కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/91 పేజీ 2
  • అక్టోబరు కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1991
  • ఉపశీర్షికలు
  • అక్టోబరు 7తో ఆరంభమగు వారము
  • అక్టోబరు 14తో ఆరంభమగు వారము
  • అక్టోబరు 21తో ఆరంభమగు వారము
  • అక్టోబరు 28తో ఆరంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1991
km 10/91 పేజీ 2

అక్టోబరు కొరకైన సేవా కూటములు

అక్టోబరు 7తో ఆరంభమగు వారము

పాట 17 (2)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ప్రస్తుత పత్రికలనుండి మాట్లాడదగు అంశములను ఉన్నత పరచుము.

20 ని: “సువార్తనందించుట​—⁠సూటిగా సమీపించుటద్వారా పఠనములను ప్రారంభించుట.” ప్రశ్నా-జవాబుల చర్చ. 3, 4 పేరాలను చర్చించిన తర్వాత క్రియేషన్‌ పుస్తకము మరియు లైఫ్‌ ఇన్‌ ఏ పీస్‌పుల్‌ న్యూ వరల్డ్‌ కరపత్రమును ఉపయోగించుచు సూటిగా సమీపించుటను ప్రదర్శించుము. సూటిగా సమీపించుట యింటి యజమాని ఆసక్తి ఎంతమేరకు ఉన్నదో తీర్మానించుటకు నీకు సహాయము చేయును. ప్రారంభమందు సాహిత్యము అందింపబడినను లేకపోయినను ఆసక్తిచూపిన వారందరి యొద్దకు మరలా వెళ్లు అవసరతను నొక్కి తెల్పుము. ఈ వారాంతపు ప్రాంతీయసేవలో సూటిగా సమీపించుటద్వారా బైబిలు పఠనములను ప్రారంభించుటకు ప్రయత్నించుమని అందరిని ప్రోత్సహించుము.

15 ని: ప్రశ్నా భాగము, “మన రాజ్య పరిచర్య ఒక క్రొత్త నమూనా పొందినది,” మరియు దైవ పరిపాలనా వార్తలు. ఈ వారాంతపు ప్రాంతీయ సేవలో పాల్గొనుమని ప్రోత్సహించుము.

పాట 157 (73) మరియు ముగింపు ప్రార్థన.

అక్టోబరు 14తో ఆరంభమగు వారము

పాట 214 (23)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు. ఈ వారాంతమందు ప్రాంతీయ సేవలో ఉపయోగించు పత్రికలనుండి అంశములను పునఃసమీక్షించుము. సమయము అనుమతించుకొలది ఒకటి లేక రెండు అందింపులను ప్రదర్శించుము.

20 ని: క్రొత్త సేవా సంవత్సరము కొరకు వ్యక్తిగత గమ్యములను ఉంచుకొనుము. సేవాకాపరి సంఘముయొక్క గత సేవా సంవత్సరపు పని విధానమును పునఃసమీక్షించును. అభివృద్ధి జరిగిన విషయములను ఆప్యాయముగా మెచ్చుకొనుము. క్రొత్త సేవా సంవత్సరములో స్థానికముగా ధ్యానమివ్వవలసిన అంశములను పేర్కొనుము, మరియు అభ్యాససిద్ధమైన సలహాలనిమ్ము. ప్రాంతీయ కాపరియొక్క చివరి నివేదికను పునఃసమీక్షించుము. అవసరమైన వాటికొరకు మరియు ఇవ్వబడిన సలహాలను ఎట్లు అన్వయించవలెననుటకు కావలసిన సమాచారమును కనుగొనుటకు ఇండెక్స్‌ ఉపయోగించుము. నమ్మకమైన సేవయందు సహించువారు ఇతరులను ప్రోత్సహింతురు. (హెబ్రీ. 6:10) గత సేవా సంవత్సరములో మంచి అభివృద్ధి సాధించిన ఇద్దరు ప్రచారకులను లేక పయనీర్లను పరిచయము చేయుము. 1992 కొరకు వారు ఎటువంటి గురులను కలిగియున్నారు! అంతేకాకుండ, అనేక సంవత్సరములు నమ్మకముగా సేవచేసిన ఒక ప్రచారకునికి లేక పయనీరును కూడ పరిచయము చేయుము. వారెట్లు కష్టములను ఎదుర్కొనిరి, అయితే యెహోవా మరియు ఆయన సంస్థనుండి వచ్చిన సహాయముతో వారెట్లు వాటిని అధిగమించిరో చెప్పనిమ్ము. 1992వ సేవా సంవత్సరములో తమ పరిచర్యను అభివృద్ధి చేసికొనుటకు విలువకరమైన గురులను పెట్టుకొనుమని అందరిని ప్రోత్సహించుము.

