కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/97 పేజీ 3
  • చతుర్వర్ణ ప్రెస్సులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చతుర్వర్ణ ప్రెస్సులు
  • మన రాజ్య పరిచర్య—1997
మన రాజ్య పరిచర్య—1997
km 11/97 పేజీ 3

చతుర్వర్ణ ప్రెస్సులు

మేము జూలై 2, 1997న పంపిన సర్క్యులర్‌ లెటర్‌ అందాక మీరు చూపిన ప్రతిస్పందనకు మీకందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాము. నాలుగు రంగుల రెండు ప్రెస్సులను స్థాపించబోతున్నామన్న, కావలికోట, తేజరిల్లు! పత్రికలను పూర్తి రంగులతో ముద్రించబోతున్నామన్న మంచివార్త ఆ లెటర్‌లో ఉంది. ఆ ప్రెస్సులు ఇండియాకు ఏ సమయంలోనైనా చేరుకోవచ్చని ఎదురుచూస్తున్నాం. అవి వచ్చినప్పుడు వాటి కోసం డబ్బు చెల్లించాలి—ఒక్కో ప్రెస్స్‌ను దించుకోవడానికీ, స్థాపించడానికి రూ. 70 లక్షలు చొప్పున ఖర్చవుతుంది.

మా లెటర్‌ అందిన తర్వాత, చాలా సంఘాలూ, చాలా మంది వ్యక్తులు ప్రహరీదుర్గ్‌ ప్రకాశన్‌ సొసైటీకి ప్రెస్స్‌ ఖర్చులకోసం ఉదారంగా విరాళాలను పంపారు. కొందరు అలా చేయడంలో కొనసాగుతున్నారు. మేము చాలా కృతజ్ఞులం. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ కోసం విరాళాలిచ్చే అవకాశం ఇప్పటికీ తెరువబడే ఉంది. మీరు ఇచ్చే మద్దతు కొనసాగుతుందని ఎదురుచూస్తున్నాం. సొసైటీకి నేరుగా విరాళాలను పంపాలని లేదా వడ్డీ లేకుండా డిపాజిట్లు చెయ్యాలని కోరుకునే సంఘాలూ, వ్యక్తులూ 1997, జూలై 2 నాటి ఆ లెటర్‌ చదివి, అందులో ఇవ్వబడిన నిర్దేశాల ప్రకారంగానే చేయాలి.

మన పత్రికలు సత్యాన్ని గూర్చిన ఆహ్లాదకరమైన మాటలతో నిండివుండగా, ఈ చతుర్వర్ణ ముద్రణ ప్రాంతీయ సేవలో మరింత ప్రయోజనకరమైన ప్రభావం చూపించాలనీ, నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరికి ఈ పత్రికలు మరింత ఆకర్షణీయమైనవవ్వాలనీ ప్రార్థిస్తున్నాం.—సామె. 25:11; ప్రసం. 12:10; అపొ. 13:48.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి