ప్రత్యేక కార్యక్రమమునకు పత్రికలను ఆర్డరు వేయుము
1 ప్రతి సంవత్సరము ది వాచ్‌టవర్ చందా అందింపుకొరకై ప్రత్యేకముగా మే మరియు జూన్ నెలలు నిర్ణయించుకొనబడుచున్నవి. అనగా ఇదే సమయములో ది వాచ్‌టవర్ మరియు అవేక్! అందింపులలో మనము శిఖరాగ్ర సంఖ్యలకు చేరుకొనుచున్నాము.
2 ఈ సంవత్సరము మే నెలలో ప్రాంతీయ పనియందు 1,91,929 గంటలను గడిపిన మనము 88,879 పత్రికలను అందించి, 2,088 చందాలను పొందియున్నామని మీకు తెలియునా? ఇవన్ని శిఖరాగ్ర సంఖ్యలే.
3 ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలను పంచుటకు ప్రత్యేక ప్రయత్నములను చేసిన ప్రచారకులందరితోపాటు అదనముగా పత్రికలను అడిగిన 996 మంది ఆక్సిలరీ పయినీర్ల శిఖరాగ్ర మద్దతును కూడా మనము కలిగియున్నాము. కాబట్టి, వచ్చే సంవత్సరము ప్రాంతీయ సేవకు మద్దతు నిచ్చుటకై పెరుగుచున్న ప్రచారకులను బట్టి ఇంకా ఎక్కువ పత్రికలు అవసరమగును.
4 గతములో కొంతమంది తమ యొద్ద తగినన్ని పత్రికలు అందుబాటులో లేక నిరూత్సాహపడిరి. కారణమేమనగా కేవలము వారి ఆర్డర్లు కావలసినంత ముందుగా ఆఫీసుకు చేరనందువలననే. ప్రత్యేక కార్యక్రమమునకు (స్పెషల్ కాంపెయిన్) సిద్ధపడుటలో సంఘముల అవసరతను ముందుగనే చూచి అదనముగా ఎన్ని సంచికలు కావలసియుండునో యోచించి, ఆ సమయమునకు తగినంత ముందుగానే ఆర్డరు వేయవలెను. అనగా ఇది ఎంత ముందుగా ఉండవలెను? కనీసము మూడు నెలలు ముందుగా మీరు ఆ పనిచేసినట్లయిన మీరు కోరిన అవసరత మేరకు నిశ్చయముగా సరఫరా చేయబడవచ్చును.
5 ఒకవేళ, సేవాకాపరులు సమయానుసారముగా సంఘపత్రికా అవసరతలను పరిశీలిస్తూ, అవసరమగు సవరణలను చేయుటకు బాధ్యతగల సహోదరులకు సహాయపడినట్లయిన, అది సహాయకరముగా యుండును. కాబట్టి, ప్రత్యేక అవసరతలను ముందుగానే ఎదురు చూచి, తగినంత ముందుగా వాటి ఆర్డర్లు ఆఫీసుకు చేరునట్లు నిశ్చయపరచుము.