15 ని: “ఇతరులకు మేలు చేయుట కొరకు మనము బాధ్యత తీసికొనుట.” ప్రశ్నా-జవాబుల చర్చ. 4వ పేరాను విచారించునప్పుడు, అనేక సంవత్సరాలుగా నమ్మకమైన మాదిరిగా యున్నందుకు ఒక ప్రచారకునికి, ఒక పెద్ద రాజ్యమందిరములో మెచ్చుకొనుటను ప్రదర్శించుము. సహాయము చేయుటకు ఏమి చేయవచ్చునని విచారణ చేయవచ్చును. ఏమైనను, మెచ్చుకొనుటను నొక్కి తెలియజేయుము.

పాట 94 (59) మరియు ముగింపు ప్రార్థన.

అక్టోబరు 21తో ఆరంభమగు వారము

పాట 44 (110)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు. మరియు అక్కౌంట్సు రిపోర్టు. విరాళములు అందినట్లు సొసైటి తెల్పిన మాటలను చదివి, సొసైటి కార్యక్రమములకు ఆలాగే సంఘ కార్యక్రమములకు ప్రచారకులు యిచ్చిన ఆర్థిక మద్దతును ప్రశంసించుము.

20 ని: “సంఘపుస్తక పఠన ఏర్పాటు​—⁠భాగము 3: ప్రాంతీయ సేవకొరకైన కేంద్రము.” ప్రాంతీయ అన్వయింపుతో ఇద్దరు సంఘపుస్తక పఠన నిర్వాహకులు శీర్షికను చర్చింతురు. సేవా ఏర్పాట్లతో ప్రచారకులు సహకరించినప్పుడు వచ్చు పరస్పర ప్రయోజనములను నొక్కి తెల్పుము. ప్రాంతీయసేవ కొరకైన కూటములకు ఉపయోగించు గృహములయెడల గౌరవముచూపు అవసరతను ప్రస్తావించుము, మరియు ఆతిథ్యపూర్వకముగా తమ గృహములను అనుమతించు వారిని మెచ్చుకొనుము. (km 4/86 ప. 3) ఆయా సమయములలో ఇతర ప్రాంతములు అవసరమగును గనుక, ఎవరైనా తమ గృహమును అనుమతించుటకు ఇష్టపడినట్లయిన వారు సంఘ అధ్యక్షునికి లేక సేవాకాపరికి ఈ విషయమును తెలియజేయవచ్చును. సేవా గురులను పెట్టుకొనుటను గూర్చి చేసిన గతవారపు చర్చలోని అంశములను జోడించుము. ప్రచారకులు పరిచర్యలో ఆ గురులను చేరుటకు సేవాకాపరి సహాయముచేసి, ప్రోత్సహించవచ్చును.

15 ని: “యూత్స్‌​—విల్‌ యు పాస్‌ ది టెస్ట్‌ ఆఫ్‌ క్రిస్టియన్‌ లాయల్టి?” వాచ్‌టవర్‌ జూన్‌ 15, 1991లోని శీర్షికపై ఆధారపడిన ప్రసంగము. ద్వంద్వ జీవితము గడుపుటలోని అవివేకమును నొక్కి తెల్పుము. (ప్రాంతీయ భాషలో; “మనస్సునందును శరీరమందును పరిశుభ్రముగా ఉండుడి,” కావలికోట ఏప్రిల్‌ 1, 1991.)

పాట 171 (16) మరియు ముగింపు ప్రార్థన.

అక్టోబరు 28తో ఆరంభమగు వారము

పాట 187 (93)

10 ని: ప్రాంతీయ ప్రకటనలు. ప్రస్తుత పత్రికలనుండి ఒకటి లేక రెండు అంశములను నొక్కి తెల్పుము. ఈ వారాంతపు ప్రాంతీయసేవలో పాల్గొనుమని ప్రచారకులను ప్రోత్సహించుము.

20 ని: “ప్రాంతీయ సేవలో పూర్ణ హృదయులై యుండుడి​—భాగము 3: ఇతరుల అభివృద్ధికి తోడ్పడుట.” ప్రశ్నా-జవాబుల చర్చ. సేవలో ఉన్నప్పుడు క్రొత్తవారికి ఎట్లు సహాయము చేయవలెనో అనుభవజ్ఞుడైన ప్రచారకునిచే ప్రదర్శించుము. నిజరూపక అభ్యంతరములను అధిగమించుటకు అనుభవజ్ఞుడైన ప్రచారకుని సలహాల నుపయోగించుచు క్రొత్తవారితో అభ్యాస కార్యక్రమములను చూపించుము.

15 ని: స్థానిక అవసరతలు లేక ప్రాంతమునకు తగిన ఉపోద్ఘాతములను చర్చించుట. రీజనింగ్‌ పుస్తకములోని పుటలు 9-15పై ఆధారపడి చర్చించుము. సూటిగా సమీపించుట ద్వారా ఈ నెలలో బైబిలు పఠనములను ప్రారంభించిన ప్రచారకుల అనుభవములను క్లుప్తముగా వివరించవచ్చును.

పాట 70 (39) మరియు ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి