకు కావలికోట జనవరి 15, 1997 16, 17 పేజీల్లో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. ఎక్కువగా మాట్లాడకుండా, అదనపు వివరాలను తీసుకురాకుండా ఉండడం ద్వారా పుస్తక పఠన నిర్వాహకులు, బైబిలు పఠనాల్ని నిర్వహించేవారి ఎదుట మంచి మాదిరిని ఉంచాలి.—మన రాజ్య పరిచర్య జూన్ 1996 3వ పేజీలో 5వ పేరాను చూడండి.
10 నిమి: గత సంవత్సరంలో మన పనెలా చేశాం? సెక్రెటరీ, సేవా పైవిచారణకర్తా కలిసి సంఘ సేవా రిపోర్టునూ, గత సేవా సంవత్సరపు కూటాల హాజరు సంఖ్యను పునఃసమీక్షిస్తారు. వాళ్లు రిపోర్టులో ఉన్న ప్రోత్సాహకరమైన అంశాలను ఎత్తిచూపి, మెరుగుపర్చుకోవాల్సిన విషయాలపై దృష్టిని నిలుపుతారు. ఆగస్టులో ప్రచారకులందరూ సేవలో భాగంవహించారా? ప్రచారకులందరూ సేవలో క్రమంగా భాగంవహించే ప్రచారకులుగా అయ్యేలా సహాయంచేయడంతోపాటూ రానైవున్న నెలల్లో పెద్దలు వేటిపై శ్రద్ధవహించబోతున్నారో క్లుప్తంగా వివరించండి. ప్రాంతీయ పైవిచారణకర్త యొక్క గత రిపోర్టు నుండి సముచితమైన విషయాల్ని పంచుకోండి.
20 నిమి: “1998 ‘దైవిక జీవిత మార్గము’ జిల్లా సమావేశాలు.” (1-16 పేరాలు) ప్రశ్నాజవాబులు. 10, 11 పేరాలను చదవండి. మన పొందికైన క్రైస్తవ అలంకరణనూ, ప్రవర్తననూ జాగ్రత్తగా కాపాడుకోవడాన్ని గూర్చిన, పిల్లలను సరిగా పర్యవేక్షించడాన్ని గూర్చిన లేఖనాధార ప్రాముఖ్యతను నొక్కి తెల్పండి.
పాట 144 (9), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 21తో ప్రారంభమయ్యే వారం
పాట 122 (23)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: “మీ సహోదరులను తెలుసుకోండి.” ప్రశ్నాజవాబులు. కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 1, 1988 10-11 పేజీల్లో ఉన్న వ్యాఖ్యానాల్ని చేర్చండి. ఒకరినొకరు మరింత తెలుసుకోగల్గేలా చొరవ తీసుకోమని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “1998 ‘దైవిక జీవిత మార్గము’ జిల్లా సమావేశాలు.” (17-22 పేరాలు) ప్రశ్నాజవాబులు. 17వ పేరానూ, ఉదాహరించబడిన లేఖనాన్నీ చదవండి. క్రమం, ఇతరులపట్ల శ్రద్ధ కల్గి ఉండాల్సిన అవసరాన్ని గురించి ప్రాముఖ్యంగా సీట్ల విషయంలో నొక్కి తెల్పండి. “జిల్లా సమావేశ జ్ఞాపికలను” పునఃసమీక్షించే క్లుప్త ప్రసంగంతో ముగించండి.
పాట 34 (5), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 28తో ప్రారంభమయ్యే వారం
పాట 17 (23)
12 నిమి: స్థానిక ప్రకటనలు. సెప్టెంబరు నెల సేవా రిపోర్టును ఇవ్వమని అందరికీ గుర్తు చేయండి. పత్రికల పంపిణీని విస్తృతపర్చేందుకు అక్టోబరులో ఇంటింటి సేవాపని ఎక్కువగా చేయడానికి పథకాలు వేసుకోమని అందరినీ ప్రోత్సహించండి. అందింపుల్ని ఎలా సిద్ధపడాలో తెలియజేసే సలహాల కోసం మన రాజ్య పరిచర్య అక్టోబరు 1996 8వ పేజీని సూచించండి. క్రొత్త పత్రికలతో ప్రతిపాదనను ప్రదర్శించండి.
20 నిమి: “పైవిచారణకర్తలు నేతృత్వం వహిస్తారు—సేవా పైవిచారణకర్త.” సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. తన కర్తవ్యాల్ని పునఃసమీక్షించిన తర్వాత, స్థానికంగా పరిచర్య యొక్క లక్ష్యాన్నీ, ప్రభావాన్నీ విస్తృతపర్చుకునేందుకు సంఘం సహకరించగల నిర్దిష్టమైన మార్గాల్ని ఆయన వివరిస్తాడు.
13 నిమి: సంఘంలో ఒక మంచి ప్రచారకునిగా ఉండేందుకు ఏమి అవసరం? ప్రేక్షకులు భాగంవహిస్తుండగా, ఇచ్చే ప్రసంగం. గొప్ప గొప్ప సామర్థ్యాలూ లేదా ప్రతిభా ఉండాల్సిన అవసరమేమీలేదు; బదులుగా, ప్రేమనూ, వినయాన్నీ, ఆసక్తినీ, మెప్పుదలనూ ప్రతిబింబించే ఇష్టపూర్వకమైన దృక్పథాన్ని మనమంతా కల్గివుంటే సరిపోతుంది. ఈ క్రింద ఇవ్వబడినవి ఎందుకు కోరదగినవో కారణాలను పేర్కొనమని ప్రేక్షకుల్ని ఆహ్వానించండి: (1) ఉత్సాహపూరితమైన స్ఫూర్తి, (2) కూటాలకు క్రమంగా హాజరై, భాగంవహించడం, (3) అసైన్‌మెంట్లను అంగీకరించి, నిర్వర్తించడంలో సుముఖతను చూపించడం, (4) పెద్దలతోనూ, సంఘంలో చేయబడిన ఏర్పాట్లతోనూ సహకరించడం, (5) ఇతరులకు మద్దతునివ్వడంలో యథార్థమైన ఆసక్తిని చూపించడం, (6) క్షేత్రసేవలో క్రమంగా భాగంవహించి, ప్రతీనెలా సమయానికి రిపోర్టు ఇవ్వడం.
పాట 25 (13), ముగింపు ప్రార్థన.