దైవపరిపాలనా వార్తలు
◆ జూన్ మాసములో అన్ని సమయములోకెల్లా క్రొత్త శిఖరముగా చిలి 36,968 మంది ప్రచారకులను రిపోర్టు చేసినది. ఇది గత సంవత్సరపు సరాసరిపై 12 శాతము అభివృద్ధి. క్రొత్త శిఖరముగా 53,967 గృహ బైబిలు పఠనములు కూడా రిపోర్టు చేయబడినవి.
◆ జూన్ మాసమునకు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ యొక్క రిపోర్టు గత సంవత్సరపు సరాసరిపైన 4 శాతము అభివృద్ధిని చూపుతున్నది. మొత్తము 1,31,106 మంది రిపోర్టు చేశారు.
◆ జూన్ మాసములో ఇండియా 10,272 మందితో ఒక క్రొత్తశిఖరమును రిపోర్టు చేసినది. ఇది గత సంవత్సరపు సగటుపైన 17 శాతము అభివృద్ధి. క్రమ పయినీర్లు, పునర్దర్శనములు, మరియు బైబిలు పఠనములలో నూతన శిఖరములు గలవు.