ఇతరులకు మేలుచేయుట కొరకు మనము బాధ్యత తీసికొనుట
1 అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఇట్లు సలహానిచ్చెను: “ఉపకార ధర్మముచేయ మరచిపోకుడి.” (హెబ్రీ. 13:16) అతి క్లిష్ట పరిస్థితులలో సహితము తమ సహోదరులకు సహాయము చేయువారి ప్రయత్నములు దేవుని యెడల మరియు పరస్పర ప్రేమయెడల వారి ప్రేమను బలపరచును. (యోహాను 13:35) మనము కూడ ఉపకార ధర్మము చేయుటకు ప్రోత్సహింపబడుచున్నాము.
2 దీని కొరకు, మనము ఆత్మీయముగా సమృద్ధిగా పోషింపబడుటకు మరియు సంసిద్ధులగుటకు యెహోవా తగిన ఏర్పాట్లను చేసియున్నాడు. మనకు ప్రతి వాచ్‌టవర్ మరియు అవేక్!లలో ఎంత సమాచార సంపదను కలిగియున్నాము! ప్రతి పత్రిక ముట్టిన వెంటనే దానిని చదువుట ద్వారా ఎంత ఆనందము కలుగును. లేఖన వర్తమానమును ధ్యానించుచు, ప్రాంతీయసేవలోను ఆలాగే ఇతరులతో చేయు సంభాషణలలోను ఉపయోగించు అంశములను మనము గుర్తుపెట్టుకొనవచ్చును. అదే ప్రకారము, ప్రతికూటమునకు ప్రత్యేకముగా ప్రతివారము జరుగు కావలికోట పఠనమునకు సిద్ధపడుటకు సమయమును సద్వినియోగము చేసికొనవచ్చును. దేవుని వాక్యమును వ్యక్తిగతముగా పఠించుట మనము “క్రీస్తు మనస్సును” అభివృద్ధి పరచుకొనుటకు మరియు మనము కలిసికొనువారికి అనుకూలముగా అందజేయుటకు మనలను శక్తిమంతులను చేయును.—1 కొరిం. 2:14-16; కీర్త. 19:14.
3 అంగీకరించదగిన బాధ్యతలు: యెహోవా వద్దకు వచ్చు వారందరు ఆయనకు సమర్పించుకొందురు. సమర్పణకు సంబంధముగల బాధ్యతలను అంగీకరించుట ద్వారా, మనము యెహోవా వారమని మరియు సాతాను యొక్క లోకము దాని నేర ప్రవృత్తి విధానములనుండి మనలను మనము వేరు పరచుకొనియున్నామని ప్రదర్శింతుము. క్రీస్తు యేసు ఉంచిన మాదిరిని అనుసరించుటద్వారా, యితరుల కొరకు మనము ఒక శ్రేష్టమైన మాదిరిని ఉంచగలము. (1 పేతు. 2:21) 1992వ సేవా సంవత్సరములో “మన స్వంత బాధ్యతా భారమును మోయుట” అను అంశముగల ప్రాంతీయ సమావేశముల వంటి సమావేశముల కార్యక్రమములు, మన సమర్పణకు తగినట్లుగా జీవించుటకు మనలను ప్రోత్సహించును.
4 క్రమముగా సంఘకూటములకు హాజరగుట, ఒకరి కొరకు క్షేమాభివృద్ధికరమైన తలంపులను పంచుకొనుటకు మనలను అనుమతించును. వ్యక్తిగత పఠనము మరియు కూటములకు సిద్ధపడుట మనము ఇతరులతో పంచుకొనగల చక్కని వర్తమానమును మనకు సమకూర్చును. ఇతరులపై అటువంటి వ్యక్తిగత శ్రద్ధ చూపుట ద్వారా, ఆప్యాయతను మరియు కుటుంబసహిత స్నేహత్వమును పురికొల్పును. కూటములలో పాల్గొనుటద్వారా హెబ్రీ. 10:24, 25 లో వ్రాయబడిన పౌలు మాటలతో మనము నిజముగా అంగీకరించుచున్నామని, యితరులను ప్రోత్సహించుటకు మన బాధ్యతను అంగీకరించుచున్నామని చూపించుదుము.
5 మరిన్ని బాధ్యతల కొరకు చేరుకొనుము: 1992వ సేవ సంవత్సరములో సహాయ పయనీరు లేక క్రమ పయనీరు సేవవంటి మరిన్ని బాధ్యతలను చేపట్టుటకు చేరుకొనగలమా? ఇన్ని గంటలా అను దానిపై అసాధారణ దృష్టినుంచుటకు బదులు, సమకూర్చు పనిలో భాగము వహించు అవకాశమును వృద్ధిపరచుటపై ఎందుకు దృష్టిసారించకూడదు? (యోహా. 4:35, 36) అర్హతగల ప్రచారకులు లేక పయనీర్లు అయిన యితరులతో క్రమముగా పనిచేయుట, పరిచర్యలో మన నైపుణ్యతలను అభివృద్ధి పరచుకొనుటకు మనకు సహాయము చేయును. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో సహాయ పయనీర్లుగా చేయుట సంఘములో యోగ్యమైన పురికొల్పును కలిగించును. సాధ్యమైనట్లయిన క్రమ పయనీరు సేవకై ఎందుకు దరఖాస్తు చేయకూడదు లేక క్రమముగా లేక ఈ సంవత్సరములో వీలైనంత తరచుగా సహాయపయనీరు సేవచేయుటకు ఎందుకు ఏర్పాటు చేసికొనకూడదు?
6 సంఘములో సమర్పించుకొని బాప్తిస్మంపొందే అర్హత సంపాదించిన పురుష సభ్యులకు బాధ్యతలు సిద్ధముగా ఉన్నవి. (1 తిమో. 3:1-10, 13) కూటములలో చక్కని ఆలోచనాపూర్వక వ్యాఖ్యానములు, దైవపరిపాలనా పాఠశాలలో భాగము వహించుట, ప్రదర్శనలను చేయుటకు అడిగినప్పుడు లేక సేవా కూటమందలి ఇతర భాగములను చేయుటకు అంగీకరించుటద్వారా అందరు సేవచేయుట కొరకు తమ ఇష్టతను కనబరచవలెను. పిల్లలు సహితము ఈ విషయములలో మరియు రాజ్య మందిరములో తమ ప్రవర్తనద్వారా మాదిరికరముగా ఉండవచ్చును. రాజ్యమందిరమును శుభ్రపరచుటకు ఏర్పాటు చేయబడినప్పుడు లేక అటువంటి యితర అవసరతలయందు తమ పుస్తక పఠనముతో కలిసిపనిచేయుట యందు వారు సహాయపడగలరు.—km 4/76 పు. 1, 8.
7 “నా కిష్టమే” అను మాటలతో యితరులకు మేలు చేయు బాధ్యతను అంగీకరించుటలోని తమ యిష్టతను యేసు వ్యక్తపరిచెను. (లూకా 5:12, 13) ఆయన మాదిరిననుసరించుచు మనముకూడా మన సహోదరులను, ఆసక్తిగలవారిని, ప్రాంతీయ సేవలో మనము కలిసికొను సహృదయులను యెహోవా సంస్థతో క్రమముగా సహవసించవలెనని ప్రోత్సహించి సహాయపడగలము. “అందరి యెడల . . . మేలు చేయు” మన బాధ్యతను అంగీకరించుటకు తీర్మానపూర్వక ప్రయత్నము మరియు బహుశ మన పక్షమై వ్యక్తిగత త్యాగము అవసరము. (గల. 6:10) అయితే నెరవేర్చబడిన మేలును మనము చూసినప్పుడు, “అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని చెప్పిన పౌలుతో అంగీకరించగలము.—హెబ్రీ. 13:16.