విశ్వాసంలేని వారికి సహాయపడండి
1 ఈ ఆధునిక కాలాల్లో విద్యావంతులుగాను, ఆలోచనల్లో పురోభివృద్ధి గలవారిగాను దృష్టించబడడం జనప్రియమైనదైంది. ఆత్మీయ విలువలు నిర్లక్ష్యం చేయబడుతుండగా, మానవ తత్త్వశాస్త్రాలు, ఊహా సిద్ధాంతాలు ప్రశంసించబడుతున్నాయి. సరళమైన వాస్తవాల్లోను, అర్థంచేసుకోగల సత్యాల్లోను ఆసక్తి ఉన్న చిత్తశుద్ధి గల ప్రజలు జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? అనే పుస్తకాన్ని పరిశీలించే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఈ పుస్తకం విశ్వాసం కొరవడిన వారికి సహాయపడగలదు. (రోమా. 1:19, 20) ఆసక్తిని చూపించే వారందరినీ పునర్దర్శనం చేయాలని తీర్మానించుకోండి.
2 మీ చర్చను మీరు ఈ విధంగా ఆరంభించవచ్చు:
◼ “మానవ కుటుంబం పరిణామం ద్వారా వచ్చిందనే విశ్వాసానికి చాలామంది విద్యావంతులు మద్దతునిస్తారనేది మీకు తెలుసని నేను నమ్ముతున్నాను. ప్రతిదీ ప్రమాదవశాత్తు ఉనికిలోకి వచ్చిందని అది బోధిస్తుంది. దానిని గూర్చి మీరేమనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] ఈ తలంపు ఇప్పటికీ ఒక సిద్ధాంతంగా చెప్పబడుతుంది. ఒక సిద్ధాంతమనేది ‘ఒక ఊహ’ లేక ‘నిరూపించబడని కల్పన.’ భూమి బల్లపరుపుగా ఉండేదని మానవులు శతాబ్దాలుగా నమ్మారు; అది వాస్తవాల ఆధారితం కాని వెర్రి కల్పనయని మనకిప్పుడు తెలుసు. పరిణామ సిద్ధాంతం విషయంలో కూడా అదే నిజం కావచ్చా?” నాల్గవ పేజీలోని ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను చదివి, యెషయా 42:5 ను చర్చించండి.
3 లేదా మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “దేవునియందు విశ్వాసం లేని వారిని కలవడం సాధారణమే. సంవత్సరాల క్రితం అది ఎంతో అరుదుగా ఉండేది. అనేకులు దేవునియందు విశ్వాసాన్ని కోల్పోయారని మీరెందుకు అనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] మన లోకంలో భయానకంగా పెరుగుతున్న హింస మరియు విపత్తు కారణంగా తాము దేవునియందు విశ్వాసాన్ని కోల్పోతున్నామని కొందరు చెబుతారు. సర్వశక్తిమంతుడైన దేవుడున్నట్లయితే, ఆయన ఈ బాధకంతటికీ ఎందుకు అంతం తేవడం లేదు? అని వారు వాదిస్తారు. ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు కనుగొనలేనివారు తరచూ నాస్తికులౌతారు. దేవుడు ఉన్నాడని, ఆయన త్వరలోనే భూమిని సంతోష సమాధానాలు గల స్థలంగా మార్చుతాడని నిరూపించడానికి ఎంతో రుజువుంది.” పేజీ 196లోని 19వ పేరానందలి లేఖనాధార తలంపులను ఉపయోగించడం ద్వారా చర్చ కొనసాగించండి.
4 సముచితమైన చోట, మీ బైబిలును చేతిలో ఉంచుకుని ఈ విధంగా చెబుతూ సంభాషణను ఆరంభించవచ్చు:
◼ “మన దినాల్లో బైబిలు పఠనమనేది ఎందుకు ఆచరణయోగ్యమైనదో చూపించడానికి మేము మళ్ళీ వస్తున్నాము. చాలామంది ప్రజలకు బైబిలు ఉంది, అయితే కొందరు మాత్రమే దానిని చదవడానికి సమయం తీసుకుంటారు. తమకు ఇక మతంలో ఏ మాత్రం విశ్వాసం లేదని కొందరు మాతో నిర్మొహమాటంగా చెబుతారు. మీరు దానిని గూర్చి ఏమని భావిస్తారు? [జవాబు చెప్పనివ్వండి.] బైబిలు దైవ ప్రేరేపిత వాక్యమని నిరూపించే వాటిలో దాని ప్రవచనాల నెరవేర్పు ఒకటి.” పేజీ 234లోని 6వ పేరానందలి లేఖన భాగాలను చదవండి.
5 ఈ తలంపు అనుకూల ప్రతిస్పందనను తేవచ్చు:
◼ “భూమిపై మన చుట్టూ ఉన్న వస్తువుల నుండి సౌందర్యాన్ని మరియు జ్ఞానం యొక్క అద్భుతమైన రుజువును మనం చూడగలం. అందమైన ఈ సూర్యాస్తమయ దృశ్యం తగిన ఉదాహరణ.” పేజీలు 12, 13లలోని చిత్రాన్ని చూపించండి. “ఆలోచించేందుకు కొన్ని విషయాలు,” అనే దాని నుండి కొన్ని అంశాలను పేర్కొని, మన ప్రపంచాన్ని గూర్చిన ముఖ్యమైన ప్రశ్నలకు ఈ పుస్తకం ఎలా సంతృప్తికరమైన జవాబులను ఇస్తుందో వివరించండి.
6 తమ సృష్టికర్తయందు విశ్వాసముంచడానికి గట్టి ఆధారాన్ని కనుగొనేందుకు ఇతరులకు సహాయపడడానికి ఈ పుస్తకాన్ని ఉపయోగించడం ద్వారా మనం వారికి ఒక ఆశీర్వాదంగా ఉండగలము.