కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/90 పేజీ 1
  • దేవుని వాక్యమును సిఫారసు చేయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యమును సిఫారసు చేయుట
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంభాషణ అంశమును ఉపయోగించుట
  • నేటి లోకంలో బైబిలు విలువ
    మన రాజ్య పరిచర్య—1993
  • దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2013
  • బ్రోషూర్లతో రాజ్య సువార్తను ప్రకటించండి
    మన రాజ్య పరిచర్య—1996
  • మన సమస్యలు అను బ్రోషూరునుండి పఠనములు ప్రారంభించుట
    మన రాజ్య పరిచర్య—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 12/90 పేజీ 1

దేవుని వాక్యమును సిఫారసు చేయుట

1 అనేకులు నేడు బైబిలును ప్రస్తుత కాలానికి విలువలేనిదిగాను, వాస్తవికతకు దూరమైనదిగాను దృష్టిస్తారు. ఏమైనను దేవుని వాక్యము జీవితములను మార్చు శక్తిని కలిగియున్నది. (హెబ్రీ. 4:12) ఇది అనేక రకముల ప్రజల ఆలోచన, ప్రవర్తన, మరియు వృద్ధి చెందిన వైఖరులనుబట్టి ప్రదర్శించబడినది. (ఎఫె. 4:24) బైబిలు ఉపదేశమును అన్వయించుట సంతోషకర కుటుంబ వాతావరణమునకు దోహదపడును. జాతి, రంగు, సాంఘిక స్థాయి ఎట్టిదైనను ఇరుగుపొరుగు సంబంధములను అది వృద్ధి చేయును.​—లూకా 10:29-37.

2 దేవుని వాక్యముతోగల మన వ్యక్తిగత అనుభవము ఇతరులు తమకైతాము బైబిలు యొక్క నిజమైన విలువను పరిశోధించునట్లు ప్రోత్సహించుటకు మనలను నడుపవలెను. దీనిని చేయుటకు చాలా శ్రేష్టమైన రూపకల్పన “బైబిలును ఎందుకు చదువవలెను?” అను మన నూతన సంభాషణ అంశమునందు అందించబడినది. న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ మరియు, త్రిత్వము లేక “లుక్‌” బ్రొషూర్లతోపాటు మన డిశంబరు పరిచర్యలో ఈ అంశమును ఎట్లు ఉపయోగించగలము?

సంభాషణ అంశమును ఉపయోగించుట

3 క్లుప్తమైన పరిచయము తరువాత మనమిలా చెప్పవచ్చను: “ఈనాడు కుటుంబములపై ప్రభావము చూపు అనేక వత్తిడులు, సమస్యలున్నందున అభ్యాసయుక్తమైన సహాయము నివ్వగల ఒకే ఒక నిజమైన మూలము వైపు మేము అవధానమును మళ్లించుచున్నాము. గతములో ప్రజలు తరచు నడిపింపుకొరకు బైబిలు వైపు చూశారు. ఇప్పుడు కాలములు మారిపోయాయి. కాదా? ఈనాటి సమస్యలను, అనగా మత్తుమందుల వినియోగము, బాల్యనేరములు, విచ్ఛిన్నమౌ కుటుంబములు మొదలగు సమస్యలను తీర్చుకొనుటకు బైబిలు సహాయపడగలదని మీరనుకుంటారా? [సమాధానమివ్వనివ్వండి.] 2 తిమోతి 3:16 లో బైబిలు ఏమి చెబుతుందో గమనించండి. [చదువుము.] బైబిలు అట్టి ప్రయోజనకరమైన ప్రభావమును చూపగలదని మీరనుకుంటారా? [సమాధానమివ్వనివ్వండి.] సమస్యలనెదుర్కొనుచున్నప్పుడు లేక జీవితములో నిర్ణయములు చేసుకొనునప్పుడు అనేకమంది ప్రజలకు ఏదో రకమైన నడిపింపు అవసరము మరియు అలా కోరుకుంటారు. అట్లు కోరుకొనరా? ఈ క్రింది దేవుని వాక్యము మనలను ఎక్కడకు నడుపుతుందో పరిశీలించుము. [యోహాను 17:3 చదువుము.] బైబిలు వ్యక్తిగత కష్టములను దిద్దుకొనుటకు స్పష్టమైన నడిపింపునిస్తూ, భవిష్యత్తు కొరకు ఒక నిశ్చయమైన నిరీక్షణను చూపిస్తుంది.” దేవుని వాక్య జ్ఞానమును పొందవలెనని వ్యక్తి నిజమైన ఆసక్తిని ప్రదర్శించినట్లయిన న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క లేక బ్రొషూర్లలో ఒకదానియొక్క విలువను మనము ప్రదర్శించవచ్చును.

4 న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ను పరిచయము చేయునప్పుడు ఇంటివారు ఒకవేళ బైబిలును కలిగియుండి దానిని చదవటం సులభంగా ఉన్నట్లు చూస్తన్నాడేమో అడుగుము. తన జవాబుపైన ఆధారపడి న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యందలి కొన్ని సహాయకర రూపాలవైపు అవధానమును మళ్లించుము. ఆధునిక భాష. దైవనామమును తిరిగి చేర్చుట మొదలగునవి. దానితో పాటు రీజనింగ్‌ పుస్తకము 276-80 పేజీల నుండి ఒకటి లేక రెండు అంశములను ఉపయోగించుటయును నీవు సహాయకరముగా కనుగొందువు. ఆసక్తి చూపువారికి వ్యక్తిగత గృహ బైబిలు పఠనమును అందించుము.

5 త్రిత్వము బ్రోషూరు వైపు అవధానమును మళ్లించునప్పుడు మీరెట్లు చెప్పవచ్చును: “యథార్థపరులైన అనేక మంది ప్రజలు త్రిత్వమును నమ్మునట్లు బోధించబడి యున్నారు. అయినను వారు గ్రహించుకొనుటకు ఆ సిద్ధాంతమును ఎంతో కష్టమైన దానిగా కనుగొనుచున్నారు. ఈ బ్రోషూరు చరిత్రాత్మక దృష్టియందును, మరియు బైబిలు చెప్పుదాని వెలుగులోను చాలా వివరముగా త్రిత్వమును పరీక్షించుచున్నది. దానిని చదువుటకు మీరు యిష్టపడతారా? “లుక్‌” బ్రోషూరును ఉపయోగించు విషయములో ఆహ్వానించునట్లు చేయు పై అట్టను చూపుట ద్వారా గాని, లేక 15వ పుటయందు “చెడు విషయములను​—దేవుడెందుకు అనుమతించును?” అను భాగము నుపయోగించుట ద్వారాగాని ఇంటివారి ఆసక్తిని మీరు పట్టుకొనవచ్చును.

6 డిశంబరు మాసములో ప్రజలను బైబిలు చదువ ప్రోత్సహించు అవకాశముల యెడల మెలకువగా నుండుము. ఆసక్తి చూపినవారిని పునర్దర్శనములతో వెంటాడుటకు త్వరపడుము. దేవుని వాక్య శక్తియెడల నిజమైన మెప్పుకోలును వృద్ధి చేసుకొనుటకు వారికి సహాయపడుము. దాని సూత్రములను తమ జీవితములలో అన్వయించుకొనుట ద్వారా ఇప్పుడును, మరియు రాబోవు జీవితమందును నిత్య ప్రయోజనములను పొందుదురు.​—1 తిమో. 4:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి