కావలికోట మరియు తేజరిల్లు!—సత్యముగల పత్రికలు
1 కావలికోట యొక్క జనవరి 1, 1994, సంచిక “కావలికోట మరియు తేజరిల్లు!—సత్యాన్ని తెల్పే సమయోచిత పత్రికలు” అనే శీర్షిక 11 వ పేరాలో మన పత్రికలు “ప్రజల వాస్తవావసరతలతో వ్యవహరించి, నిజంగా వారి జీవితాలను స్పర్శించిన సమయోచిత శీర్షికలను” ప్రచురిస్తున్నాయని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము ఈ పత్రికలను విస్తృతంగా పంచిపెట్టాలని ఇష్టపడతాము. ఏప్రిల్ మరియు మే నెలల్లో కావలికోట మరియు/లేక తేజరిల్లు! లను ఒక సంవత్సరపు చందా క్రింద అందించటం సూచింపబడిన అందింపుగా ఉంది.
2 ఈ పత్రికల ప్రతులను అందించడానికి లేక వాటి కొరకు చందా చేయించడానికి ఇంటింటి పని మనకు చక్కని అవకాశాన్ని ఇస్తుంది. ఫలభరితమైన తటస్థ సాక్ష్యం మరియు పునర్దర్శనాలు కూడ వీటిని క్రమంగా అందించడానికి దోహదపడతాయి. వీధి సాక్ష్యం మరియు మన ప్రాంతంలోని వ్యాపార సంస్థలను సందర్శించటం కూడ వీటి పంపకాన్ని అధికం చేయటానికి ఫలభరితమైన మార్గాలు.
3 చర్చించవలసిన విషయాలు: పక్ష పత్రికలుగా వెలువడుతున్న కావలికోట యొక్క ఏప్రిల్ 1 సంచిక “ఒక శ్రేష్ఠమైన లోకం—కేవలం ఒక స్వప్నమా?” మరియు “ఒక శ్రేష్ఠమైన లోకం—సమీపంలో ఉంది!” అనే అంశాలను చర్చిస్తుంది. ఇది నిశ్చయంగా దేవుని రాజ్యాన్ని ప్రకటించాలనే ఆ పత్రిక యొక్క ఆశయంతో ఏకీభవిస్తుంది. రెండవ శీర్షిక యేసుక్రీస్తు పరిపాలన క్రింద ఒక నిత్య పరదైసు ఏ విధంగా ఒక వాస్తవం అవుతుందో చూపిస్తూ ముగుస్తుంది.—లూకా 23:43.
4 పక్షపత్రికలలోని ఏప్రిల్ 15 సంచికలో “నమ్మదగిన నడిపింపును మీరెక్కడ కనుగొనగలరు?” అనే ప్రశ్న చర్చించబడుతోంది. మే సంచికల్లోని “మతం మీ అవసరతలను తీరుస్తుందా?” మరియు “బైబిల్ని ఎందుకు చదవాలి?” అనే శీర్షికలు ఈ అంశాన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తాయి. తమ జీవితంలో అర్థం మరియు సంకల్పం లోపిస్తుందని భావించే ప్రజలతో మనం సంభాషణను సులభంగా ప్రారంభించగలగాలి.
5 అందింపులను పెంచడం: అందింపులను పెంచడానికి జనవరి 1 కావలికోట నాలుగు సలహాలను అందిస్తుంది. మనము (1) పత్రికపై శ్రద్ధగల వారముగా ఉండాలని ప్రోత్సహింప బడుతున్నాము. మనము వాటిని చదివేటప్పుడు, మన ప్రాంతంలోని ప్రజలకు ఏ శీర్షికలు చాలా నచ్చేవిగా ఉంటాయి అని మనము కొంచెం ఆలోచించాలి. అలాగే, మనము మనతోపాటు ప్రతులను క్రమంగా తీసుకువెళ్తుంటే, వాటిని మనము సహోద్యోగులు, పొరుగువారు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, లేక మనతోపాటు కొనుగోలు చేసే వారికి అందించవచ్చు.
6 మనము (2) మన అందింపులను క్లుప్తంగా ఉంచాలని జ్ఞాపకం చేయబడుతున్నాము. ఆసక్తికరమైన ఒక విషయాన్ని ఎన్నుకొనండి, దాన్ని కొద్ది మాటల్లోనే చెప్పండి. మీరు ఇంటి వారిని పత్రిక తీసుకునేలా ఒప్పింపగలిగితే, మీరు కలిసిన వ్యక్తితో లేక ఆ ఇంటిలోని ఇతరులతో అదే “మాట్లాడగలదు.”
7 ఇంకొక అవసరత ఏమంటే (3) అవసరానికి తగినట్లు మార్చుకొన గలగటం. చర్చించటానికి వేర్వేరు శీర్షికలను మనస్సులో ఉంచుకొనటం మంచిది—ఒకటి యౌవనస్థుల కొరకు, ఇంకొకటి పురుషుల కొరకు, మరి స్త్రీల కొరకు వేరొకటి.
8 చివరిగా, మనము (4) అందింపుల విషయమై మన వ్యక్తిగత గమ్యాలను నియమించుకోవలసిన అవసరం ఉంది. సంఘం ఒక నిర్దిష్ట కోటాను నియమించ లేదు, కాని మనము వ్యక్తిగతంగా మన కొరకు ఒక గురిని నియమించు కొనవచ్చు. అలా చేయటం పత్రిక యొక్క చందాను లేక ప్రతులను అందించటంలో మనం ఉత్సాహంగా ఉండటానికి మనకు ఎక్కువ పురికొల్పును ఇవ్వగలదు.
9 దేవుని రాజ్యాన్ని గురించి ఇతరులు తెలుసుకోవాలని మనము కోరుతాము. రాజ్య వర్తమానాన్ని విస్తరింప చేయటంలో పత్రికలు అందిస్తున్న చక్కని సహాయం నుండి పూర్తి లాభాన్ని పొందుదాము.—మత్త. 10:7.