కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/95 పేజీ 3
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవితంలోని అతిప్రాముఖ్యమైన కార్యకలాపాల కోసం మనల్ని సిద్ధపరిచే పాఠశాల
    మన రాజ్య పరిచర్య—2002
  • ప్రశ్నాభాగము
    మన రాజ్య పరిచర్య—1991
  • పురోభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఈ పనిలో మనకు యెహోవా తర్ఫీదు ఇస్తున్నాడు
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 5/95 పేజీ 3

ప్రశ్నాభాగం

◼ మనం కూటాలకు ఏయే పుస్తకాలను తెచ్చుకోవాలి?

ప్రతివారం సంఘ కూటాల్లో మనం ప్రయోజనకరమైన ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతాము. (యెష. 48:17; హెబ్రీ. 10:24, 25) అయితే, మనం ఎంతగా ప్రయోజనం పొందుతామనేది మనం బాగా సిద్ధపడి వచ్చామా లేదా అనే దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

కుటుంబంలోని ప్రతి సభ్యునికి తన స్వంత పఠన పుస్తకాలు, కూటాలకు అవసరమైన మరితర వస్తువులు ఉండడం మంచిది. వీటిలో బైబిలు, పాటలపుస్తకం, పఠించబడుతున్న ప్రచురణ(లు), నోటుపుస్తకం, ఒక పెన్ను లేదా పెన్సిలు చేరి ఉంటాయి.

దైవపరిపాలనా పాఠశాల కొరకు, దైవపరిపాలనా పాఠశాల షెడ్యూలు మరియు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకం అవసరం. ఇవి ఇవ్వబడే విద్యార్థి ప్రసంగాల అంశాన్ని గుర్తుంచుకోవడానికి, దాని తర్వాత పాఠశాల అధ్యక్షుడు ఉపదేశాన్నిచ్చేటప్పుడు దానిపై శ్రద్ధనిలపడానికి తోడ్పడుతాయి. మన స్వంత ప్రసంగాలను, ప్రాంతీయ పరిచర్య అందింపులను మెరుగుపరచుకోవడానికి ఆ ఉపదేశాన్ని, సలహాలను మనం వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు. జనవరి నుండి, ఆంగ్ల భాషా షెడ్యూలులోని ఉపదేశ ప్రసంగాల్లో అనేకం యెహోవాసాక్షులు—దేవునిరాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంపై ఆధారపడినవై ఉంటాయి. కుటుంబంలోని ప్రతి సభ్యుడు తన స్వంత ప్రతిని తీసుకురావడం ఆచరణాత్మకం కాకపోవచ్చు; అయితే కుటుంబమంతా చూసుకోవడానికి వీలుగా ఒక పుస్తకాన్ని తెచ్చుకోవచ్చు. అయితే, ప్రాంతీయ భాషా షెడ్యూళ్ళను ఉపయోగించే సంఘాల్లో, షెడ్యూలునందు ఇవ్వబడిన దాని ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి బైబిలు చర్చనీయాంశములు అనేదాని స్వంత ప్రతిని మరియు అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట (ఆంగ్లం) అనే పుస్తకాన్ని తెచ్చుకోవడం మంచిది.

సేవాకూటం కొరకు, మనం ప్రస్తుతం వాడుతున్న మన రాజ్యపరిచర్య మరియు తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకం తెచ్చుకోవడం అవసరం. ప్రదర్శించబడనున్న అందింపుల్లో ఉపయోగించే సాహిత్యాల వంటి, కూటంలో సూచించబడే ఏ ప్రచురణలనైనా తెచ్చుకోండి. పెద్దల దగ్గర మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకం ఉండాలి.

పిల్లలు నిశ్శబ్దంగా కూర్చుని, సంఘ కూటాలకు శ్రద్ధనిచ్చేలా తల్లిదండ్రులు చూసుకోవాలి. వాళ్ళకు చదవడం రాక ముందే కావలికోట మరియు ఇతర ప్రచురణల వ్యక్తిగత ప్రతులను ఇవ్వడం వారు ఆసక్తి చూపించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. పిల్లలకు దైవపరిపాలనా ప్రచురణలను గౌరవించడం, వాటిని ఉపయోగించడం నేర్పినట్లయితే, జీవితాంతం ఆరోగ్యకరమైన ఆత్మీయ అలవాట్లు అలవడుతాయి.

మనం పూర్తిగా సంసిద్ధమై వచ్చినప్పుడు, మనం సంఘ కూటాల నుండి పొందే ఆనందం మరియు సంతృప్తి మరింత అధికమౌతాయి. (2 తిమో. 3:17) మనం “ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, [దేవుని] చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై” ఉన్నామని నిశ్చయపరచుకొనుటకు ఇది శ్రేష్ఠమైన మార్గము.—కొలొ.1:9.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి