క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
1 మనం విడువకుండా సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్త ప్రచారకునిగా ఉండేందుకు ఏమేమి అవసరమై ఉన్నాయి? సిగ్గుగా లేదా బిడియంగా ఉండేవారు కూడా ఇతరులతో సువార్తను పంచుకోవడంలో ఎలా చొరవ తీసుకోగలరు? “సువార్త పరిచారకులుగా అర్హులై ఉన్నాం” అనే అంశంగల ఈ సంవత్సరం ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమంలో ఆలోచనను రేకెత్తించే ఈ ప్రశ్నలకు మరితర ప్రశ్నలకు జవాబులు ఇవ్వబడతాయి.–2 కొరింథీయులు 3:5 పోల్చండి.
2 యెహోవా ప్రజలుగా మనం మన ప్రవర్తన విషయమై జాగ్రత్తగల వారమై ఉండాలి. తాము తోటివారి ఒత్తిళ్ళను ఎలా ఎదిరించారు అనే దానిని గూర్చి చెప్పే యౌవనస్థులచే ప్రోత్సహించే అనుభవాలు ఇవ్వబడతాయి. తమ పిల్లలకు దేవుని పరిచారకులుగా తర్ఫీదివ్వవలసిన అవసరతను గూర్చి తలిదండ్రులకు ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రకటించవలసిన అవసరతను గూర్చి, మనకు అలాగే మనల్ని వినేవారికి దాని వల్ల కలిగే ఆశీర్వాదాన్ని గూర్చి గుణగ్రహించేందుకు మనకందరికీ సహాయం చేయబడుతుంది.–1 తిమో. 4:16.
3 బాప్తిస్మం అనేది తప్పకుండా ఆ రోజున విశిష్టమైన విషయమై ఉంటుంది. ఈ సంఘటనకు ముందు, బైబిలు ఆధారితమైన ఒక ప్రసంగం ప్రత్యేకంగా క్రొత్తగా సమర్పించుకున్న వ్యక్తులనుద్దేశించి చేయబడుతుంది. నిజమే, బాప్తిస్మ విషయం చర్చించబడుతుండగా, దాని భావం స్పష్టం చేయబడుతుండగా హాజరై ఉన్నవారందరూ జాగ్రత్తగా శ్రద్ధనివ్వాలని కోరుకుంటారు. ప్రత్యేక సమావేశ దినాన బాప్తిస్మం పొందాలని కోరుకునేవారు, బాప్తిస్మ అభ్యర్థులను ఉద్దేశించి చేయబడిన ప్రశ్నలను పునఃసమీక్షించేందుకు పెద్దలను ఏర్పాటు చేసేందుకు కావలసినంత సమయం సంఘాధ్యక్షునికి లభించేలా ఆ విషయాన్ని ఆయనకు ముందుగా తెలపాలి.
4 అతిథి ప్రసంగీకుడిచ్చే ముఖ్య ప్రసంగం మరొక విశిష్టమైన విషయమై ఉంటుంది. “దేవుని పరిచారకులుగా అర్హతపొంది, సిద్ధపడ్డాం” అనేది దాని శీర్షిక. పరిచారకులుగా మనల్ని సిద్ధంచేసే ముఖ్యమైన నాలుగు ఏర్పాట్లను గూర్చి చర్చించబడుతుంది, ఆ ప్రసంగంలో విశ్వాసాన్ని పెంపొందించే అనుభవాలు కూడా చేర్చబడి ఉంటాయి.
5 కార్యక్రమం అంతటికీ హాజరై ఉండేందుకు ఇప్పుడే పథకం వేసుకోండి. ఆసక్తిగల వ్యక్తులు, బైబిలు విద్యార్థులు కూడా ఈ దైవపరిపాలనా విద్యా దినం నుండి ప్రయోజనం పొందగల్గేలా వారిని తప్పకుండా ఆహ్వానించండి. సువార్త పరిచారకులుగా మనం “కావలసినంత అర్హులై” ఉన్నామని మనమీ విధంగా నిశ్చయపరచుకోగలం.