గృహస్థుని అవసరాలకు తగినట్లుగా సాహిత్యాన్ని అందించండి
1 ఎక్కువ తగినట్లుగా ఉన్నచోట నిరంతర జీవితము పుస్తకాన్ని అందించినను, సాధ్యమైన ప్రతిచోటా మనం ఈ నెలలో యంగ్ పీపుల్ ఆస్క్ అనే పుస్తకాన్ని చూపిస్తాము. అప్పుడప్పుడు, ఒకవేళ యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకం అందుబాటులో లేని భాష మాత్రమే గృహస్థునికి తెలిసినట్లైతే, పాకెట్ సైజ్ పుస్తకాన్నొకదాన్ని అందించవచ్చు. యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకాన్ని ఎవరికైనా అందించవచ్చు అంటే తాతయ్యలకు, యౌవనులైన లేదా లేత వయస్కులైన పిల్లలున్న తలిదండ్రులకు, లేకపోతే యౌవనులకే దాన్ని అందించవచ్చు, ఎందుకంటే యౌవనులను కలవరపెట్టే సమస్యలను గూర్చి అనేకమంది యౌవనులు చింతిస్తున్నారు.
2 ఈ క్రిందివిధమైనదేదైనా చెప్పడం సరియైనదని మీరు కనుగొనవచ్చు:
◼ “చిక్కులతో కూడిన ఈ కాలాల్లో పెరగడం అంత సులభమేమీకాదు. యౌవనులు తాము ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవసరతగల అనేక క్రొత్త పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ‘నేను మద్యం సేవించాలా? మాదకద్రవ్యాలు తీసుకోవాలా? వ్యతిరేక లింగంగల వ్యక్తితో ఎలాంటి ప్రవర్తన సరియైనది?’ ఇలాంటి మూలమైన వివాదాంశాలనుగూర్చి యౌవనులడిగినప్పుడు, వారు తరచూ వివాదాస్పదమైన జవాబులతో తలమునకలౌతారు. అయితే అనేకమంది యౌవనులు సలహా కొరకు ఎటు చూస్తారని మీరనుకొంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] క్వశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అనే ఈ పుస్తకం సహాయకరమైన సమాచారాన్ని అందిస్తుంది. [వేర్వేరు విషయాలు పొందుపర్చిన విషయసూచికకు అవధానాన్ని మళ్లించండి.] సూటియైన, వాస్తవమైన జవాబులు యౌవనులకు అవసరమైయున్నవి. ఈ పుస్తకంలోని జవాబులు, బైబిలు చెప్పేదానిచే బలపర్చబడ్డాయి.”
3 మీరు ఉపయోగించగల్గే మరొక అందింపు:
◼ “ఈనాడు యౌవనులు అనేక ఒత్తిళ్లకు గురౌతున్నారు. విజయవంతంగా ఎదుర్కోవడానికి వారికి సహాయమవసరం. మనం మనకు సాధ్యమైనంతమట్టుకు వాళ్లకు సహాయపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక అభ్యాససిద్ధమైన నడిపింపునందజేసే దాని కొరకు మనం ఎదురుచూడమా? [జవాబు చెప్పనివ్వండి.] అత్యంత గొప్ప ఒత్తిళ్లలో కొన్ని తమ స్నేహితులైన ఇతర యౌవనులనుండే వస్తాయి. ఈ పుస్తకమందలి 76, 77 పేజీలలో వున్న చిత్రాలను గమనించండి. [ఈ చిత్రాలకు సంబంధించిన వ్యాఖ్యలకు, 77 వ పేజీనందలి ఇటాలిక్కులలో వున్న పేరాలకు అవధానాన్ని మళ్లించండి.] ఈ అధ్యాయమందలి తరువాతి పేజీలలో యథార్థమైన, ఆచరణయోగ్యమైన జవాబులు యివ్వబడ్డాయి.”
4 ఇవి ప్రాముఖ్యంగా యౌవనులకు నిజంగా “అపాయకరమైన కాలములు.” (2 తిమో. 3:1) యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకం నిజంగా ఒక యౌవనుడు ఈనాటి సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. దీనిలోని 39 అధ్యాయాలూ ఎన్నో దృష్టాంతాలతో నిండి ఉన్నాయి. మరి శీర్షికలు వాస్తవమైనవి, ఆచరణయోగ్యమైనవి. కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడెల్లా, ఈ మంచి సాహిత్యాన్ని ఉపయోగించడానికి చురుకుగా ఉండండి.
5 మన సందేశంలోని ఆత్మీయ సంబంధ విషయంపై గృహస్థుడు ఆసక్తిని చూపిస్తాడని మీరు తలంచినచోట, ప్రాముఖ్యంగా వారు కొంత బైబిలు జ్ఞానంగల వ్యక్తులైతే, నిరంతర జీవితము పుస్తకాన్ని అందించడానికి సిద్ధంగా ఉండండి. బైబిలు సిద్ధాంతాలను వివరించడానికి ఈ పుస్తకం బైబిలు లేఖనాలతో ఎలా నిండివుందో చూపి, వెనువెంటనే వారితో ఒక క్రమ పద్ధతిలో పఠనం చేయడానికి ఏర్పాటు చేసుకోండి. మీ అందింపులో యోహాను 17:3 చదివి, రక్షణకు అతి ప్రాముఖ్యమైన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ పుస్తకం సహాయపడుతుందని సూచించండి. ఆసక్తి చూపిన ఎవరినైనా మార్చి 26 వ తేదీన జరిగే జ్ఞాపకార్థ దినానికి హాజరవ్వమని నిశ్చయంగా ఆహ్వానించండి.
6 వివిధ రకాల పాకెట్ సైజ్ పుస్తకాలను మీతోపాటు తీసుకు వెళ్లడం కూడా ప్రయోజనకరమైందిగా కనుగొనగలరు, తద్వారా ఇంటింటి సేవలో ఉద్భవించిన విషయాన్నిబట్టి ఆయా గృహస్థుల అవసరాలకు తగిన సాహిత్యాన్ని మీరు అందించగల్గుతారు. మృతుల పరిస్థితి, బైబిలు ప్రామాణికత, నిజమైన శాంతి భద్రతలను చూడగలమనే మన నిరీక్షణ, కుటుంబ జీవితం, సంతోషాన్ని కనుగొనే మార్గం మొదలైన అంశాలు, తరుచూ ఎదురౌతాయి, మరి ఈలాంటి ప్రతి విషయాన్ని గూర్చి చర్చించే మంచి సాహిత్యాలతో మనం ఆశీర్వదించబడ్డాము.
7 కాబట్టి ఈ నెలకు సంబంధించిన సాహిత్యాన్ని అందించడంలో అనుకూల దృక్పథం కల్గివుండండి, అయితే మనం బైబిలు సందేశానికి ‘అన్ని రకాల ప్రజలను ఆకర్షింపజేసి,’ దానిలోని సత్యానికి సంబంధించిన జీవజలాల దగ్గరకు వారిని చేర్చాలని కోరతాము గనుక, మీతోపాటు వివిధ సాహిత్యాలను తీసుకు వెళ్లండి.—1 తిమో. 2:4; ప్రక. 7:17.