విజయవంతమైన పునర్దర్శనాలకు ఫలవంతమైన బోధ అవసరం
1 పునర్దర్శనాలు మన ప్రాంతీయ పరిచర్య యొక్క ముఖ్యమైన మరియు ఆనందదాయకమైన భాగమై ఉన్నాయి. ఆసక్తిగల వ్యక్తులను సందర్శించడంలో మనమెందుకు శ్రద్ధగలవారమై ఉండాలి? శిష్యులను చేసే ఈ పని ద్వారా యెహోవా నామం ప్రసిద్ధమౌతుంది, ఘనపరచబడుతుంది, దైవ భయం గలవారు జీవ మార్గాన్ని కనుగొనడానికి సహాయం చేయబడుతుంది. (2 కొరిం. 2:17–3:3) యెహోవా నామము పరిశుద్ధపరచబడడం మరియు ఇతరుల జీవితాలు ఇమిడి ఉన్నాయని గుర్తించడం మనం తిరిగి వెళ్ళక ముందు బాగా సిద్ధపడేందుకు మనల్ని కదిలించాలి.
2 ఒక మంచి ఉపాధ్యాయుడు అప్పటికే వేయబడిన పునాదిపై నిర్మించుకునేందుకు విద్యార్థికి తోడ్పడతాడు. విద్యార్థులు ఒక్కోరోజు పొందిన జ్ఞానాన్ని పాఠశాల ఉపాధ్యాయుడు పెంచుతున్నట్లుగానే, సాధారణంగా మనం కూడా మొదట వెళ్ళినప్పటి అదే అంశంపై అదనపు వ్యాఖ్యానాలు చేయాలి. దాని వల్ల ఆ విషయాన్ని గూర్చి మరింతగా తలంచడానికి, అభివృద్ధిని సాధించడానికి వీలౌతుంది.
3 “దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?” అనే బ్రోషూర్ను అందించిన తరువాత మీరు తిరిగి వెళ్ళినప్పుడు, ఇలా చెప్పడం ఫలవంతంగా ఉంటుందని మీరు కనుగొంటారు:
◼ “నేను క్రితం వచ్చినప్పుడు, బైబిలులో పేర్కొనబడిన ‘అంత్య దినాలను’ గూర్చి, మనకు దాని భావమేమిటనే దాని గూర్చి మనం చర్చించుకున్నాము. మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని మనకెలా తెలుసని మీరు ఆశ్చర్యపోవచ్చు. (2 తిమో. 3:1) యేసు శిష్యులు ఆ ప్రశ్నకు జవాబు పొందేందుకు జిజ్ఞాస కలిగి ఉండిరి. [మత్తయి 24:3 చదవండి.] జవాబుగా, నేడు మనం చూస్తున్న పరిస్థితులను యేసు వర్ణించాడు. వీటిలో ముందెన్నడూ చూడనటువంటి విపత్తు మరియు హింస ఇమిడి ఉన్నాయి.” పేజీ 19లోని 3, 4 పేరాల్లో చర్చించబడిన సూచనను చూపించండి. ప్రతిస్పందన అనుకూలమైనదైతే, 20వ పేజీలోని 5 నుండి 8 పేరాల్లో ఇవ్వబడిన విషయాలను చర్చించండి. మీరు మళ్ళీ వెళ్ళి బ్రోషూర్ మొదటి పేజీలో లేవదీయబడిన ప్రశ్నలకు జవాబిస్తారని చెప్పండి.
4 “జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు?” అనే బ్రోషూర్లో ఆసక్తిని రేకెత్తించేందుకు మీరీవిధంగా చెప్పవచ్చు:
◼ “జీవించడంలోని మన ఉద్దేశమేమిటనే దాని గూర్చిన సంభాషణను పునఃప్రారంభించాలని నేను ఎంతో ఆతురతతో ఉన్నాను. మనం నేడు అనుభవిస్తున్న సంక్షోభానికి బదులుగా శాంతియుతమైన పరిస్థితుల్లో ఈ భూమిపై మనం సంతోషంతో జీవించాలనే దేవుడు ఉద్దేశించాడని మనమిరువురమూ అంగీకరిస్తామని నేననుకుంటున్నాను. ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మీరు అనుకుంటున్నారా?” జవాబు చెప్పనివ్వండి. యెషయా 55:11 చదివి, 30వ పేజీలోని 25-27 వరకున్న పేరాలలోని తలంపులను చర్చించండి. జీవితంలో తగిన సంకల్పాన్ని కనుగొనేందుకు వ్యక్తిగత బైబిలు పఠనాన్ని కలిగి ఉండడం శ్రేష్ఠమైన మార్గమని సిఫారసు చేయండి.
5 “భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!” అనే బ్రోషూర్లో క్రితం ఆసక్తి చూపించినవారి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు మీరు దానిని మళ్ళీ చూపించి ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “ఈ బ్రోషూర్ కవరుపై చిత్రీకరించబడిన అందమైన లోకాన్ని గూర్చి మనం మాట్లాడుకున్నాం. అక్కడ జీవించాలని కోరుకునే ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ఎందుకంత ప్రాముఖ్యమో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.” నలభై ఒకటవ బొమ్మను తీసి, యెషయా 9:6 చదవండి. యోహాను 3:16 చదివి, విధేయులవ్వవలసిన అవసరతను నొక్కిచెబుతూ 62వ చిత్రాన్ని చూపించండి. బైబిలును పఠించడం ద్వారా మరియు దాని ఉపదేశాన్ని అన్వయించుకుని జీవించడం ద్వారా ఎలా విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చో నేర్చుకోవడానికి యెహోవాసాక్షులు ప్రజలకు సహాయపడుతున్నారని వివరించండి.
6 ప్రతి సందర్శనం తరువాత, మీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకునే ఉద్దేశంతో దానిని విశ్లేషించండి. మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి: చెప్పడానికి నా మనస్సులో కచ్చితమైన విషయమేదైనా ఉందా? నేను బైబిలుపై శ్రద్ధ కేంద్రీకరించానా? మొదటి సందర్శనంలో నేను వేసిన పునాదిపై నిర్మించానా? నా అందింపు బైబిలు పఠనానికి నడిపే విధంగా సిద్ధం చేయబడిందా? అనుకూలమైన జవాబులు మీరు దేవునివాక్యపు మంచి బోధకునిగా ఉండాలని మీరు ప్రయత్నిస్తున్నారనే నమ్మకాన్నిస్తాయి.